ETV Bharat / sukhibhava

లాక్​డౌన్​లో మీ శరీరం స్పీడు తగ్గిందా? - lockdown excercise

లాక్​డౌన్​ అంటే పొద్దస్తమానం ఇంట్లోనే ఉండాలి. శరీరానికి పని తగ్గింది. కనీసం వ్యాయామాలు చేద్దామంటే.. జిమ్​లు, యోగా కేంద్రాలన్నీ మూతపడ్డాయి. ఇక ఇంటికే అంకితమై వేళాపాళా లేకుండా నిద్రపోవడం, తినడం చేస్తూ.. అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నాం. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి అంటారా? మీ కోసమే ఈ చిట్కాలను తీసుకొచ్చింది 'ఈటీవీ భారత్'. అవేంటో చూసేద్దాం!

has-lockdown-slowed-you-down
లాక్​డౌన్​లో మీ శరీరం స్పీడు తగ్గిందా?
author img

By

Published : Jun 3, 2020, 10:19 AM IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్​డౌన్​తో​.. ప్రజలు ఇన్ని రోజులు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో వారి ఆరోగ్యం, శరీర పనితీరుపై తీవ్ర ప్రభావం పడింది. మామూలు రోజుల్లో హడావిడిగా పని చేసేందుకు అలవాటు పడిన శరీరం.. ఒక్కసారిగా నెమ్మదించే సరికి ఎలా పనిచేయాలో తెలియక సతమతమవుతోంది. దీంతో హార్మోన్లలో మార్పు వస్తోంది. ఈ మార్పు వల్ల శరీరం అలసిపోతోంది. ఫలితంగా ప్రశాంతత లోపిస్తోంది. అందుకే లాక్​డౌన్​ నేపథ్యంలో మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలో చెబుతున్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్​ రాజేశ్​ ఉక్కాలా.

హైదరాబాద్ వీఐఎన్​ఎన్​ హాస్పిటల్స్​లో వైద్యులుగా పనిచేస్తున్న డా.రాజేశ్..​ లాక్​డౌన్​ కారణంగా ఎంతో మంది మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అయితే మనస్సు ఆరోగ్యంగా ఉంటే.. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అందుకే శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొన్ని చిట్కాలను ఈటీవీ భారత్​ వీక్షకులకు అందిస్తున్నారు..

మేలైన నిద్ర!

నిద్ర మన శరీరానికి మేలు చేస్తుందని అందరికీ తెలుసు. నిద్ర లేకపోతే అలసట, చిరాకు వస్తాయి. పనిపై ధ్యాస ఉండదు. అందుక.. ఏదో నామమాత్రంగా పడుకున్నామంటే సరిపోదు. కనీసం 7-9 గంటలు ఎలాంటి అవాంతరాలు లేని నిద్రే మేలైన నిద్ర. అలా నిద్రిస్తేనే శరీరానికి తృప్తి.. మనసుకు సంతృప్తి.

ఎండ తాకాలి..

లాక్​డౌన్​లో రోజంతా ఇంట్లోనే ఉండాలి. అలా అని కదలకుండా నాలుగు గోడల మధ్యే ఉంటే పొరపాటే. ఉదయం పూట శరీరానికి కాసింత ఎండ తాకనివ్వకపోతే చాలా కష్టం. సూర్యకిరణాలతో లభించే విటమిన్​-డి లేకపోతే ఉత్సాహం తగ్గుతుంది. ఒళ్లంతా బద్దకంగా ఉంటుంది.

నీరు తాగాలి మరి!

శరీరాన్ని ఎప్పటికప్పుడు హైడ్రేట్​ చేయడం ఆరోగ్య జాగ్రత్తల్లో ప్రథమం. అందుకే నీరు అధికంగా తాగుతూ ఉండాలి. ముఖ్యంగా ఎండాకాలంలో నీరు ఎక్కువ తీసుకోవాలి. దీంతో డీహైడ్రేషన్​, వడదెబ్బల నుంచి కాపాడుకోవచ్చు. అంతే కాదు నీరు అధికంగా తీసుకోవడం వల్ల శరీరం చురుగ్గా పని చేస్తుంది.

అప్పటిలాగే ఉండండి!

లాక్​డౌన్​కు ముందు మీరు ఏ ఏ పనులు చేసేవారో.. అవి రోజూ చేయండి. అంటే, లాక్​డౌనే కదా పనేమీ లేదని పడుకోకుండా.. ఉదయాన్నే లేచి, వ్యాయమం, ఇంటి పనులు చేసుకోండి. పనులు పూర్తయ్యాక మిగిలిన సమయాన్ని సృజనాత్మకంగా వినియోగించండి. కుటుంబంతో కలిసి గడపండి. ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవరచుకోండి.

పగలు కునుకు తీయొద్దు!

పగటి పూట నిద్రపోవడం మానేయాలి. లేకపోతే రాత్రిళ్లు నిద్ర రాదు. దీంతో మరుసటి రోజు దినచర్య క్రమం తప్పుతుంది. బాగా అలసిపోయినప్పుడు పగలు ఓ గంట సేపు నిద్రపోవడం తప్పు కాదు. అయితే, బోర్​ కొట్టి.. ఏం చేయాలో తోచక అదే పనిగా పడుకుంటే మాత్రం ప్రమాదకరం.

ఇదీ చదవండి:లాక్​డౌన్​ బద్దకాన్ని వదిలించుకోండిలా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.