ETV Bharat / sukhibhava

పిల్లలను ఇలా ‘హెల్దీ’గా మార్చేద్దాం!

మనం తీసుకునే ఆహారం అటు శారీరకంగానే కాదు.. ఇటు మానసికంగానూ ప్రభావం చూపుతుంది. అయితే చాలామంది తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లల విషయంలో ఆరోగ్యకరమైన ఆహార నాణ్యతా ప్రమాణాలను పాటించలేకపోతున్నారు. తమకు పెట్టే ఆహారం రుచించక ఎక్కువశాతం మంది పిల్లలు భోజనం చేసే విషయంలో తల్లుల్ని తెగ విసిగిస్తుంటారు. వాళ్లకు ఇష్టమైనవైతేనే నోరు తెరుస్తారు.. లేదంటే మూతి తిప్పేస్తుంటారు. ఇక జంక్‌ ఫుడ్‌ అంటే లొట్టలేసుకుంటూ మన దగ్గరికి వచ్చేస్తారు. వారి కడుపు నింపాలంటే... పిల్లల కంటికి నచ్చేలా కాదు.. నోటికి రుచించేలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందివ్వడం తల్లుల బాధ్యత. అందుకు మనం ఏం చేయాలో తెలుసుకోండి...

how to make children eat healthy food
how to make children eat healthy food
author img

By

Published : Feb 28, 2021, 2:20 PM IST

hildrenfoodlockdown650-5.jpg
ఎలాంటి ఆహారం ఇస్తున్నారు..?

ఎలాంటి ఆహారం ఇస్తున్నారు..?

ప్రస్తుత పరిస్థితుల్లో పండ్లు, కూరగాయలు.. మొదలైనవి కృత్రిమ పద్ధతిలో పెంచినవి/పండించినవే మార్కెట్‌లో ఎక్కువగా లభిస్తున్నాయి. వీటిని తినడం ద్వారా ఆరోగ్యానికి హాని చేసే ఎన్నో రకాల రసాయనాలు మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. అందుకే పిల్లలను వాటికి దూరంగా ఉంచడం ఉత్తమం. వీలైనంత వరకు వాళ్లకు సహజ సిద్ధంగా- వీలైతే ఇంటి ఆవరణలో పండించిన కూరగాయలు, పండ్లు ఇవ్వడానికి ప్రయత్నించండి. పోషకాలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, గింజలు, డ్రైఫ్రూట్స్‌.. మొదలైన వాటిని రోజువారీ ఆహారంలో భాగం చేయండి.
అంతేకాదు, సీజనల్‌ పండ్లను పిల్లలకు అందించండి. ఈ క్రమంలో పిల్లలు రోజుకు కనీసం ఒక్క పండైనా తినేలా చూసుకోండి. వీటి ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెంపొందడంతో పాటు.. పిల్లలు చిన్నతనం నుంచే అన్ని రకాల ఆహారాలను తినడానికి అలవాటు పడతారు.

చిరుతిండ్ల విషయానికొస్తే పిల్లలు ఎక్కువగా ఇష్టపడే నూడుల్స్‌, పాస్తా, చాక్లెట్స్‌, కేక్‌, చిప్స్‌.. మొదలైన వాటి వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ఉపయోగం లేకపోగా ఇవి శరీరంలో కొవ్వు శాతాన్ని పెంచుతాయి. వీటికి బదులు ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్స్‌ని మీరే ఇంట్లో తయారుచేసి వారికి తినిపించండి.

childrenfoodlockdown650-1.jpg
ముందు మీరు అలవాటు చేసుకోండి..!

ముందు మీరు అలవాటు చేసుకోండి..!

సాధారణంగా పిల్లలు తల్లిదండ్రులను ఎక్కువగా గమనిస్తూ.. వాళ్లు చేసే పనులను అనుకరించడానికి ప్రయత్నిస్తుంటారు. అదేవిధంగా ఆహారం విషయంలో కూడా తల్లిదండ్రులు తినే ఆహార పదార్థాలనే పిల్లలూ తినేందుకు ఆసక్తి చూపిస్తారు. ఒకవేళ మీకు ఆరోగ్యానికి మేలు చేసే అన్ని రకాల కూరగాయలు, పండ్లు తినే అలవాటు ఉంటే ఫర్వాలేదు.. ఆ అలవాటు లేనివాళ్లు పిల్లల కోసం మీ ఇష్టాలను పక్కనబెట్టి వాటిని తినడం అలవాటు చేసుకోండి. మిమ్మల్ని చూసి వాళ్లూ వాటిని తినడం అలవాటు చేసుకుంటారు. అంతేకానీ, వాళ్లతో బలవంతంగా వాటిని తినిపించడానికి ప్రయత్నిస్తే వాటిపై అయిష్టత పెరిగి.. జీవితంలో ఇక వాటి జోలికి వెళ్లకుండా తయారయ్యే అవకాశం కూడా ఉంది.

childrenfoodlockdown650-6.jpg
వంట పనుల్లో భాగం చేయండి..!

వంట పనుల్లో భాగం చేయండి..!

మనం తినే కూర ఎలా తయారైంది..? వీటిలో ఏయే పదార్థాలు వాడారు? ఇది తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయి? అనే విషయాలు తెలిసుండడం ఎవరికైనా అవసరమే..! ఈ క్రమంలో పిల్లలను వంటింటి పనుల్లో భాగం చేయండి. కూరగాయలు తరగడం, పిండి రుబ్బడం, కుక్కర్‌లో నుంచి ఇడ్లీలు తీయడం, చిన్న చిన్న వంటలు చేయడం.. మొదలైన పనుల్లో వారిని పాల్గొననివ్వండి. అయితే ఈ క్రమంలో ఆయా పదార్థాల్లో ఉండే పోషకాల గురించి వారికి వివరించండి.. తద్వారా ఏ పదార్థంలో ఎలాంటి పోషక విలువలుంటాయో వారికి అవగతమవుతుంది.

childrenfoodlockdown650.jpg
అందరూ కలిసి భోజనం చేయండి..!

అందరూ కలిసి భోజనం చేయండి..!

ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్‌లో చాలా కుటుంబాల్లో ఇంటి సభ్యులంతా కలిసి భోజనం చేయడమే మర్చిపోయారు. కానీ, అంతా కలిసి భోజనం చేయడం ద్వారా మీ అనుబంధాలు బలపడడం మాత్రమే కాదు.. తినే నాలుగు ముద్దలైనా మనస్ఫూర్తిగా తింటారు. పిల్లలకు కూడా చిన్నతనం నుంచే ఈ పద్ధతిని అలవాటు చేయడం మంచిది. అల్పాహారం, భోజనం, స్నాక్స్‌.. ఇలా ఏదైనా నలుగురితో కలిసి తింటే ఆ తృప్తే వేరు..!

నిర్ణీత సమయంలోనే..!

పిల్లలకు ప్రతిరోజూ నిర్ణీత సమయంలోనే ఆహారం తినడం అలవాటు చేయండి. ఉదాహరణకు ఉదయం 8-9 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 1-2 గంటలకు భోజనం, రాత్రి 8-9 గంటకు భోజనం. ఈ అలవాటు పిల్లల జీర్ణశక్తిని పెంచేందుకు తోడ్పడుతుంది.

ఇవి కూడా..!

  • పిల్లలకు భోజనం తర్వాత తమ ప్లేట్స్‌ తామే కడుక్కోవడం అలవాటు చేయండి. భోంచేసిన తర్వాత డైనింగ్‌ టేబుల్‌పై వారు కూర్చున్న ప్రదేశాన్ని వారితోనే క్లీన్‌ చేయించడంలో తప్పేమీ లేదు.
  • కిచెన్‌తో పాటు ఫ్రిజ్‌, డైనింగ్ టేబుల్.. వంటి వస్తువులు శుభ్రంగా ఉంచడం ఇంట్లో అందరి బాధ్యతగా పిల్లలకు నేర్పించండి. చదువుకోవడం, ఆడుకునే క్రమంలో డైనింగ్‌ టేబుల్‌పై తమ వస్తువులు ఏవైనా ఉంటే.. వాటిని మీరు సర్దకుండా వారినే సర్దేలా ప్రోత్సహించండి.
  • వీలైనంత వరకు స్పూన్‌తో కాకుండా చేతులతో తినడం అలవాటు చేయండి. అయితే ఈ క్రమంలో తినే ముందు, తిన్న తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోమని చెప్పడం మాత్రం మర్చిపోవద్దు.
  • తినేటప్పుడు ఫోన్‌ చూడడం, వీడియో గేమ్స్‌ ఆడడం, టీవీ చూడడం.. వంటివి చేయకుండా దృష్టంతా భోజనంపైనే పెట్టడం వల్ల మరీ ఎక్కువగా ఆహారం తీసుకోకుండా జాగ్రత్తపడచ్చు.

చూశారుగా.. పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారమే కాదు.. ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చడం కూడా తల్లులుగా మన బాధ్యతే అని మర్చిపోవద్దు..! ఇంకెందుకాలస్యం.. మన చిన్నారులకు హెల్దీ ఫుడ్‌తో పాటు హెల్దీ అలవాట్లను కూడా అలవాటు చేసేద్దామా..?

ఇదీ చూడండి: ఆ వయసులో తప్పనిసరిగా చేయాల్సిన పనులివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.