ETV Bharat / sukhibhava

చర్మ సంరక్షణ కోసం నేను ఈ చిట్కాలు పాటిస్తున్నా !

ఆపాదమస్తకం అందంగా మెరిసిపోవాలని సినీతారలు అనుకోవడం సహజం. ఈ నేపథ్యంలో సిల్వర్‌ స్ర్కీన్‌పైనే కాదు నిజ జీవితంలోనూ ఎంతో అందంగా కనిపించేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు మన ముద్దుగుమ్మలు. ప్రత్యేకించి చర్మ సంరక్షణ విషయంలో మరింత శ్రద్ధ వహిస్తుంటారు. ఈ క్రమంలో ఇంట్లో లభించే సహజసిద్ధమైన చిట్కాల్ని పాటించడమే కాకుండా.. తమ శరీరతత్వానికి సరిపడే ఆహారాన్ని మాత్రమే తీసుకుంటుంటారు. ఎంత రుచిగా ఉన్నా సరే.. శరీరానికి అలర్జీ కలిగించే ఆహారాన్ని పక్కన పెడుతుంటారు. ఈ క్రమంలో తాను కూడా గతంలో ఫుడ్‌ అలర్జీతో బాధ పడ్డానంటోంది రష్మిక మందన. టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అందాల తార సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ సందర్భంగా ఇన్‌స్టా వేదికగా తన స్కిన్‌ కేర్‌ టిప్స్‌ని అందరితో షేర్‌ చేసుకుందీ ముద్దుగుమ్మ.

చర్మ సంరక్షణ కోసం నేను ఈ చిట్కాలు పాటిస్తున్నా !
చర్మ సంరక్షణ కోసం నేను ఈ చిట్కాలు పాటిస్తున్నా !
author img

By

Published : Aug 8, 2020, 2:47 PM IST

‘ఛలో’, ‘గీత గోవిందం’, ‘డియర్‌ కామ్రేడ్‌’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’... సినిమాలతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది రష్మిక. ఆకట్టుకునే అందం, అలరించే అభినయంతో పాటు తనకు మాత్రమే సాధ్యమయ్యేలా క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అశేష అభిమానులను సొంతం చేసుకుందీ అందాల తార. సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలోనూ చురుగ్గా ఉండే ఈ బ్యూటీ గతంలో చర్మ సంరక్షణ విషయంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని అందరితో షేర్‌ చేసుకుంది.

నా చర్మంలో చాలా మార్పులొచ్చాయి!

‘చర్మ సంరక్షణ విషయంలో భారతీయులు ఓ రకంగా చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫుడ్‌ అలర్జీకి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు ఇక్కడి వారిలో ఉండవు. అయితే కొద్దిమందికి మాత్రమే ఈ సమస్యలు ఎదురవుతుంటాయి. ఉదాహరణకు కీరా దోస, టొమాటో, క్యాప్సికమ్‌, బంగాళా దుంప (ఫ్రెంచ్‌ ఫ్రైస్‌ బాగా మిస్సయ్యాను) వంటి కూరగాయలు తింటే నాకు అస్సలు పడవు. రెండేళ్ల క్రితమే ఈ విషయం నాకు తెలిసింది. ఆ సమయంలో నా చర్మంలో చాలా మార్పులు కనిపించాయి.

ఎందుకిలా జరుగుతోందో...

చర్మ సంరక్షణ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఎందుకిలా జరుగుతుందో నాకు అర్థం కాలేదు. వెంటనే అలర్జీ టెస్ట్‌ చేయించుకున్నా. నేను తీసుకునే ఆహారంలోనే అసలు సమస్య ఉందని, అందుకే చర్మ సమస్యలు ఎదురయ్యాయని అందులో తేలింది. వెంటనే నా శరీరతత్వానికి సరిపడని ఆహారాన్ని పక్కన పెట్టాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా మళ్లీ నాకెలాంటి చర్మ సమస్యలు ఎదురుకాలేదు. కాబట్టి మీ చర్మం రఫ్‌గా తయారవుతున్నా... డల్‌గా కనిపిస్తున్నా ముందు వెళ్లి అలర్జీ టెస్ట్‌ చేయించుకోండి’ అని పోస్ట్‌లో భాగంగా రాసుకొచ్చింది రష్మిక.

కనీసం 2 లీటర్ల నీరు తాగండి!

దీంతో పాటు చర్మ సంరక్షణకు సంబంధించి కొన్ని చిట్కాలు కూడా అభిమానులతో షేర్‌ చేసుకుందీ ముద్దుగుమ్మ. అవేంటంటే..!

* మన శరీరానికి సరిపడే ఆహారం తీసుకోవాలి. అదే మన ఆరోగ్యానికి మంచిది. ప్రత్యేకించి జంక్‌ ఫుడ్స్‌, డెయిరీ ప్రొడక్ట్స్‌ తినే విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. చర్మానికి జిడ్డుదనం కలిగించే ఆహార పదార్థాలకు వెనువెంటనే స్వస్తి పలికేయండి. ఇక రోజుకు కనీసం 2 లీటర్ల నీళ్లు తాగడం తప్పనిసరి.

* చర్మానికి సన్‌ స్ర్కీన్‌ రాసుకోకుండా ఇంటి నుంచి అసలు బయటికెళ్లొద్దు.

* డెర్మటాలజిస్ట్‌ సలహా మేరకు సి-విటమిన్‌ అధికంగా లభించే సీరంను రోజూ చర్మానికి రాసుకోండి. ఇది మీ చర్మసంరక్షణకు ఎంతగానో ఉపకరిస్తుంది.

* చర్మంలో తేమ స్థాయులు తగ్గకుండా ఉండేందుకు మాయిశ్చరైజర్‌ రాసుకోండి. ప్రత్యేకించి మెడ భాగంలో, కళ్ల కింద మాయిశ్చరైజర్‌తో మృదువుగా మర్దన చేసుకోండి.

* రోజుకు రెండు సార్లు కచ్చితంగా శుభ్రమైన నీటితో ఫేస్‌ వాష్‌ చేసుకోండి. ముఖం కడుక్కునేటప్పుడు చేతులతో మరీ కఠినంగా రుద్దకండి. ఎందుకంటే ఇలా చేస్తే చర్మం పొడిబారిపోయే ప్రమాదముంది.

* పెదాలపై మచ్చలు, మొటిమలు ఏర్పడితే వాటిని అస్సలు గిల్లకండి. అలా చేస్తే పెదాలు మరింత అందవిహీనంగా తయారవుతాయి.

మరి రష్మిక సూచించిన ఈ స్కిన్‌ కేర్‌ టిప్స్‌ని మనమూ పాటిద్దాం. మన చర్మ సౌందర్యానికి మరిన్ని మెరుగులు దిద్దుకుందాం...!

ఇవీ చూడండి : అయోధ్య రామమందిర నిర్మాణానికి కాకతీయ టెక్నాలజీ... నివేదికను సిద్ధం చేస్తున్న ఎఐటీ ఆచార్యులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.