ETV Bharat / sukhibhava

డైటింగ్​ చేయకుండా బరువు తగ్గాలంటే.. ఇలా చేయండి!

బరువు తగ్గడం అంత సులభం కాదు. అలాగనీ అసాధ్యమూ అనలేము. వెయిట్​లాస్​కు డైటింగ్​తో పాటు ఎన్నో మార్గాలున్నాయి. మీకిష్టమైన పదార్థాలు తింటూనే.. అలవాట్లలో చిన్నచిన్న మార్పుల ద్వారా మీ బరువు నియంత్రించుకోవచ్చు. అవేంటో చూద్దాం!

Weight Loss Tips
బరువు తగ్గే చిట్కాలు
author img

By

Published : Nov 7, 2021, 12:39 PM IST

బరువు పెరగడానికి వివిధ కారణాలుంటాయి. మారిన జీవనశైలి కారణంగా ఊబకాయం తెచ్చుకున్నవాళ్లే ఎక్కువ. ముందు జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యం చేసి.. తీరా లావయ్యాక ఎలా తగ్గాలా అని ఆలోచించేవాళ్లు అధికమయ్యారు. అలాంటివారికి వెంటనే కనిపించే పరిష్కారం డైటింగ్​. ఉపవాసలతో బరువు తగ్గాలనుకోవడం మంచిది కాదని వారికి తెలియకపోవడమే అసలు కారణం. నిజానికి డైటింగ్ కాకుండా బరువు తగ్గడానికి చాలా మార్గాలున్నాయి.

డైటింగ్​ చేయకుండా బరువు తగ్గాలంటే..

  • బరువు తగ్గాలన్న నిర్ణయం తీసుకోగానే తినడం తగ్గించకుండా అలవాట్లలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం మేలైన మార్గం.
  • ముందుగా ఆహారం తీసుకునే వ్యవధి పెంచి.. మెల్లగా తినడం మీద దృష్టి పెట్టాలి.
  • ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ.. మెల్లగా నమిలి తినటం వల్ల కొద్ది సేపటికే కడుపు నిండినట్లు మెదడు సంకేతాలు పంపుతుంది. దీంతో తక్కువ ఆహారం తీసుకోవచ్చు.
  • తగినంత నిద్రపోవడం వల్ల కూడా బరువు తగ్గే అవకాశముంది.
  • ఆహారంలో పండ్లు, కూరగాయాలను అదనంగా చేర్చడం వల్ల బరువు తగ్గుతారు.
  • సూప్స్​ తాగడం వల్ల తక్కువ కేలరీలతో కొలస్ట్రాల్​ స్థితి మెరుగుపరుచుకోవచ్చు. అయితే ఉప్పు, క్రీమ్​ వీలైనంత తక్కువ ఉండేలా జాగ్రత్త పడాలి.
  • బ్రౌన్​రైస్​, బార్లీ, ఓట్స్​ వంటివి ఆహారంగా తీసుకోవడం మేలు.
  • ఫాస్ట్​ఫుడ్​, ఫ్రై, ఎక్కువ ఆయిల్​తో వండిన ఆహారానికి దూరంగా ఉండాలి
  • ఆహారంలో ప్రొటీన్స్​, ఫైబర్​ ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవడం మంచిది.
  • మాంసాహారానికి బదులు కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవడం మేలు.
  • పానీయాలు, ఆహార పదార్థాల్లో చక్కెర శాతం తక్కువగా ఉండేలా చూసుకోవడం మరో ఉత్తమైన మార్గం.
  • టీ, కాఫీకి బదులు గ్రీన్​ టీ తీసుకోవడం మంచిది. ఆల్కహాల్​కు దూరంగా ఉంటే మరీ మంచిది.
  • మానిసిక ప్రశాంత కూడా బరువు తగ్గడానికి సాయపడుతుంది. ఇందుకు యోగా చేయడం ఉత్తమం.
  • ఆహారం తీసుకోవడంలో సమయపాలన.. అలవాటుగా వ్యాయామం చేయడం మేలు.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Weight Loss Tips: ఎన్ని ప్రయత్నాలు చేసినా.. బరువు తగ్గడం లేదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.