ETV Bharat / sukhibhava

ఆ రెండు లాభాలు శృంగారంతోనే సాధ్యం! - శృంగారంతో బోలెడు లాభాలు

రోజూ శృంగారం చేస్తే.. వ్యాయామం చేసినంత లాభం కలుగుతుందన్నంటున్నాయి అధ్యయనాలు. మరి సెక్స్ చేయటం వల్ల ఎన్ని కేలరీలు ఖర్చు అవుతాయో తెలుసా..? సెక్స్ చేసే సమయంలో ఆడవారికంటే మగవారిలోనే ఎక్కువ కేలరీలు ఖర్చు అవుతాయంట. అంతేకాదు శృంగారంతో ఆనందం కూడా కలుగుతుంది. కేలరీల ఖర్చు- ఆనందం.. ఈ రెండు లభించే ఏకైక క్రియ సెక్స్​ అని అంటున్నారు నిపుణులు.

sex
శృంగారం
author img

By

Published : Nov 22, 2021, 7:27 AM IST

ఒకవైపు ఆనందం.. మరోవైపు కేలరీల ఖర్చు! అదెలా అని ఆశ్చర్యపోకండి. శృంగారంతో సాధ్యమేనని అధ్యయనాలు పేర్కొంటున్నాయి! వ్యాయామం చేసినంతగా కాకపోయినా శృంగారంలో పాల్గొన్నప్పుడూ కేలరీలు ఖర్చు అవుతాయి మరి. సుమారు అరగంట సేపు ఒక మోస్తరు వేగంతో పరుగెత్తితే సగటున మహిళల్లో 213 కేలరీలు, పురుషుల్లో 276 కేలరీలు ఖర్చు కాగా.. శృంగారం మూలంగా మహిళల్లో 69 కేలరీలు, పురుషుల్లో 101 కేలరీలు ఖర్చు కావటం గమనార్హం. మగవారిలో ఎక్కువ కేలరీలు ఎందుకు ఖర్చవుతున్నాయో తెలుసా? ఆడవాళ్ల కన్నా మగవాళ్లు ఎక్కువ బరువు ఉండటం.. ఆ సమయంలో మగవారు కాస్త చురుకుగానూ ఉండటం వల్లనేనని పరిశోధకులు చెబుతున్నారు.

నిజానికి శృంగారమనేది వ్యాయామ పద్ధతి కాదు గానీ ఇది కూడా కొంతమేరకు వ్యాయామంగా తోడ్పడుతుండటం విశేషం. కేలరీల విషయం పక్కనపెట్టి చూసినా.. శృంగారంతో మానసిక ఆరోగ్యం, మూడ్‌ మెరుగుపడతాయి. కండరాలను వదులుచేసే, హాయిని కలిగించే రసాయనాలు శరీరమంతా సరఫరా అవుతాయి. అంతేకాదు.. నిద్ర కూడా బాగా పడుతుంది. అంటే శృంగారం.. ఆనందంతో పాటు ఆరోగ్యాన్నీ పెంపొందించే సాధనం కూడా అన్నమాట.

నిద్ర.. వీర్యానికి బాసట

నిద్ర తక్కువైతేనే కాదు.. ఎక్కువైనా ఇబ్బందే. అందుకే రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం పెందలాడే లేవాలని చెబుతుంటారు. ఇది శాస్త్రీయంగానూ రుజువైంది. ఇప్పుడు దీనికి సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది. నిద్ర మరీ తగ్గినా, మరీ ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యత దెబ్బతింటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా కొందరికి 6 గంటలు, అంతకన్నా తక్కువసేపు.. మరికొందరికి 7-8 గంటల సేపు.. ఇంకొందరికి 9 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు నిద్రపోవాలని సూచించారు.

అనంతరం వీర్యకణాల సంఖ్య, రూపు, కదలికలను పరిశీలించారు. వీరందరిలో కెల్లా 7-8 గంటల సేపు నిద్రపోయినవారిలో వీర్యం నాణ్యత బాగా ఉంటున్నట్టు తేలింది. 6 గంటల కన్నా తక్కువ, 9 గంటల కన్నా ఎక్కువసేపు పడుకునేవారిలో వీర్యం నాణ్యత బాగా పడిపోవటం గమనార్హం. ఆలస్యంగా నిద్రపోవటం, తగినంత విశ్రాంతి లేకపోవటం చాలా హానికరం. ఎందుకంటే వీరిలో ఆరోగ్యకరమైన వీర్యకణాలను దెబ్బతీసే ప్రోటీన్‌ (యాంటీస్పెర్మ్‌ యాంటీబాడీ) స్థాయులు చాలా ఎక్కువగా ఉంటాయి.

అందువల్ల సంతాన సమస్యలతో బాధపడే పురుషులు రాత్రిపూట తగినంత సేపు నిద్రపోవటం, అదీ త్వరగానే పడుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి పడుకోవటానికి కనీసం 2 గంటల ముందే భోజనం చేయటం.. టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్ల వంటివి కనీసం 45 నిమిషాల ముందే కట్టేయటం.. నిద్ర పోవటానికి ముందు గోరువెచ్చటి నీటితో స్నానం చేయటం.. గదిలో ప్రకాశవంతమైన లైట్లు లేకుండా చూసుకోవటం.. మనసుకు నచ్చిన సంగీతాన్ని వినటం.. వదులుగా ఉండే దుస్తులు ధరించటం.. వంటి వాటితో నిద్ర బాగా పట్టేలా చూసుకోవచ్చు.

ఇవీ చూడండి:

శృంగారంతో జలుబు మాయం!

శృంగారంలో పాల్గొంటే మొటిమలు తగ్గుతాయా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.