రజస్వల అయినప్పటి నుంచి అమ్మాయిల్లో రుతుస్రావ ప్రక్రియ మొదలవుతుంది. ఈ సమయంలో కొంతమంది అమ్మాయిల్లో తీవ్ర రక్తస్రావం అవుతుంది. ఇలాంటి సమస్యలని వారు బయటికి చెప్పుకోలేక సతమతమవుతారు. పెళ్లై పిల్లలు పుట్టినా కూడా వారికి ఎన్నో రకాల గర్భాశయ సమస్యలు(Gynic Problem) వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా కాన్పు అయిన తర్వాత, వయసు మళ్లినప్పుడు ఎన్నో రకాల సమస్యలొస్తుంటాయి. యోనిలో తెల్లపొర, బాధలేని రక్తస్రావం, గర్భాశయం దగ్గర పుండు(Womb Infection), దురద ఇలా ఎన్నో చెప్పుకోలేని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు వారు శృంగారంలో పాల్గొనలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. మరి అలాంటి వారు ఈ సమస్యలను ఎలా అధిగమించాలి? భవిష్యత్తులో ఇవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే ఆసక్తికరమైన అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
కాన్పులైన స్త్రీలో గర్భాశయం పుండుపడటం ఎందుకు జరుగుతుంది?
కాన్పు అయిన తర్వాత కొంత మందిలో ఈ సమస్య కనిపిస్తుంది. కాన్పు ఎక్కువైనప్పుడు గర్భాశయం(Womb Infection After Birth) దగ్గర చీరుకుపోవడంలాంటిది జరుగుతుంది. అలా జరిగినప్పుడు గర్భాశయానికి ఇన్ఫెక్షన్ అవుతుంది. ఇన్ఫెక్షన్ లేకపోయినా అక్కడ పుండుపడినట్లు ఎర్రగా తయారవుతుంది. మరికొందరికి గడ్డలా తయారవుతుంది. దీన్ని సెర్విసైటిస్ అని అంటాం. ఈ ప్రక్రియలో గర్భాశయం మొదటి భాగం నుంచి చీరడం వంటివి జరుగుతుంటాయి. దీన్ని ముందుగానే గమనించి మందులు వాడితే తప్పకుండా నయమవుతుంది.
వయసు మళ్లిన స్త్రీలు శృంగారంలో పాల్గొంటే బాధలేని రక్తస్రావం వస్తుందా?
వయసు మళ్లిన స్త్రీలలో బాధలేని రక్తస్రావం(Bleeding After Sex) జరుగుతుందంటే.. కొంత మందిలో అది క్యాన్సర్ వ్యాధి కావచ్చు. ఇలా అని అందరికీ క్యాన్సర్ సమస్యే ఉంటుందని కాదు. ఈస్ట్రోజెన్ హార్మోన్(హార్మోనల్ ఇంబ్యాలెన్స్) తక్కువ కావడం వల్ల కూడా ఈ సమస్య తలెత్తుతుంది. 35-40 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు శృంగారంలో పాల్గొన్నప్పుడు రక్తం వస్తే.. వేడి చేసిందనే అపోహలో ఉండకూడదు. సెర్వికల్ క్యాన్సర్ లేదా వెజైనా క్యాన్సర్, హార్మొన్ అసమతుల్యత(Hormonal Imbalance in Women) సమస్య కావొచ్చనే విషయం మరిచిపోవద్దు. వెంటనే డాక్టర్ను సంప్రదించడం చాలా అవసరం.
పిల్లలు పుష్టిగా పుట్టకపోవడానికి కారణం అదేనా?
పిల్లలు పుష్టిగా ఉండకపోవడానికి కారణం మగవారి వీర్యం పల్చగా ఉండటం అని చాలా మంది మహిళలు భావిస్తుంటారు. కానీ, అది నిజం కాదు. ఆ రెండింటికీ అసలు సంబంధం లేదు. వీర్యం పల్చగా ఉన్నా అందులో వీర్యకణాలుంటే గర్భం వచ్చేస్తుంది. గర్భం సమయంలో సరైన డైట్ తీసుకోకపోవడం, ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా బిడ్డ బలహీనంగా పుడుతుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చదవండి:పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ఎవరు చేయించుకుంటే మంచిది?