ETV Bharat / sukhibhava

How To Overcome Phone Addiction : ఫోన్ అడిక్షన్​తో బాధపడుతున్నారా?.. ఈ సింపుల్ టిప్స్​తో సమస్యకు చెక్​ పెట్టండి! - ఫోన్​ అడిక్షన్ నుంచి బయటపడడం ఎలా

How To Overcome Phone Addiction In Telugu : మీరు అతిగా ఫోన్​ వాడుతున్నారా? ఫోన్ విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారా? అయితే ఇది మీ కోసమే. కొన్ని సింపుల్ చిట్కాలతో మీ ఫోన్ అడిక్షన్ సమస్యను పూర్తిగా తొలగించుకోవచ్చు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా?

best tips to break free from phone addiction
How To Overcome Phone Addiction
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 3:16 PM IST

How To Overcome Phone Addiction : నేటి డిజిటల్​ యుగంలో స్మార్ట్​ఫోన్స్ మన జీవితాన్ని చాలా సుఖమయం చేశాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మనకు కావాల్సిన సమాచారాన్ని, ఎంటర్​టైన్​మెంట్​ను​ పొందడానికి; ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరితోనైనా సులువుగా కాంటాక్ట్​ కావడానికి ఈ స్మార్ట్​ఫోన్స్​ మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయితే వీటిని ఒక పరిధి మేరకు ఉపయోగిస్తే మంచిదే.. కానీ చాలా మంది పరిమితికి మించి ఫోన్​ వాడుతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఫోన్లకు బానిసలు (అడిక్ట్​​) అవుతుంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఈ ఫోన్ అడిక్షన్ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అవగాహన పెంచుకోవాలి : మీరు ఫోన్​కు బాగా అడిక్ట్ అయ్యుంటే.. ముందుగా దానికి గల కారణాలను అన్వేషించాలి. మీరు అధికంగా ఫోన్ వాడడం వల్ల.. మీరు రోజూ చేయాల్సిన పనులకు ఏ మేరకు అంతరాయం కలుగుతుందో చూడాలి. అలాగే మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో గల సంబంధాలను ఫోన్ వాడకం ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూసుకోవాలి. అంటే మీ సమస్యను మీరే గ్రహించుకోగలగాలి. అవసరమైతే వేరొకరి సహాయం తీసుకోవాలి. సమస్య పరిష్కారానికి ఏం చేయాలనే విషయంపై కూడా ఒక అవగాహనకు రావాలి.

2. సరైన లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలి : ఫోన్ వాడకాన్ని అదుపులో ఉంచుకోవాలంటే.. ముందుగా మీ స్క్రీన్ టైమింగ్​ను వీలైనంత వరకు తగ్గించుకోవాలి. అందుకోసం మీ వర్కింగ్ అవర్స్​లో ఫోన్​ను మ్యూట్​లో పెట్టుకోవాలి. రాత్రి పడుకునే సమయంలోనూ ఫోన్​ను సైలెంట్​లో పెట్టుకోవాలి. అలాగే ఫోన్ ఇంటిలోనే ఉంచి, స్నేహితులతో, సన్నిహితులతో కలవాలి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ఆ రోజు విశేషాల్ని పంచుకోవాలి. ఇలా క్రమక్రమంగా ఫోన్ అడిక్షన్​ నుంచి బయటపడేందుకు కృషి చేయాలి.

3. మానిటరింగ్ యాప్స్ ఉపయోగించాలి : మనం రోజు వారీగా ఎంత సేపు ఫోన్ వాడుతున్నాం అనే విషయాన్ని ట్రాక్ చేసుకోవాలి. ఇందుకోసం ప్రస్తుతం ఆన్​లైన్​లో బోలెడ్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒక బెస్ట్ యాప్​ను ఇన్​స్టాల్​ చేసుకుని, ఫోన్​ వాడకం కోసం నిర్దిష్ట సమయాన్ని సెట్​ చేసుకోవాలి. ఆ సమయం పూర్తి అయిన వెంటనే.. మీకు అలెర్ట్ వస్తుంది. దీనితో మీరు వెంటనే ఫోన్ వాడకాన్ని ఆపేయడానికి వీలవుతుంది.

4. ఫోన్​-ఫ్రీ జోన్​ను ఏర్పాటుచేసుకోవాలి : మనకు మనమే కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా బెడ్ రూమ్​లో, భోజనాల గదిలో, కార్యాలయంలో ఫోన్ ఉపయోగించకూడదని ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇది మొదట్లో కష్టంగానే ఉన్నప్పటికీ.. తరువాత క్రమక్రమంగా ఫోన్ అడిక్షన్​ అనేది బాగా తగ్గుతుంది.

5. స్క్రీన్​-ఫ్రీ టైమ్​ : వాస్తవానికి భోజనం చేసేటప్పుడు, నిద్రపోయే ముందు ఫోన్​ వాడకూడదు. అందుకే ఇలాంటి సమయంలో కచ్చితంగా ఫోన్​ను దూరం పెట్టాలి. అప్పుడే తిన్నది వంటబడుతుంది. అలాగే మంచి నిద్ర కూడా పడుతుంది.

6. పనికిరాని నోటిఫికేషన్లను డిజేబుల్ చేయాలి : మనం బ్రౌజింగ్ చేసేటప్పుడు.. చాలా నోటిఫికేషన్లను ఎనేబుల్ చేసుకుని ఉంటాం. దీని వల్ల అస్తమానం ఏదో ఒక నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. ఫలితంగా మన టైమ్ బాగా వేస్ట్ అవుతూనే ఉంటుంది. కనుక అనవసరమైన నోటిఫికేషన్లను వెంటనే డిజేబుల్ చేసుకోవాలి. దీని వల్ల మీరు చేస్తున్న పనిని నుంచి డిస్ట్రాక్ట్​ కాకుండా ఉంటారు. అంతేకాదు మీ ఫోన్ యుసేజ్ టైమ్ కూడా బాగా తగ్గుతుంది.

7. ప్రత్యామ్నాయాలపై దృష్టి కేంద్రీకరించాలి : ఫోన్ వాడడానికి బదులుగా పుస్తకాలు చదవడం, వ్యాయామాలు చేయడం, ఆటలు ఆడడం లాంటివి చేయాలి. లేదా మీలోని సృజనాత్మకతకు పదును పెట్టే పనులు చేయాలి. దీని వల్ల కచ్చితంగా ఫోన్ అడిక్షన్ అనేది క్రమంగా తగ్గుతుంది.

8. మెడిటేషన్, యోగా చేయాలి : మెదడును ప్రశాంతంగా ఉంచడానికి యోగా, ధ్యానం (మెడిటేషన్) బాగా ఉపయోగపడతాయి. వీటిని రోజూ ప్రాక్టీస్ చేయడం వల్ల మీ ఆలోచన తీరు బాగా మెరుగవుతుంది. ఫలితంగా ఫోన్ వ్యసనాన్ని చక్కగా నియంత్రించుకోగలుగుతారు.

9. సాయం తీసుకోవాలి : మీరు కనుక కచ్చితంగా ఫోన్ అడిక్షన్​ను తగ్గించుకోవాలని అనుకుంటే.. అందుకు మీ కుటుంబ సభ్యుల, సన్నిహితుల, స్నేహితుల సహకారం తీసుకోండి. ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలకు పోవద్దు. వారు మీకు కచ్చితంగా సాయం చేస్తారు. అప్పటికీ మీ వల్ల కాకపోతే.. మంచి వైద్యుని సంప్రదించాలి.

10. వాస్తవంలోకి రావాలి : ఫోన్​లో మనం చాలా వరకు అవాస్తవిక ప్రపంచాన్ని చూస్తూ ఉంటాం. దాని నుంచి బయటపడాలంటే.. కచ్చితంగా వాస్తవంలోకి రావాల్సి ఉంటుంది. ఇది అంత సులువు కావనప్పటికీ.. మనస్సు పెడితే కచ్చితంగా మార్గం దొరుకుతుంది. కొన్ని సార్లు మనం నియమాలు తప్పుతాం. అయినా నిరుత్సాహపడకండి. అప్పుడే మీరు క్రమంగా ఫోన్ అడిక్షన్ నుంచి తప్పించుకోగలుగుతారు.

How to Apply for Airtel Tower Installation : ఎయిర్​టెల్ టవర్​ ఇన్​స్టాలేషన్​తో.. భారీగా ఆదాయం పొందండిలా..!

Best Ways to Detect Unknown Tracker on Your Android : మీ ఫోన్​ను ఎవరైనా ట్రాక్ చేస్తున్నారా? ఇలా పట్టేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.