ETV Bharat / sukhibhava

ఒకసారి శృంగారం.. ఎన్ని మైళ్ల నడకకు సమానమో తెలుసా? - importance of kanuga

Exercize Uses: వ్యాయామం.. శృంగారజీవితానికి కూడా మేలు చేస్తుందని అంటున్నారు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌కు చెందిన నిపుణులు. అరగంటసేపు శృంగారంలో చురుకుగా ఉన్న మగవాళ్లలో 125, ఆడవాళ్లలో 100 క్యాలరీలు కరుగుతాయనీ, ఇది మూడు మైళ్లు నడకతో సమానమనీ అంటున్నారు. ఒత్తిడి తగ్గి ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి క్రమబద్ధమైన వ్యాయామం చేయడం అన్నివిధాలా మేలనీ చెబుతున్నారు.

uses of Exercize
కొవిడ్‌ తెచ్చిన తంటా!
author img

By

Published : Mar 27, 2022, 2:29 PM IST

Exercize Uses: చాలామంది వ్యాయామం శారీరకపరమైన ఆరోగ్యం కోసం మాత్రమే అనుకుంటారు. కానీ అది శృంగారజీవితానికీ మేలు చేస్తుంది అంటున్నారు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌కు చెందిన నిపుణులు. సాధారణంగా 43 శాతం ఆడవాళ్లలోనూ 31 శాతం మగవాళ్లలోనూ శృంగార జీవితానికి సంబంధించిన లోపాలు తలెత్తుతున్నాయట. ఊబకాయం, వ్యాయామం లోపాలే ఇందుకు ప్రధాన కారణాలని తేల్చారు. ముఖ్యంగా నడుం చుట్టుకొలత ఎక్కువగా ఉన్నవాళ్లలో శృంగార వాంఛలు తక్కువగా ఉంటున్నాయనీ, అదే వారానికి కనీసం ఆరు గంటలకు పైగా వ్యాయామం చేసే స్త్రీ, పురుషుల్లో ఈ రకమైన సామర్థ్యం బాగుందనీ గుర్తించారు. ఎందుకంటే శృంగారం అనేది కేవలం పిల్లలకోసం మాత్రమేకాదనీ దానివల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందనీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందనీ అంటున్నారు. పైగా అరగంటసేపు శృంగారంలో చురుకుగా ఉన్న మగవాళ్లలో 125, ఆడవాళ్లలో 100 క్యాలరీలు కరుగుతాయనీ, ఇది మూడు మైళ్లు నడకతో సమానమనీ అంటున్నారు. అన్నింటికన్నా ఒత్తిడి తగ్గి ఆరోగ్యం బాగుంటుందనీ కాబట్టి క్రమబద్ధమైన వ్యాయామం చేయడం అన్నివిధాలా మేలనీ అంటున్నారు.

కొవిడ్‌ తెచ్చిన తంటా!

uses of Exercize
కొవిడ్‌ తెచ్చిన తంటా!

హమ్మయ్య.. కొవిడ్‌ వచ్చింది, తగ్గింది అనుకోవడానికి లేకుండా పోయింది. ఎందుకంటే కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరి వారం రోజులకు పైగా బాధపడి కోలుకున్న వాళ్లు 16 నెలల తరవాత రకరకాల మానసిక సమస్యలకు గురవుతున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వాళ్లలో డిప్రెషన్‌, ఆందోళనల స్థాయి ఎక్కువగా ఉంటోందట. అయితే ఇది అందరిలో ఒకేలా ఉండటం లేదనీ కొవిడ్‌ తీవ్రతని బట్టి ఉంటుందనీ అంటున్నారు. దాదాపు రెండున్నర లక్షల మందిలో అధ్యయనాన్ని చేపట్టినప్పుడు- ఒత్తిడి, కుంగుబాటులతోపాటు నిద్రలేమికీ వాళ్లు గురవుతున్నట్లు గుర్తించారు. సహజంగానే అంతో ఇంతో ఈ రకమైన సమస్యలు ఉన్నవాళ్లలో అవి మరింత ఎక్కువవుతున్నాయట. బహుశా కొవిడ్‌-19 వల్ల ఇన్‌ఫ్లమేషన్‌పెరుగుతుందనీ దానివల్లే ఈ మానసిక సమస్యలు తలెత్తుతున్నాయనీ అంటున్నారు కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌ నిపుణులు.

వృద్ధాప్యం రాకుండా..!

uses of Exercize
వృద్ధాప్యం రాకుండా..!

Exercize Importance: వయసు పెరిగేకొద్దీ మతిమరుపూ కాళ్లూ కీళ్లనొప్పులూ వస్తుంటాయనీ శక్తి సన్నగిల్లుతుందనీ తెలిసిందే. అయితే వీటన్నింటికీ కారణమైన ఓ ప్రొటీన్‌ను గతంలోనే గుర్తించారు. అయితే ఆ ప్రొటీన్‌ను విడుదల చేసే కణాల వృద్ధిని అడ్డుకునే మందుల్ని కనుగొన్నారు మేయో క్లినిక్‌ పరిశోధకులు. వీటినే సెనొలిటిక్స్‌ అంటున్నారు. సెనిసెంట్‌ కణాలు పెరగడంవల్లే వృద్ధాప్యమూ తద్వారా వ్యాధులూ వస్తుంటాయట. కాబట్టి ఆ కణాలను మందులతో నిర్మూలించే విధానాన్ని కనుగొన్నారన్నమాట. అదెలా అంటే- ఈ మందులు వయసుని అడ్డుకునే ఎ-క్లొతొ అనే ప్రొటీన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయట. దానివల్ల శుష్కించిన కండరాలు మళ్లీ పెరుగుతాయనీ ఆస్టియోపొరొసిస్‌ వంటి వ్యాధులు సైతం తగ్గుతాయనీ, ఆయుష్షు పెరుగుతుందనీ అంటున్నారు. ఈ ప్రొటీన్‌ను ఎలుకల్లో నేరుగా ప్రవేశపెట్టగా- వాటి ఆయుష్షు 30 శాతానికి పైగా పెరిగిందట. అయితే మనుషులకి అలా ఇస్తే సమస్యలు ఎదురవుతాయన్న కారణంతో సెనోలిటిక్స్‌ను రకరకాల కాంబినేషన్లలో నోటి ద్వారా ఇచ్చినప్పుడు కూడా ఎ-క్లొతొ ప్రొటీన్‌ శాతం పెరిగిందట. కాబట్టి త్వరలోనే దీన్ని పూర్తిస్థాయిలో వాడుకలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సదరు నిపుణులు.

ఔషధాల ఖజానా.. కానుగ!

uses of Exercize
ఔషధాల ఖజానా.. కానుగ!

వేసవిలో వచ్చే ముంజెలమీద కానుగ ఆకుల్ని కప్పడం చూస్తుంటాం. కారణం ఏమిటాని పరిశీలిస్తే- వేసవి ప్రారంభంలో కానుగ చెట్టు ఆకులన్నీ రాలి, చిగురించిన ఆకులన్నీ పచ్చని నిగారింపుతో మెరుస్తుంటాయి. వాటిమీద ఒకరకమైన మైనపు పూత ఉంటుంది. కాబట్టి అవి ముంజెల్లోని తడిని పీల్చవు సరికదా, ఆ ఆకుల వాసన వాటికి అంటదన్నమాట. దాంతో ముంజెలు తాజాగా ఉంటాయి. ఈ సంగతి అలా పెడితే, రోడ్డుపక్కన చల్లనినీడకోసం పెంచే కానుగ చెట్టు ఆరోగ్యానికి శ్రీరామరక్షలాంటిది. దీని ఆకులూ గింజలూ ఆయుర్వేదంలో వాడతారు. కడుపునొప్పి, గ్యాస్‌ సంబంధిత సమస్యలు, డయేరియా, దగ్గు... వంటి సమస్యలకి ఆకుల కషాయం పనిచేస్తుంది. ఇంకా రోగనిరోధకశక్తిని పెంచుతుంది. కానుగపుల్లతో దంతధావనం చేస్తే రుచి గ్రంథులు బాగా పనిచేస్తాయి. వీటి కాయల్లోని గింజల్ని మెత్తగా నూరి గాయంమీద పెడితే రక్తం కారడం తగ్గుతుంది. ఈ గింజలనుంచి తీసిన నూనెను బయోడీజిల్‌గా ఉపయోగిస్తారు. దీపాలు పెట్టడానికీ వాడతారు. ఇందులోని యాంటీబయోటిక్‌ గుణాల వల్ల వత్తి కాలినప్పుడు వచ్చే వాసన సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తుంది. చర్మసమస్యలకి ఈ నూనె మందులా పనిచేస్తుంది. జలుబుతో బాధపడేవాళ్లకి ఈ నూనెను ఛాతీమీద మర్దిస్తే ఫలితం ఉంటుంది. అతిమూత్ర సమస్యకి కానుగపూల పొడి పనిచేస్తుందట. కాబట్టి ఎక్కడో ఒకచోట కానుగ చెట్లను పెంచండి.

ఇదీ చదవండి: ఉల్లిపాయ తింటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.