ప్రస్తుత జీవన సరళిలో చాలా మందిని గ్యాస్ట్రబుల్ వేధిస్తోంది. ఈ సమస్యను కడుపులో పెద్ద వాయుగుండంగా భావిస్తుంటారు. పొట్ట ఉబ్బరంగా ఉండటం, ఆపై పులి తేన్పులు, ఎడతెగని అపానవాయువులతో అసౌకర్యంగా ఉంటుంది. ఇందుకు గాడితప్పిన ఆహారపు అలవాట్లు.. అస్తవ్యస్థమైన జీవనశైలి కారణాలు కావొచ్చు. ఈ క్రమంలో గ్యాస్ ట్రబుల్‌కు గల కారణాలు, దీని లక్షణాలతో పాటు ఈ సమస్య నుంచి బయటపడటానికి చిన్న చిట్కాను చూద్దాం.
కారణాలు
సమయానికి నిద్రపోకపోవడం, భోజనం చేయకపోవడం, కాఫీ, టీ, స్మోకింగ్ అలవాట్లు ఎక్కువగా ఉన్న వారిలో ఈ గ్యాస్ ట్రబుల్ కనిపిస్తుంది. ఆకలి వేసినప్పుడు తినకపోవడం, ఆకలి వేయకపోయినా మళ్లీ మళ్లీ తినడం, కారం, మసాలాలు, నూనెతో కూడిన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది.
ప్రధాన కారణం
భయం, క్రోదం, దుఃఖం, ఎక్కువగా ఆలోచించడం, మానసిక ఒత్తిడి ప్రధాన కారణాలు.
లక్షణాలు
ఆకలి మందగించడం, కడుపు ఉబ్బరంగా ఉండటం, కడుపులో వాయువు(గ్యాస్) ఫామ్ అవ్వడం, తేన్పులు రావడం, కడుపు నొప్పిగా ఉండటం, మలవిసర్జనకు వెళ్లలేకపోవడం, సోమరితనం, బద్ధకం, అలసటగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.
చక్కని చిట్కా
కడుపు ఉబ్బరం, మంటగా ఉంటే ఒక గ్లాస్ చెరకు రసాన్ని తీసుకోవాలి. అందులో ఒక చెంచా నిమ్మరసం కలుపుకోవాలి. కొద్దిగా సైంధవ లవణాన్ని ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ఈ జ్యూస్‌ను రెండు పూటల తీసుకున్నట్లైతే కడుపులో ఉన్న మంట, ఉబ్బరం రెండూ దూరమైపోతాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: ఎంత తిన్నా.. ఆకలి తీరడం లేదా?