ఓవైపు మండే ఎండలో చలువ పదార్థాలు తినాలని అనిపిస్తుంటుంది. అంతేకాకుండా శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటికి వెళ్లిపోతుంది. తద్వారా శరీరం శక్తిని కోల్పోతుంది. కాబట్టి కోల్పోయిన నీటితో పాటు శక్తిని తిరిగి పొందడానికి కీరా దోస బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఎండాకాలంలో అందరూ దీన్ని నేరుగా తీసుకోవడంతో పాటు సలాడ్స్‌లోనూ ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో కీరా దోసకాయ వల్ల ఆరోగ్యానికి ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం రండి..
కీరాదోసతో ఎన్నో ఉపయోగాలు, ఆరోగ్యం కోసం కీరా
By
Published : Mar 30, 2021, 2:00 PM IST
మండే ఎండలో శరీరానికి చలువనిచ్చేలా ఏదైనా తింటే బాగుండనిపిస్తోందా? అయితే ఉందిగా కీరా దోస. ఎన్నో పోషకాలు నిండి ఉన్న ఈ దోసకాయ వల్ల శరీరంలోని విషతుల్యాలు తొలగిపోవడంతో పాటు చెడు కొవ్వు తగ్గి బరువు కూడా అదుపులో ఉంటుంది. ఎండాకాలంలో ఎక్కువగా లభ్యమయ్యే ఈ కీరా ఆరోగ్యానికే కాదు.. అందాన్ని పెంచడంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
చెమట రూపంలో కోల్పోయిన నీటితో పాటు శక్తినివ్వడానకిి కీరా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఎ, బి, సిలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
నీటిశాతం ఎక్కువగా ఉండే పదార్థాల్లో కీరాదోస కూడా ఒకటి. దాదాపు 96 శాతం వరకు నీరు ఉండే దీన్ని తినడం వల్ల శరీరం కోల్పోయిన నీటిని తిరిగి పొందచ్చు. తద్వారా శరీరానికి చలువ కూడా చేస్తుంది.
కీరాదోసను రోజూ సలాడ్స్‌లో భాగం చేసుకోవడం లేదంటే కొవ్వు శాతం తక్కువగా ఉండే పెరుగులో ముంచుకుని తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.
బీపీ ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే. కాబట్టి ఇలాంటి సమస్యతో బాధపడుతున్న వారు కీరా దోసకాయ తినడం వల్ల సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.
కీరా దోసకాయను రోజూ తినడం వల్ల శరీరంలోని విషతుల్యాలు తొలగిపోతాయి. అలాగే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడంలో కూడా ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది.
కళ్లు అలసిపోవడం, కళ్ల కింద క్యారీ బ్యాగ్స్.. వంటి సమస్యలతో బాధపడుతున్న వారు చల్లటి కీరాదోస ముక్కల్ని కళ్లపై కాసేపు పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పొటాషియం, మెగ్నీషియం, సిలికాన్.. వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. కాబట్టి చర్మానికి సంబంధించిన రకరకాల బ్యూటీ ట్రీట్‌మెంట్లలో కీరాను ఉపయోగిస్తుంటారు. ఇందులో ఉండే సిలికా వల్ల జుట్టు, గోళ్లు దృఢంగా తయారవుతాయి. అలాగే ఇది చర్మానికి సహజసిద్ధమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
కీరా దోసలో ఉండే కొన్ని సమ్మేళనాలు మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అలాగే ఇది జ్ఞాపకశక్తిని పెంచడంతో పాటు నాడీవ్యవస్థను సురక్షితంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
కీరా దోస క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడి క్యాన్సర్ వచ్చే అవకాశాలను చాలా వరకు తగ్గిస్తుందని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. కాబట్టి దీన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం చాలా ముఖ్యం.
కీరా దోసకాయ రసాన్ని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. అందుకే జ్వరంతో బాధపడుతున్న వారికి దీన్ని ఎక్కువగా ఇస్తుంటారు.
ఇందులో ఉండే పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచడంలో తోడ్పడుతుంది. అలాగే నోటి దుర్వాసనను పోగొట్టి తాజా శ్వాసను అందించడంలో కీరాదోస బాగా ఉపయోగపడుతుంది. ఇది దంతాల ఆరోగ్యానికి కూడా అత్యవసరం.
కొలెస్ట్రాల్ లేని ఈ కీరా దోసను తినడం వల్ల గుండె జబ్బులు కూడా దూరమవుతాయి. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
కీరాలో ఎక్కువగా ఉండే విటమిన్ 'కె' మనం తీసుకున్న ఆహారం నుంచి శరీరం ఎక్కువ మొత్తంలో క్యాల్షియం గ్రహించేలా చేస్తుంది. తద్వారా ఎముకలు దృఢంగా తయారవుతాయి.
ఈ రోజుల్లో ఒత్తిడి సర్వసాధారణమైపోయింది. దీనివల్ల పలు రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి దోసకాయలో ఉండే 'బి' విటమిన్ అడ్రినల్ గ్రంథి పనితీరుని మెరుగుపరచి.. తద్వారా ఒత్తిడి వల్ల ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావాలు కలగకుండా కాపాడుతుంది.
చూశారుగా.. కీరా దోసకాయ తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్ని లాభాలున్నాయో! మరి మీరు కూడా వేసవిలో ఎక్కువగా దొరికే కీరా తిని బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలను మీ సొంతం చేసుకోండి.