Hairfall prevention tips: కొవిడ్ బారినపడ్డ చాలామంది జుట్టు రాలడం సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో వాడిన యాంటీ వైరల్స్, స్టెరాయిడ్ల వల్ల ఇలా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఊడిన జుట్టు తిరిగి వస్తుందా? ఉన్న జుట్టు రాలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఓసారి పరిశీలిస్తే..
hairfall prevent food: జుట్టు రాలే సమస్యకు డైట్‌కు ప్రత్యక్ష సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. తినే పదార్థాల్లో జింక్, ఇనుము, ఫోలిక్‌యాసిడ్లు ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. అలానే విటమిన్-ఎ ఎక్కువగా ఉండే చిలగడదుంప, పాలకూర, క్యారెట్లు, పాలు, గుడ్లు తీసుకోవాలి. వీటితో పాటు విటమిన్-డి లభించే చేపలు, పుట్టుగొడుగులు వంటివి తినాలి. తృణధాన్యాలు, బాదం, మాంసం, చేప, ఆకుకూరల్లో బయోటిన్ దొరుకుతుంది. స్ట్రాబెర్రీలు, కమలాలు, జామకాయలు వంటి పండ్లలో విటమిన్-సి ఉంటుంది. విటమిన్-ఇ, ప్రొటీన్ లభించే పనీర్, పొద్దు తిరుగుడు గింజల్నీ తరచూ తింటే మంచిది. నువ్వులను బెల్లంతో కలిపి తినొచ్చు. గుమ్మడిగింజలు, గోధుమగడ్డి, కందిపప్పు, సెనగపప్పులో జింక్ దొరుకుతుంది. ఈ పోషకాలన్నీ కలగలిసిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ సమస్యను అధిగమించొచ్చు.
Hairfall prevention:
జాగ్రత్తలు: శారీరక వ్యాయామం, ధ్యానం తప్పనిసరి. రోజూ ఎనిమిది గ్లాసుల మంచినీళ్లు తాగాలి. హెయిర్‌డైలు, ఇతర రసాయన చికిత్సలకు దూరంగా ఉండాలి. గాఢత తక్కువగా ఉండే షాంపూ ఉపయోగించాలి. తలస్నానం తర్వాత కండిషనర్ వాడాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే ఊడిన జుట్టు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అయినా ఫలితం లేకపోతే డాక్టర్‌ను సంప్రదిస్తే విటమిన్, బయోటిన్ ట్యాబ్లెట్లు ఇస్తారు. అలాగే ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా(పీఆర్‌పీ) పద్ధతి ద్వారా కూడా జుట్టు ఊడటాన్ని నియంత్రించవచ్చు.
వర్షకాలంలో జుట్టు సంరక్షణ..
Hairfall in Monsoon: వర్షకాలంలో గాలిలో హైడ్రోజన్ స్థాయులు అధికంగా ఉంటాయి. అవి జుట్టుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, ఫలితంగా జుట్టు రాలే సమస్య అధికమవుతుందంటున్నారు సౌందర్య నిపుణులు. అంతేకాదు.. మన శరీరంలో హార్మోన్ల అసమతుల్యత కూడా ఈ సమస్యకు మరో కారణంగా చెప్పుకోవచ్చు. మన వంటింట్లో ఉండే మూడు పదార్థాలు ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపుతాయని చెబుతున్నారు.
మెంతులు..
కొద్దిగా కొబ్బరి నూనెను వేడి చేసి అందులో కొన్ని మెంతులు వేసి చల్లారేంత వరకు అలాగే పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత ఈ నూనెను రాత్రి పడుకునే ముందు కుదుళ్లకు పట్టించి మసాజ్ చేయాలి.. రాత్రంతా అలాగే ఉంచుకోవాలి. అలాగే మెంతుల్ని మీరు రోజూ తీసుకునే ఆహార పదార్థాల్లోనూ భాగం చేసుకోవాలి. కిచిడీలో, రుచి కోసం రైతాలో, గుమ్మడికాయ వంటి కాయగూరలతో తయారుచేసే వంటకాల్లో మెంతుల్ని వాడచ్చు. కొంతమందిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల జుట్టు రాలే సమస్య అధికమవుతుంది. అలాంటి వారు మెంతుల్ని ఆహారంలో భాగం చేసుకుంటే సమస్య నుంచి సత్వర ఉపశమనం పొందచ్చు. అలాగే రక్తంలో ఇన్సులిన్ స్థాయుల్ని కూడా ఇవి క్రమబద్ధీకరిస్తాయి.
అలీవ్ గింజలు (అడియాలు)
అలీవ్ గింజలు (అడియాలను) నీళ్లలో నానబెట్టి.. రాత్రి పడుకునే ముందు తాగే పాలలో కలుపుకొని తీసుకోవాలి. లేదంటే ఈ గింజలను కొబ్బరి తురుము, నెయ్యితో కలిపి ఉండలుగా చేసుకొని కూడా తీసుకోవచ్చు. తద్వారా ఈ గింజల్లో పుష్కలంగా ఉండే ఐరన్ శరీరంలోకి చేరుతుంది. అంతేకాదు.. కీమోథెరపీ చికిత్స చేయించుకునే క్రమంలో జుట్టు బాగా రాలిపోతుంటుంది. అలాంటి వారికి ఈ గింజలు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయి.
జాజికాయ
పాలల్లో కొన్ని అలీవ్ గింజలు, కొద్దిగా జాజికాయ పొడి వేసుకొని బాగా కలుపుకొని రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. ఫలితంగా జాజికాయలో అధికంగా ఉండే విటమిన్ 'బి6', ఫోలికామ్లం, మెగ్నీషియం.. వంటి పోషకాలు జుట్టు రాలే సమస్యను తగ్గించడంతో పాటు ఒత్తిడి, ఆందోళనలను దూరం చేస్తాయి.
ఇవి కూడా!
- నెయ్యిలో ఉండే అత్యవసర కొవ్వు పదార్థాలు జుట్టు రాలే సమస్యను అరికడతాయి.
- పసుపులో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలున్నాయి.
- పెరుగులో ఉండే ఖనిజాలు ప్రొబయోటిక్ బ్యాక్టీరియా సమస్య నుంచి సత్వర ఉపశమనం కలిగిస్తాయి.
- వర్షకాలంలో జుట్టు ఎక్కువగా రాలుతోందని కంగారు పడే వాళ్లు ఈ వంటింటి చిట్కాలను పాటించి ఆ సమస్యను అరికట్టవచ్చు. కాబట్టి వీటిని మనమూ ఫాలో అయిపోయి అటు సౌందర్యాన్ని, ఇటు ఆరోగ్యాన్నీ పరిరక్షించుకుందాం..!
ఇదీ చదవండి: