ETV Bharat / sukhibhava

టీ, కాఫీలకు బదులు పరగడుపున ఇవి తీసుకుంటే అన్ని రోగాలూ నయం!

author img

By

Published : Oct 25, 2022, 9:37 AM IST

ఉదయం లేవగానే టీ, కాఫీలకు బదులు కొన్ని పదార్థాలు తీసుకుంటే రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ పదార్థాలేంటో తెలుసుకొని మనమూ వాటితో రోజును ప్రారంభించేద్దామా?

foods-TO eat empty-stomach
foods-TO eat empty-stomach

కొందరికి నిద్ర లేచింది ఆలస్యం.. కాఫీ లేదా టీ గొంతులో పడకపోతే ఉండలేరు. అయితే వీటికి బదులు పరగడుపున కొన్ని పదార్థాల్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇలా తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా మన సొంతమవుతాయట! అయితే ఆలస్యమెందుకు.. ఆ పదార్థాలేంటో తెలుసుకొని మనమూ వాటితో రోజును ప్రారంభించేద్దాం రండి..!

ఉసిరి

ఉసిరిలో విటమిన్‌-సి అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో తోడ్పడతాయి. ఈక్రమంలో పరగడుపునే దీనిని తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. ఉసిరి గుజ్జును గోరువెచ్చని నీటిలో కలుపుకొని ఉదయాన్నే తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఉసిరిలో చర్మ సౌందర్యం, శిరోజాల సంరక్షణకు సంబంధించిన పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయట! క్రమం తప్పకుండా ఉసిరిని తీసుకోవడం ద్వారా చర్మానికి మెరుపు, జుట్టుకు పటుత్వం లభిస్తాయి.

తేనె

పరగడుపునే గోరువెచ్చటి నీటిలో తేనెను కలిపి తీసుకోవడం ద్వారా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. ఇందులోకి కాస్త నిమ్మరసం జోడిస్తే రుచితో పాటు రోగనిరోధక శక్తిని సైతం పెంపొందించుకోవచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు శరీరంలోని హానికారక బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులతో పోరాడడానికి కావాల్సిన శక్తిని శరీరానికి అందిస్తాయి. ఇలా తేనెను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అధిక బరువు నుంచి కూడా ఉపశమనం పొందచ్చు. చర్మ సౌందర్యమూ ఇనుమడిస్తుంది.

తులసి

అలాగే రోజూ తులసి ఆకులను నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందచ్చు. ఐదు తులసి ఆకులను రాత్రంతా నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం పరగడుపునే ఆ ఆకులు తినాలి.. నీటిని తాగాలి. తద్వారా దగ్గు, జలుబు లాంటి ఇన్ఫెక్షన్ల నుంచి తక్షణ ఉపమశమనం పొందచ్చు. అంతేకాదు తులసి రసం తాగితే చర్మానికి, శిరోజాలకు, దంతాలకు కూడా ఎంతో మంచిదంటున్నారు నిపుణులు.

వెల్లుల్లి

సహజసిద్ధమైన యాంటీ బయాటిక్‌గా పిలిచే వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్‌, యాంటీ వైరల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి జలుబు, దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు కావాల్సిన శక్తిని శరీరానికి అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించి గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా కాపాడతాయి. అందుకే వెల్లుల్లిని రోజూ తినే ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు పరగడుపునే వెల్లుల్లిని తీసుకోమంటున్నారు నిపుణులు. ఈక్రమంలో ఉదయాన్నే రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవాలి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కూడా దూరమవుతాయి.

ఉదయాన్నే కాఫీ, టీలు తాగే బదులు పైన చెప్పిన పదార్థాలను ట్రై చేయండి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.