ETV Bharat / sukhibhava

కరోనా మహమ్మారి ఊపిరి తీస్తుందిలా..! - రక్తకేశనాళికలు

కరోనా మహమ్మారి ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజలాడిస్తోంది. ఇది ఊపిరితిత్తుల్లో కల్లోలం సృష్టించే వైరస్‌. అయితే చాలా మందికి వైరస్‌ ఏ విధంగా ప్రాణాంతకంగా మారుతుందనేది తెలియదు. ఇంతకీ అది ఎలా విజృంభిస్తుందో తెలుసా!

Like the corona pandemic can affect the lungs
కరోనా మహమ్మారి ఊపిరి తీస్తుందిలా..!
author img

By

Published : Apr 22, 2020, 2:08 PM IST

Updated : May 21, 2020, 4:50 PM IST

రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా మహమ్మారి ఉపిరిత్తుల్లో చేరి ప్రాణాలను తీస్తుంది. దీని వ్యాప్తి శ్వాసకోశపై ఎలా ప్రభావం చూపుతుందంటే..

సాధారణంగా శ్వాస ప్రక్రియ ఇలా..

శ్వాసకోశంలోని రక్తకేశనాళికలు ముడుచుకున్నప్పుడు ఎర్రరక్త కణాలు కార్బన్‌ డై ఆక్సైడ్‌ను బయటికి పంపి ఆక్సిజన్‌ను లోపలికి తీసుకొంటాయి. శ్వాసకోశంలోని టైప్‌1 కణాలు ఆక్సిజన్‌ను గ్రహిస్తాయి. టైప్‌2 కణాల్లో మృదువైన ఉపరితలం ఉండటంతో ఊపిరితిత్తులు దెబ్బతినకుండా కాపాడతాయి.

కణాల్లో వ్యాప్తి..

సార్స్‌ కోవ్‌-2 వైరస్‌ నోరు, ముక్కు, కళ్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించి శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తుల్లోని శ్వాస కోశాల్లోకి ప్రవేశిస్తుంది. వైరస్‌పై ఉండే కొమ్ములాంటి ప్రొటీన్‌(ఎస్‌ ప్రొటీన్‌) శ్వాసకోశంలోని టైప్‌2 కణాల్లోని ఏసీఈ2 రిసెప్టర్లను పట్టుకుంటుంది. వెంటనే వైరస్‌ ఆర్‌ఎన్‌ఏను ఆ కణంలోకి చొప్పిస్తుంది. ఆ తర్వాత కణాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని భారీ సంఖ్యలో వైరస్‌ తామరతంపరగా పునరుత్పత్తి చేసుకుంటుంది. దీంతో వైరస్‌ల సంఖ్య ఎక్కువైపోయి కణం బద్ధలై పోతుంది. దాంట్లో నుంచి బయటపడిన అసంఖ్యాక వైరస్‌లు మళ్లీ వేరే కణాలను పట్టుకుని ఇలా ఆ ప్రాంతం మొత్తాన్ని దెబ్బతీస్తాయి.

చివరికి శ్వాస క్రియకు అవస్థలు

ఇన్ఫెక్షన్‌ సోకిన భాగాన్ని వైరస్‌ల నుంచి రక్షించేందుకు మన రోగ నిరోధక కణాలు దాడిచేస్తాయి. ఈ క్రమంలో అవి ఆరోగ్యవంతమైన వాయుకోశాల్లోని కణాలనూ దెబ్బతీస్తాయి. ఫలితంగా శ్వాసక్రియ దెబ్బతింటుంది.

వ్యాధి ముదిరే క్రమం ఇలా..

  1. కరోనా సోకిన తర్వాత టైప్‌2 కణాలు ఇన్‌ఫ్లమేటరీ సంకేతాలు(శరీర కణం దెబ్బతిందని) ఇస్తుంది. వెంటనే శరీరంవ్యాధి నిరోధక కణాల ఉత్పత్తిని ప్రారంభిస్తుంది.
  2. ఈ వ్యాధి నిరోధక కణాలు ‘సైటోకైన్స్‌’ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఇవి రక్తనాళికలు వ్యాకోచించడానికి కారణమవుతాయి. ఇవి మరిన్ని వ్యాధి నిరోధక కణాలను దెబ్బతిన్న ప్రదేశానికి రప్పిస్తాయి.
  3. సమస్య ముదురుతున్న దశలో శ్వాసకోశాల్లోకి ద్రవాలు చేరతాయి.
  4. ఈ ద్రవాలు అక్కడి మృదువైన భాగాన్ని దెబ్బతీస్తాయి. ఫలితంగా లోపలికి ఆక్సిజన్‌ వెళ్లడం తగ్గుతుంది. ఎక్కువసార్లు ఊపిరి పీల్చుకోవాల్సి వస్తుంది.
  5. న్యూట్రోఫిల్స్‌(తెల్ల రక్తకణాల్లో ఒక రకం)ను ఇన్ఫెక్షన్‌ సోకిన చోటికి తరలిస్తాయి. ఇన్‌ఫెక్షన్‌కు గురైన కణాలను ధ్వంసం చేస్తాయి.
  6. టైప్‌1, టైప్‌2 కణాలు ధ్వంసం అవుతాయి. దీంతో వాయుకోశాలు దెబ్బతిని ‘అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌’ వస్తుంది.
  7. వాపు తీవ్రంగా ఉంటే ప్రొటీన్లతో కూడిన ద్రవాలు రక్తంలోకి చేరి శరీరంలోకి ప్రవహిస్తాయి. దీనివల్ల సిస్టమిక్‌ ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్‌ సిండ్రోమ్‌(ఎస్‌ఐఆర్‌ఎస్‌) అనే సమస్య తలెత్తుతుంది.
  8. ఇది శరీరమంతా రక్తం ఇన్‌ఫెక్షన్‌, వివిధ అవయవాలు విఫలం అవ్వడానికి కారణం అవుతుంది. చివరికి ప్రాణాంతకంగా మారుతుంది.
  • ఈ క్రమంలో టైప్‌2 కణాల ఉపరితలం దెబ్బతిని వాయుకోశాల పనితీరు మందగిస్తుంది.
  • టైప్‌1 కణాల సంఖ్య కూడా తగ్గిపోవడంతో శరీరానికి ఆక్సిజన్‌ అందడం కష్టమవుతుంది.
  • ఈ వాయు కోశాలు శరీరంలో కణాలు దెబ్బతిన్నప్పుడు ఉత్పత్తి అయ్యే ద్రవాలతో పూర్తిగా నిండిపోతాయి.

ఎప్పుడు ఏ లక్షణాలు

  • పొడి దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉంటాయి.
  • న్యూమోనియా వస్తుంది
  • శ్వాసలో ఇబ్బందులు
  • ఆసుపత్రిలో చేరడం
  • రిస్క్‌గ్రూపులో ఉన్న వ్యక్తులు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తిన వారు
  • ఐసీయూలో చేరడం
  • వెంటిలేటర్‌ అవసరం
  • కోవిడ్‌-19కు సంబంధం లేని సమస్యలు తలెత్తడం
  • ఈ క్రమంలో ఏదశలోనైనా సరైన చికిత్స లభించిన పేషెంట్లు కోలుకొంటారు.

ఇదీ చదవండి: భూతాపం... ఉరుముతున్న ఉపద్రవం

Last Updated : May 21, 2020, 4:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.