ETV Bharat / sukhibhava

బాదం, పిస్తాలను వేయిస్తే ఏమవుతుందో తెలుసా? - fried nuts are not good for health

ఏం తినాలో కాదు, ఎలా తినాలో కూడా తెలియాలి. ముఖ్యంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బాదం, జీడి పప్పు, పిస్తా వంటి గింజపప్పుల (నట్స్‌) విషయంలో పొరపాట్లు తగవు.

fried nuts are not good for health as good cholesterol will vanish
బాదం, పిస్తాలను వేయిస్తే ఏమవుతుందో తెలుసా?
author img

By

Published : Sep 15, 2020, 5:22 PM IST

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బాదం, జీడి పప్పు, పిస్తా వంటి గింజపప్పుల (నట్స్‌)ను రుచి కోసం కొందరు వేయిస్తుంటారు. వేయిస్తే రుచి పెరగటం నిజమే గానీ ఇదంత మంచిది కాదు. గింజపప్పులను వేయించినప్పుడు వీటిల్లోని మంచి కొవ్వులు దెబ్బతింటాయి.

గింజపప్పుల్లో విటమిన్‌ ఇ, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వంటి పోషకాలూ దండిగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లూ ఎక్కువే. వేయించినప్పుడు ఇవీ దెబ్బతినే ప్రమాదముంది. విశృంఖల కణాల పనిపట్టే యాంటీ ఆక్సిడెంట్లు దెబ్బతింటే మేలు కన్నా కీడే ఎక్కువ. గింజపప్పులను వేయిస్తే అక్రిలమైడ్‌ అనే రసాయనమూ పుట్టుకొస్తుంది. ఇది ఆరోగ్యానికి హాని చేస్తుంది. అంతగా గింజపప్పులను వేయించాలనుకుంటే తక్కువ వేడి మీద వేయించుకోవచ్చు. అలాగే ఎక్కువ సేపు వేగకుండానూ చూసుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.