వివాహం తర్వాత చాలామంది దంపతులు సంతానం కోసం తహతహలాడుతుంటారు. కొందరు మహిళలు వీలైనంత త్వరగా మాతృత్వాన్ని ఆస్వాదించాలని భావిస్తారు. ఈ సమయంలోనే ఆ దంపతులకు ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. పిల్లలు పుట్టాలంటే ఏ సమయంలో సెక్స్ చేయాలి! పగలు శృంగారం చేస్తే పుట్టే పిల్లల్లో లోపాలు ఏర్పడతాయా!.. గర్భదారణకు పగలు సరైన సమయమేనా!.. వంటి అనుమానాలు వస్తాయి. మరి ఇవి నిజమేనా? దీనిపై నిపుణులు ఏమంటున్నారు.
పగటిపూట రతిలో పాల్గొంటే సంతానంలో అవలక్షణాలు ఏర్పడతాయా?
నిపుణుల సమాధానం: ఇది అపోహ మాత్రమే. రతికి ఓ సమయం అంటూ ఏదీ లేదు. వారికి నచ్చినప్పుడు శృంగారంలో ఏ సమయంలోనైనా పాల్గొనవచ్చు. పగటిపూట రతి చేస్తే.. సంతానంలో అవలక్షణాలు రావడమనేది భ్రమ మాత్రమే. అలాగే ఒకే రాత్రి రెండోసారి రతి చేస్తే మహిళలు గర్భం దాల్చేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇదీ చూడండి: వ్యాయామానికి ముందు.. తర్వాత ఇవి తప్పనిసరి!