ETV Bharat / sukhibhava

గుండె అందరికీ ఒకేలా కొట్టుకోదు.. ఎందుకో తెలుసా? - heart rate monitor

నిరంతరం గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. దీని వేగం అన్నిసార్లూ ఒకేలా ఉండదు. అందరిలోనూ ఒకేలా కొట్టుకోవాలనీ లేదు. రోజంతా మనం చేసే పనులను బట్టి శరీరానికి అవసరమైన ఆక్సిజన్‌ మేరకు దీని వేగం ఆధారపడి ఉంటుంది. గుండె వేగం వ్యక్తులను బట్టి మారిపోతుంటుంది. గుండె వేగం ఆధారంగా శరీర ఆరోగ్యాన్నీ అంచనా వేయొచ్చు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 31, 2022, 7:01 AM IST

Heart Rate Body Health : గుండె వేగం అన్ని సమయాల్లోనూ ఒకే రీతిలో ఉండదు. అందరికీ ఒకేలా కొట్టుకోవాలని లేదు. రోజంతా మనం చేసే పనుల ఆధారంగా వేగం మారుతుంటుంది. గుండె వేగం వయస్సు తోనూ మారుతుందని వైద్యులు చెబుతున్నారు. గుండె కొట్టుకునే వేగం పరిశీలించి ఆరోగ్యాన్ని అంచనా వేస్తారు. మరీ గుండె వేగం తీరుతెన్నులను తెలుసుకుందాం.

  • గుండె సాధారణంగా నిమిషానికి 72సార్లు కొట్టుకుంటుంది. వేగంగా పరుగెత్తినప్పుడు గుండె వేగం పెరుగుతుంది. విశ్రాంతిలో ఉన్నపుడు నెమ్మదిగా పని చేస్తుంది.
  • విశ్రాంతి తీసుకునే సమయంలో ఆరోగ్యవంతుల్లో 60-100 మధ్యలో ఉంటుంది.
  • పరుగు, ఈత పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు 40సార్లు కొట్టుకుంటుంది.
  • విశ్రాంత వేళల్లో కూడా గుండె వేగంగా పని చేస్తుంటే..గ్లాసు నీళ్లు తాగితే నెమ్మదిస్తుంది.
  • కొద్దిసేపు గాఢంగా శ్వాస తీసుకోవడం, రోజుకు అరగంట వ్యాయామం చేయడం, మంచి పోషకాహారం తినడం, బరువు అదుపులో ఉంచుకోవడం, మద్యం, కెఫిన్‌ మితిమీరి తీసుకోకుండా ఉండటం, పొగ వ్యసనాన్ని వదిలేయడంతో గుండె పనితీరు మెరుగు పడుతుంది.
  • ఒత్తిడి తగ్గించే యోగాసనాలు ప్రాణాయామం, ధ్యానం మేలు చేస్తాయి.
  • 220 నుంచి వయస్సు తీసి వేయడంతో గుండె గరిష్ఠ వేగంగా చెబుతారు.
  • వేడి, తేమ వంటి పరిస్థితులు గుండె వేగం పెరిగేలా చేస్తాయి. తీవ్రమైన భావోద్వేగాలు, ఆందోళనలతో గుండె వేగం పెరుగుతుంది.

ఇవీ చదవండి: రోజూ శృంగారంతో ఆ సమస్యలన్నీ మాయం

కిడ్నీల ఆరోగ్యం కోసం ఏ ఆహారం తీసుకోవాలంటే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.