ETV Bharat / sukhibhava

మిలమిల మెరిసే గోళ్లు మీ సొంతం కావాలా? ఈ టిప్స్ పాటిస్తే సరి! - shining nails tips

Home Made Tips To Shining Nails : అందంగా కనిపించాలని ముఖంపై చూపించిన శ్రద్ధ.. గోళ్లపై ఏ మాత్రం చూపరు చాలా మంది అమ్మాయిలు. దీంతో వారి గోళ్లు అందవిహీనంగా కనపడటమే కాకుండా బలహీనంగా మారి విరిగిపోతుంటాయి. దీంతో ఏం చేయాలో తెలియక బ్యూటీ పార్లర్​కు క్యూ కడతారు. అయితే ఈ సమస్యకు పరిష్కారం కేవలం ఇంట్లోనే కొన్ని టిప్స్ పాటించడమని మీకు తెలుసా..?

Home Made Tips To Shining Nails
Home Made Tips To Shining Nails
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 4:25 PM IST

Home Made Tips To Shining Nails : అందంగా కనిపించడమంటే కేవలం ముఖం మాత్రమే అనుకుంటారు కొద్ది మంది అమ్మాయిలు. దీంతో ముఖం మినహాయించి కాళ్లు, చేతులు, గోళ్లు, జుట్టు.. ఇలా మిగిలిన వాటిపై ఏ మాత్రం శ్రద్ధ తీసుకోరు. ముఖ్యంగా గోళ్ల విషయంలో ఇది కాస్తా ఎక్కువగానే ఉంటుంది. గోళ్లు పొడుగున్నా.. వాటిపై శ్రద్ధ లేక గరుకుగా, రంగు మారినట్లుగా ఉండి అందంగా కనిపించవు. అలాగే బలహీనంగా ఉండి విరిగిపోతుంటాయి. అలాంటి సమయంలో ఇతరుల గోళ్లను చూసి.. అబ్బా ఇలా మనకెందుకు లేవు అని ఫీల్​ అయ్యి బ్యూటీ పార్లర్​ను ఫాలో అవుతారు. గోళ్ల సంరక్షణ కోసం డబ్బులు అధికంగా ఖర్చు చేస్తారు. పైసలు పెట్టలేని వారు అలానే ఉండిపోతారు. ఇకమీదట గోళ్ల గురించి అలాంటి టెన్షన్​ అక్కర్లేదు. డబ్బులను వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని అంతకన్నా లేదు. కేవలం ఇంట్లోనే మీ గోళ్లను మెరిసిపోయేలా ఎలా చేసుకోవాలో కొన్ని టిప్స్​ చెబుతున్నారు నిపుణులు. మరి అవి ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం..

రోజ్ వాటర్ : రోజ్‌ వాటర్ మహిళల చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని మనందరికీ తెలిసిందే. అలాగే ఈ వాటర్‌ను మనం గోళ్ల మెరుపు కోసం కూడా ఉపయోగించుకోవచ్చంటున్నారు నిపుణులు. మీ గోళ్లు గరుకుగా, కాంతి లేకుండా ఉంటే ప్రతి రోజు రాత్రి 10 నిమిషాల పాటు రోజ్‌ వాటర్‌తో వాటిపై మసాజ్ చేయండి. రోజ్‌ వాటర్‌లో ఉండే సహజ గుణాలు, మీ గోళ్లకు పోషణను అందించి మెరిసేలా చేస్తాయి.

Rose Water
రోజ్ వాటర్

ఏళ్లనాటి మైగ్రేన్ బాధలు - ఇలా తిండితోనే తగ్గించుకోవచ్చు!

ఆల్మండ్​ ఆయిల్​ : బాదం నూనెలో ఉండే పోషకాలు మీ గోళ్లను ఆరోగ్యంగా, బలంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే గోళ్ల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. బాదం నూనెలోని మాయిశ్చరైజింగ్ లక్షణాలు గోళ్లకు మృదుత్వం, మెరుపును అందిస్తాయి. మీరు ఆల్మండ్​ ఆయిల్​ ప్లేస్​లో ఆవాల నూనెను కూడా రాసుకోవచ్చు. ప్రతిరోజు మీరు రాత్రి గోళ్లను శుభ్రంగా సబ్బుతో కడిగి బాదం నూనెను గోళ్లపై రాసి రెండు మూడు నిమిషాలు మసాజ్‌ చేయండి. ఇలా చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మెరిసే గోళ్లు మీ సొంతమవుతాయి.

Almond Oil
బాదం నూనె

పెట్రోలియం జెల్లీ : దీనిలోని మాయిశ్చరైజింగ్ లక్షణాలు గోళ్లను మృదువుగా, మెరిసేలా చేస్తాయి. అలాగే గోళ్లు పొడిబారకుండా, విరిగిపోకుండా నివారిస్తాయి. గోళ్లు ఆరోగ్యంగా ఉండటానికి పెట్రోలియం జెల్లీ ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని ప్రతిరోజు రాత్రి సబ్బుతో గోళ్లను శుభ్రం చేసుకున్న తరవాత అప్లై చేసుకోవాలి.

Petroleum Jelly
పెట్రోలియం జెల్లీ

నిమ్మతొక్క : నిమ్మతొక్కలోని సిట్రిక్ యాసిడ్​ గోళ్లను మెరిసేలా చేస్తుంది. దీనిని ఉపయోగించడం వల్ల గోళ్లపై ఉండే మరకలు తొలగి, సహజమైన మెరుపు లభిస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్‌ సి గోళ్లను విరిగిపోకుండా చేసి బలంగా మార్చుతుంది. ప్రతిరోజు నిమ్మతోక్కతో గోళ్లను 10 నిమిషాల పాటు మసాజ్‌ చేయాలి. అంతే మిలమిల మెరిసే గోళ్లు మీ సొంతం..

Lemon Peel
నిమ్మతొక్క

జలుబుతో బాధపడుతున్నారా ? ఒక్కసారి ఈ హోమ్‌ టిప్స్ పాటించండి!

పీరియడ్స్ సరిగా రావట్లేదా? ఇవి తింటే చాలు - ప్రాబ్లమ్ క్లియర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.