ETV Bharat / sukhibhava

మీ రోజువారీ ఆహారాన్ని పుష్టికరం చేసుకోండిలా..

మనం రోజూ తినే ఆహారం రుచిగా, పుష్టికరంగా ఉంటూ సంతులితంగానూ ఉండగలదా? అవును, ఇది సాధ్యమే. సృజనాత్మకంగా ఆలోచిస్తే మనం రోజూ తినే ఆహారం చక్కటి ఆరోగ్యాన్ని అందించగలదు. ఇక్కడ చెప్పిన కొన్ని సూచనలను పాటిస్తూ అనారోగ్యాన్ని దరిచేరనివ్వకండి..

how to make your basic meals full of nutrition
మీ రోజువారీ ఆహారాన్ని పుష్టికరం చేసుకోండిలా..
author img

By

Published : Apr 20, 2021, 10:30 AM IST

మనసును ఆకర్షించే కొత్త రకాల వంటలను ప్రతిరోజు ఆస్వాదించటం కష్టం. కొన్ని రకాల రుచులకు అలవాటు పడిన మనం కొత్త వంటలను అలవాటు చేసుకోవటం కష్టమే. మన ఆరోగ్యాన్ని, శరీర సౌష్టవాన్ని కాపాడుకునే విధంగా ఆహారాన్ని మలచుకోవాలి. అయితే, ఆహారపుటలవాట్లలో పెనుమార్పులు తీసుకురావటం సులభం కాదు. అందువల్ల చిన్న చిన్న మార్పులతోనే ప్రారంభిద్దాం. చపాతి, కూరలు, పప్పు మొదలైనవి చేయటంలో చిన్నపాటి చేర్పులను పాటించాలి. దీక్షాచెబ్రా ఫిట్నెస్ కన్సల్టేషన్ స్థాపకులు దీక్ష చెబుతున్నట్టుగా ఎక్కువ శ్రమ లేకుండా మన ఆహారాన్ని పోషకాలతో నింపవచ్చు.

మాంసకృత్తుల బలం:

మన అమ్మలు, అమ్మమ్మలు విరిగిన పాలతో పన్నీరు, మిగిలిన పాలతో పెరుగు ఎలా చేసే వారో మనకు బాగా తెలుసు. అవి తయారైన తర్వాత మిగిలిన నీరు ఏమిటో ఎప్పుడైనా ఆలోచించారా? పన్నీర్ చేయగా మిగిలిన నీటిని పారబోస్తాం. పెరుగు తయారైన తరువాత అందులో తేట నీరు కూడా వృథా అనుకుంటాం. వాటిని పారబోయకుండా మిగిలిన నీటిని చపాతీ పిండి కలపడానికి వాడవచ్చు లేదా పప్పులోనూ, కూరల్లోనూ లేదా పాస్తాలో అయినా కలపవచ్చు. భారతీయ ఆహారంలో మాంసకృత్తులు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ చిట్కాతో ఆలోటును పూరించవచ్చు.

ఆహారంలో పీచు:

పీచు ఎక్కువగా ఉన్న పదార్ధాలు తినటం వల్ల విషపదార్థాలను బయటకు పంపడంలో, పేగుల ఆరోగ్యాన్ని పెంచటంలో, రక్తంలో చక్కెర, కొలెస్టిరాల్ నియంత్రించటం సులభమవుతుంది. మొత్తం గోధుమలను మర ఆడించి వాడటం వల్ల ఎక్కువ పీచు శరీరానికి లభిస్తుంది. జొన్నలు, సజ్జలు, రాగి మొదలైన ఇతర చిరుధాన్యాలను ఆహారంలో తరచూ తీసుకుంటే వాటిలోని పీచు వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. కేక్స్ తయారుచేయటంలోనూ ఇదే పద్దతిని పాటించవచ్చు.

స్వీట్స్ తినాలనిపిస్తోందా?

ఐస్​క్రీం తినాలనిపిస్తే ఫ్రిడ్జ్​లో ఉంచిన ఒక తియ్యటి పండును అదనంగా చక్కెర కలపకుండా ఐస్​క్రీం చేసుకోవచ్చు. అరటి, మామిడి, సపోటా, బొప్పాయి, కొబ్బరి మొదలైన వాటిని కొన్ని గంటల పాటు శీతలీకరించి బ్లెండర్​లో ఐస్​క్రీంకు సిద్దం చేసుకోవచ్చు. దానికి అదనంగా డ్రై ఫ్రూట్స్, డార్క్ చాక్లెట్​ను కూడా కలపవచ్చు. నారింజ, పుచ్చకాయ, కివీ, మొదలైన పళ్లను కూడా రసాన్ని తీసి కలపవచ్చు. ఐస్​క్రీంలో పళ్లే కాకుండా పెరుగు కూడా కలిపి కొత్త రుచులను ఆస్వాదించవచ్చు. ఇలాంటి సృజనాత్మక పద్ధతులతో ఆహారాన్ని పుష్టికరం చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.