ETV Bharat / sukhibhava

జామకాయ తింటే బరువు తగ్గుతారా, షుగర్ ఉన్నవాళ్లు తినొచ్చా

జామకాయల సీజన్‌ రానే వచ్చేసింది. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాలకు మంచిదని డాక్టర్లు అంటుంటారు. ముఖ్యంగా నెలసరిలో నొప్పి, ఎన్‌టీడీ లాంటి సమస్యలున్న మహిళలకు ఎంతో మేలుచేసే ఈ జామకాయ గురించి మరిన్ని విషయాలు.

author img

By

Published : Aug 20, 2022, 7:01 AM IST

guava benifits to women
guava benifits to women

*జామకాయలో విటమిన్లు, సోడియం, పొటాషియం, ప్రొటీన్లు ఉన్నందున ఇది మంచి పోషకాహారం.
* నెలసరిలో వచ్చే నొప్పి, ఇబ్బందులకు జామ దివ్యౌషధంలా పనిచేస్తుంది.
* ఇవి తినడం వల్ల గర్భిణులకు అవసరమైన ఫోలిక్‌ యాసిడ్‌ అందుతుంది. ముఖ్యంగా న్యూరల్‌ ట్యూబ్‌ డిఫెక్ట్‌ (ఎన్‌టిడి) సమస్య ఉన్న స్త్రీలలో గర్భస్రావం, శిశు మరణాల్లాంటివి సాధారణం. జామకాయలు ఆ సమస్యను చాలా వరకూ నివారిస్తాయని అధ్యయనాల్లో తేలింది.

* మధుమేహం ఉన్నవారు చాలా పండ్లు తినకూడదు. కానీ జామ మినహాయింపు. పైగా రక్తంలో షుగర్‌ స్థాయిని తగ్గిస్తుంది. హృద్రోగాలను అరికడుతుంది.
* ఇందులోని బి-3, బి-6 రక్తాన్ని సాఫీగా సరఫరా చేయడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
* ఇది సౌందర్య సాధనం కూడా. దీంతో చర్మం మృదువుగా ఉంటుంది. ముఖంలో నునుపు, మెరుపు సంతరించుకుంటాయి.

* పీచు పుష్కలంగా ఉంటుంది కనుక జీర్ణప్రక్రియకు దోహదం చేస్తుంది. మరీ పండిపోకుండా దోరగా ఉన్న వాటిని తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
* బరువు తగ్గాలనుకునే అమ్మాయిలు ఈ పండ్లు రోజుకొకటి తింటే చాలు సత్వర ఫలితం ఉంటుంది.
* జామకాయలో యాంటీ క్యాన్సర్‌ గుణాలు ఉన్నాయి. తరచూ తిన్నట్లయితే ఆ మహమ్మారికి దూరంగా ఉన్నట్లే.

* వీటిలో ఉన్న సి విటమిన్‌ నోటిపూతను రానివ్వదు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
* కళ్లకు మేలు చేస్తుంది. చయాపచయ క్రియ (మెటబాలిజం)ను క్రమబద్ధం చేస్తుంది.
* తీపి పెద్దగా ఇష్టపడని వాళ్లు ఉప్పూకారం లేదా మిరియాల పొడి అద్దుకుని తినొచ్చు. పండిన కాయలతో హల్వా, సాస్‌.. పచ్చివాటితో కూర, పచ్చడి చేసేవారున్నారు.

ఇదీ చదవండి:

ఇన్‌ఫ్లమేషన్‌ బాధలకు ఈ అమృతాహారంతో చెక్

కిస్​మిస్​తో లాభాలెన్నో.. రోజుకు ఎన్ని తినాలంటే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.