ETV Bharat / sukhibhava

వక్షోజాలు చిన్నగా ఉంటే ఇబ్బందా? పిల్లలకు పాలు సరిపోవా? డాక్టర్ జవాబులు ఇవీ...

వక్షోజాల గురించి మహిళలకు రకరకాల అపోహలు ఉంటాయి. వక్షోజాలు సౌందర్యంగా ఉండాలంటే ఏం చేయాలి? చిన్న స్తనాలు ఉంటే సెక్స్​లో ఎక్కువ సేపు పాల్గొనలేమా? వక్షోజాలు పెరగడానికి ఇంజెక్షన్లు చేయించుకోవచ్చా.. ఇలాంటి ప్రశ్నలు చాలా మంది మహిళల మదిలో మెదులుతుంటాయి. అలాంటి వాటికి నిపుణుల సమాధానాలు ఇలా ఉన్నాయి..

author img

By

Published : Jun 29, 2022, 8:34 AM IST

breast tightening exercises
వక్షోజాలు
వక్షోజాలను సౌందర్యంగా ఉంచుకోవడానికి చిట్కాలు

మహిళలకు వక్షోజాల పరిమాణం విషయంలో ఎన్నో అపోహలుంటాయి. తమ స్తనాలు చిన్నగా ఉన్నాయని కొందరు ఫీలైతే.. మరికొందరు పెద్దగా ఉన్నాయని బాధపడుతుంటారు. ఇలా ఈ విషయంలో ఎన్నో అనుమానాలు ఉంటాయి. మరి కొందరు చిన్న వక్షోజాలు ఉంటే బిడ్డకు పాలు తక్కువగా వస్తాయా? చిన్నవిగా ఉంటే రతిలో ఎక్కువ సేపు పాల్గొనలేమా? ఇలాంటి అపోహలు పడుతుంటారు. కానీ చాలా మంది ఈ విషయం గురించి మాట్లాడటానికి ఇష్టపడరు. ముఖ్యంగా తమ స్తనాల గురించి వాళ్లకు తెలియని విషయాలెన్నో ఉంటాయి. అలాంటి వాటిలో కొన్నింటి గురించి తెలుసుకుందాం.

వక్షోజాల సౌందర్యం కాపాడుకోవడం ఎలా?
వక్షోజాలను కాపాడుకోవాలంటే చక్కని ఆహారం తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల వక్షోజాలు బిగుతుగా, మంచి ఆకృతిలో ఉంటాయి. జిమ్, స్విమ్మింగ్​, ఇతర వ్యాయామాలు చేసిన మహిళలలో వక్షోజాలు కింద కండరాలు బలంగా తయారవుతాయి. దీంతో వారి వక్షోజాలు సౌందర్యంగా మారతాయి.

వక్షోజాలు చిన్నవిగా ఉంటే సెక్స్​ను ఎక్కువ సేపు ఆస్వాదించలేరా?
వక్షోజాల పరిమాణానికి, సెక్స్​కు ఎటువంటి సంబంధం లేదు. స్తనాల్లో.. సెక్స్ ప్రేరణ అనేది చనుమొనల్లో కలుగుతుంది. అంతే గానీ స్తనాల పరిమాణాన్ని బట్టి సెక్స్​ చేసే సమయం ఆధారపడదు. చనుమొనలలోనే కామనాడులు ఎక్కువగా ఉంటాయి. చిన్న చనుమొనలు ఉన్నవారికైనా, పెద్ద చనుమొనలు ఉన్నవారికైనా ఒకే రకమైన సెక్స్ ప్రేరణ ఉంటుంది. మగవారిని ఆకర్షించడానికి పెద్ద స్తనాలు ఉపయోగపడతాయి తప్ప రతిలో పాల్గొనాలంటే మాత్రం చనుమొనల సైజుతో సంబంధం లేదు.

వక్షోజాలు చిన్నవిగా ఉంటే పిల్లలకు పాలు తక్కువగా వస్తాయా?
వక్షోజాలు చిన్నవిగా ఉన్నా, పెద్దవిగా ఉన్నా పాలను ఉత్పత్తి చేసే గ్రంథులను బట్టే పాలు ఉత్పత్తి అవుతాయి. పాలను ఉత్పత్తి చేసే గ్రంథులు ప్రతీ ఒక్కరిలో ఒకేలా ఉంటాయి. ఒక్కొక్క వక్షోజంలో 18 నుంచి 26 ఉంటాయి. అందుకే స్తనాల సైజుతో పాల ఉత్పత్తికి సంబంధం లేదు. కొందరి వక్షోజాల్లో కొవ్వు ఉండడం వల్లే పెద్దవిగా కనిపిస్తాయి.

హార్మోన్​ ఇంజక్షన్​ ద్వారా వక్షోజాల పరిమాణం పెంచవచ్చా?
హార్మోన్​ల పరిమాణం తక్కువ ఉన్న వారు ఇంజెక్షన్లు చేసుకుంటే వక్షోజాలు పరిమాణం కొంత పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకానీ హార్మోన్​ల లోపం లేని వారు ఇంజక్షన్​ చేయించుకున్నా స్తనాల సైజులో ఎటువంటి మార్పు ఉండదు.

ఇవీ చదవండి: గుండెపోటు రాకుండా ఉండాలంటే.. రోజుకు ఎన్ని ఉల్లిపాయలు తినాలో తెలుసా?

గడ్డం, మీసాలు రాని వారు.. హస్త ప్రయోగం చేస్తే వస్తాయా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.