ETV Bharat / sukhibhava

వాపును ఈ ఆనవాళ్లతో గుర్తించండి! - Inflammation treatment food

కొవిడ్​ వ్యాప్తితో వాపు ప్రక్రియ(ఇన్​ఫ్లమేషన్​)పై ఎక్కువ దృష్టి సారించాల్సిన పరిస్థితి నెలకొంది. వైరస్​ తీవ్రస్థాయిలో ఉన్నవారిలో ఇది మరింత ప్రాణాంతకంగా మారుతోంది. ఇన్​ఫెక్షన్లు సోకినప్పుడే కాకుండా.. కొందరిలో నిరంతరం వాపులు వస్తూనే ఉంటాయి. కణ భాగాల్లో స్వల్ప స్థాయిలో ఉండటం వల్ల లక్షణాలేవీ పైకి కనిపించకపోయినా.. లోపల చేయాల్సిన నష్టం చేసేస్తాయి. ప్రస్తుతం మన ఎదుర్కొంటున్న సమస్త జీవనశైలి జబ్బులకు మూలమిదే. మరి దీన్ని ముందుగానే పసిగట్టడం ఎలా? నివారణ చర్యలేవి? వంటి వివరాలు మీకోసం..

INFLAMMATORY PROCESS
వాపు ప్రక్రియ ఆనవాళ్లివీ..
author img

By

Published : Nov 10, 2020, 4:08 PM IST

కరోనా విజృంభణతో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌) మీద విస్తృతమైన చర్చ నడుస్తోంది. కరోనా తీవ్రమైనవారిలో గతి తప్పిన వాపు ప్రక్రియే ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. సాధారణంగా ఇన్‌ఫెక్షన్ల వంటివి దాడి చేసినప్పుడు వాటిని ఎదుర్కోవటానికి మన రోగనిరోధక శక్తి స్పందించి, కొన్ని సైటోకైన్లను విడుదల చేస్తుంది. వాపు ప్రక్రియకు మూలం ఇదే. బ్యాక్టీరియా, వైరస్‌ల వంటి వాటిని ఎదుర్కొని ఇన్‌ఫెక్షన్లు తగ్గటానికి తోడ్పడుతుంది. అవసరం తీరిన తర్వాత తగ్గుముఖం పడుతుంది. కానీ కొందరిలో ఆగకుండా కొనసాగుతూ వస్తుంటుంది. మరింత ఎక్కువగానూ విజృంభిస్తుంటుంది. తీవ్ర కరోనాలో ఇదే ప్రమాదకరంగా పరిణమిస్తోంది.

ఇన్‌ఫెక్షన్లు తలెత్తినప్పుడే కాదు, కొందరిలో నిరంతరం వాపు ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. కణ స్థాయిలో, చాలా స్వల్ప స్థాయిలో ఉండటం వల్ల పైకి ఎలాంటి లక్షణాలూ కనిపించవు. కానీ లోలోపల విధ్వంసం సృష్టిస్తూనే ఉంటుంది. ప్రస్తుతం మన ఎదుర్కొంటున్న సమస్త జీవనశైలి జబ్బులకు మూలమిదే. మరి దీన్ని గుర్తుపట్టటమెలా? ఒంట్లో వాపు ప్రక్రియను ప్రేరేపితమై ఉంటోందని పోల్చుకోవటమెలా? ఎవరికైనా ఇలాంటి సందేహం రావటం సహజమే. ఇందుకోసం కొన్ని జీవ సూచికలు, పరీక్షలు లేకపోలేదు. ఇవన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వాపు ప్రక్రియతో ముడిపడినవే. వీటి ఆధారంగా ముందుగానే దీన్ని గుర్తించొచ్చు.

INFLAMMATORY PROCESS
బొజ్జ

బొజ్జ: అధిక బరువు, బొజ్జ జీవక్రియ రుగ్మతకు (మెటబాలిక్‌ సిండ్రోమ్‌) ప్రధాన సూచికలు. మనం తేలికగా గుర్తించగలిగినవి ఇవే. కడుపు చుట్టుకొలత మగవారిలో 90 సెం.మీ. కన్నా తక్కువ, ఆడవారిలో 80 సెం.మీ. కన్నా తక్కువగా ఉండాలి. అంతకు మించితే అప్పటికే కాలేయంలో కొవ్వు పేరుకోవటం మొదలైనట్టే. రక్తంలో గ్లూకోజు స్థాయలూ కొద్దిగా పెరుగుతాయి. రక్తపోటూ పెరుగుతుంది. ట్రైగ్లిజరైడ్ల మోతాదులు ఎక్కువవుతాయి. మంచి కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. అంటే ఒక్క బొజ్జతోనే రకరకాల వాపు ప్రక్రియ సూచికల స్థాయలు పెరిగిపోతాయన్నమాట.

INFLAMMATORY PROCESS
పరగడుపున ఇన్సులిన్‌ మోతాదులు

పరగడుపున ఇన్సులిన్‌ మోతాదులు: బొజ్జ పెద్దగా ఉన్నవారికి పరగడుపున రక్తంలో ఇన్సులిన్‌ స్థాయుల పరీక్ష ఉపయోగపడుతుంది. ఇది 10 కన్నా తక్కువుండాలి. అంతకన్నా ఎక్కువుంటే కణాలు ఇన్సులిన్‌ను సరిగా స్వీకరించటం లేదనే అర్థం. ఇది ఒంట్లో వాపు ప్రక్రియ మొదలైందనటానికి సంకేతం. బొజ్జ, ఇన్సులిన్‌ స్థాయులు రెండూ ఎక్కువగా ఉండటం జీవక్రియ రుగ్మతకు నిదర్శనం.

INFLAMMATORY PROCESS
సీఆర్‌పీ

సీఆర్‌పీ: ఇన్సులిన్‌ స్థాయలు దీర్ఘకాలంగా ఎక్కువగా ఉంటుంటే హై సెన్సిటివిటీ సీఆర్‌పీ స్థాయులూ ఎక్కువవుతాయి. ఇది వాపు ప్రక్రియకు కీలక సూచన. ఇంటర్‌ల్యూకిన్‌ 6 (ఐఎల్‌6) సైటోకైన్లు గతి తప్పటం దీనికి మూలం. ఇవి గతి తప్పితే కాలేయం నుంచి సీఆర్‌పీ ఉత్పత్తి అవుతుంది. ఇది ప్రతి లీటరుకు 1 గ్రాము కన్నా తక్కువగా ఉండాలి. ఒకవేళ 1-3 గ్రాముల మధ్యలో ఉంటే స్వల్ప స్థాయిలో వాపు ప్రక్రియ ఉందనే అర్థం. అదే 3 గ్రాముల కన్నా ఎక్కువైతే వాపు ప్రక్రియ తీవ్రమైందనటానికి సంకేతం.

INFLAMMATORY PROCESS
ఎల్‌డీఎల్

ఎల్‌డీఎల్‌: ఇది చెడ్డ కొలెస్ట్రాల్‌. వాపు ప్రక్రియ ప్రేరేపితమైన చోట, గాయాలైన చోటుకు వెళ్లి అతుక్కొని, స్థిరపడిపోతుంది. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఇది వాపు ప్రక్రియ మరింత ఎక్కువయ్యేలా ప్రేరేపిస్తుంది. ఎల్‌డీఎల్‌ ఉన్నట్టుండి పేరుకుపోతే రక్తం గడ్డలు ఏర్పడొచ్చు. అదే దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తుంటే పూడికలు తలెత్తుతాయి. రెండూ ప్రమాదకరమైనవే.

INFLAMMATORY PROCESS
మైక్రో అల్బుమిన్

మైక్రో అల్బుమిన్‌: దీర్ఘకాలంగా వాపు ప్రక్రియ కొనసాగటం వల్ల రక్తనాళాల లోపలి పైపొర పనితీరు దెబ్బతింటుంది. దీంతో ముందుగా మూత్రంలో స్వల్ప స్థాయిలో సుద్ద (మైక్రో అల్బుమిన్‌) పడటం మొదలవుతుంది. ఇది 30 మైక్రోగ్రాముల కన్నా తక్కువగా ఉంటే ఇబ్బందేమీ లేదనుకోవచ్చు. ఒకవేళ 30 నుంచి 300 మైక్రోగ్రాముల మధ్యలో ఉండటం ఒక మాదిరి వాపు ప్రక్రియకు సంకేతం. అదే 300 మైక్రోగ్రాములు దాటితే శ్రుతి మించిందనే అర్థం. సుద్ద ఎక్కువగా పోతుంటే మామూలు మూత్ర పరీక్షలోనూ బయటపడుతుంది.

ఇదీ చదవండి: ప్రశాంతమైన నిద్రకు నాలుగు గ్యాడ్జెట్‌లు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.