ETV Bharat / sukhibhava

ఇలా చేస్తే చలికాలంలో జలుబు బాధలు మాయం! - జలుబు తగ్గాలంటే

How to get rid of Cold: సీజన్​ మారినప్పుడల్లా జలుబు సమస్య సర్వసాధారణం. చలికాలమైతే పిల్లలకు గడ్డుకాలమే. తరచూ జలుబు బారిన పడుతుంటారు. ఈ నేపథ్యంలో జలుబు నుంచి ఉపశమనం పొందేందుకు ఏం చేయాలో తెలుసుకుందాం..

cold
జలుబు
author img

By

Published : Dec 24, 2021, 7:08 AM IST

How to get rid of cold: సీజన్ మారినప్పుడల్లా జలుబు చేయడం.. ఆపై వారం, పదిరోజుల పాటు అవస్థలు పడటం చాలామందిలో చూస్తుంటాం. మిగతా సీజన్లలో ఎలా ఉన్నా.. చలికాలంలో జలుబు బాధలు ఎక్కువగా వస్తుంటాయి. చల్లగాలికి ఇట్టే జలుబు చేసేస్తుంది. పిల్లలకైతే ముక్కులు కారుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో జలుబు బాధల నుంచి బయట పడాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం..

చలితీవ్రత పెరిగినప్పుడు చాలా మందిలో శ్వాసకోశ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. చాలా తరుచుగా దగ్గు, జలుబు, తుమ్ములు, కఫం వంటి బాధలు వేధిస్తుంటాయి. ఈ సీజన్​లో తరచూ వేధించే జలుబును అస్సలు అశ్రద్ధ చేయకూడదు. సాధ్యమైనంత త్వరగా జలుబు తగ్గిపోయేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే చాలా సందర్భాల్లో జలుబు బ్రాంకైటీకి దారితేసే అవకాశముంటుంది.

ఈ చిట్కాలు పాటిస్తే సరి..

  • పావు స్పూన్​ మిరియాల పొడిని తేనెతో కలిపి తరచూ తీసుకోవాలి.
  • వేడినీటిలో పసుపు వేసుకుని ఆవిరిపట్టాలి.
  • వేడినీటిలో అల్లం ముక్కలు ఉడకబెట్టి వడకట్టుకొని కొద్దిగా చక్కెర వేసుకుని తాగితే.. జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.
  • మిరియాలు, ధనియాలు రెండింటిని కలిపి కషాయంగా కాచుకుని తాగినా జలుబు, దగ్గు నుంచి సత్వర ఉపశమనం లభిస్తుంది.
  • తేనెలో అల్లం కలుపుకుని తరచూ తాగుతుంటే జలుబు బాధలు పోతాయి.
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:

జుట్టు, చర్మ సౌందర్యం కోసం ఆయుర్వేద చిట్కాలు

పిల్లల్లో థైరాయిడ్​-గుర్తించకపోతే పెను శాపం

జీర్ణాశయ కండరాలను సరిచేసే మార్గం ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.