Health Benefits Of Turmeric in Telugu : భారత సంప్రదాయాల్లో పసుపుది ప్రత్యేకమైన స్థానం. పసుపు ఒక యాంటీ బయాటిక్‌లా పనిచేస్తూ ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. శ్వాసకోశ సమస్యలతో పాటు క్యాన్సర్ మహమ్మారితో కూడా ఇది పోరాడుతుంది. పసుపు వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పసుపు.. అల్లం జాతికి చెందినది. భారత్ లోనేగాక ఆసియాలోని చాలా దేశాల్లో తయారుచేసే వంటకాల్లో దీన్ని తప్పకుండా వినియోగిస్తారు. పసుపు వంటకాల్లో వాడే సుగంధ ద్రవ్యమే గాకుండా ఎన్నో రకాల వ్యాధుల్ని ఎదుర్కొనే దివ్య ఔషధం కూడా. ఇది శ్వాసకోశ వ్యాధులకు చక్కటి మందులా పనిచేస్తుంది. ఆర్థరైటిస్ వ్యాధి ఉన్నవారు రోజూ పసుపు తీసుకోవడం మంచిది. దీని వల్ల కీళ్ల నొప్పుల నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా జాయింట్లు పట్టేసినట్లు ఉండకుండా ఉంటాయి. శరీరంలో వాపులు, మంట రాకుండా కూడా పసుపు నిరోధిస్తుంది. పసుపును నల్ల మిరియాలతో కలిపి తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.
"మన దేశంలో వందల ఏళ్ల నుంచి పసుపును వాడుతూ వస్తున్నాం. మనం తయారు చేసుకునే వంటల్లో పసుపును విరివిగా ఉపయోగిస్తుంటాం. అలాంటి పసుపు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫెక్షనల్గా ఉపయోగపడుతుంది. కాబట్టి మన డైట్లో పసుపు వాడకం చాలా ముఖ్యం. క్యాన్సర్ లాంటి రోగాలతో బాధపడేవారు రోజూ 30 నుంచి 40 గ్రాముల పసుపును తీసుకోవాలి".
-డాక్టర్ శ్రావ్య, ప్రముఖ డైటీషియన్.
డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది..
Turmeric Diabetes Study : పసుపు తీసుకునేవారిలో డీటాక్సిఫయింగ్ ఎంజైమ్ ఉత్పత్తి అవుతుంది. ఇది క్యాన్సర్, ట్యూమర్ సెల్స్ పెరగకుండా నిరోధిస్తుంది. మరోవైపు క్యాన్సర్ రోగులు కీమోథెరపీ చికిత్స తీసుకున్నప్పుడు వారికి వైద్యులు ఇచ్చే మందులతోనూ పసుపు కలసి పనిచేస్తుంది. టైప్-2 డయాబెటిస్ చికిత్సలో పసుపు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలో వాపులు రాకుండా నిరోధించే పసుపు.. రక్తంలో చక్కెర స్థాయులను కూడా నియంత్రిస్తుంది. దీంతో టైప్-2 డయాబెటిస్ చాలా వరకు నియంత్రణలో ఉండే అవకాశం ఉంది.
డైట్లో చేర్చుకోండి..
Turmeric Diet Drink : సాధారణ గాయాలతో పాటు బ్లీడింగ్ సమస్యను తగ్గించడంలోనూ పసుపు బాగా పనిచేస్తుందని డాక్టర్ శ్రావ్య అన్నారు. యాంటీ యాక్సిడెంట్, యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉండి.. టిష్యూ రిపేర్‌కు కూడా పసుపు దోహదపడుతుందని ఆమె చెప్పారు. అందుకే రోజువారీ డైట్ లో పసుపును చేర్చుకోవాలని సూచించారు. పసుపును వంటల్లో చేర్చి తీసుకోవడం లేదా గోరువెచ్చటి నీళ్లలో కలిపి తాగొచ్చన్నారు డైటీషియన్ శ్రావ్య. అల్జీమర్స్ లాంటి మెదడు సంబంధింత సమస్యలతో బాధపడేవారు రోజూ పసుపును తీసుకోవడం ఎంతో ఉత్తమమని ఆమె పేర్కొన్నారు.
వాతావరణ మార్పుల వల్ల అలర్జీలు, వైరల్ ఇన్ఫెక్షన్లు కలగడం సాధారణం. అయితే వీటికి పసుపు చక్కటి ఔషధంగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుకోవాలంటే పసుపు టీ తాగితే ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
రోజూ చిటికెడు తీసుకోండి..
Turmeric for Cholesterol : ఈ రోజుల్లో పనిభారం పెరగడం, ఉరుకుల పరుగుల జీవితం కారణంగా మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది. రోజువారీ పనులతో అలసిపోయేవాళ్లతో పాటు ఒత్తికి గురయ్యేవారికి కూడా పసుపు మంచి ఔషధంగా పనిచేస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయుల్ని నియంత్రించడంలోనూ పసుపు ఉపయోగం చాలా ఉంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయులు నియంత్రణలో ఉంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంటే.. చిటికెడు పసుపు ప్రాణాన్ని కాపాడుతుందన్న మాట.
Why Am I Always Hungry : మళ్లీ మళ్లీ ఆకలిగా అనిపిస్తుందా? ఎంత తిన్నా తీరడం లేదా? ఇలా చేస్తే సెట్!
Drinking Water Before Sleep : నిద్రపోయే ముందు నీళ్లు తాగడం మంచిదేనా? డాక్టర్లు ఏమంటున్నారు?