ETV Bharat / sukhibhava

ఎగ్స్​ Vs పనీర్​- ఏది మంచిది? ఎందులో ప్రొటీన్​​ ఎక్కువ! - best protein source

Eggs vs Paneer : పనీర్, గుడ్లు మనలో చాలా మంది ఆహారంగా తీసుకునే రెండు ప్రధాన ప్రొటీన్ వనరులు. ఈ రెండింటిలో పోషక విలువలు ఎక్కువగా ఉన్నందున వీటిని ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ప్రొటీన్​ పరంగా ఈ రెండింటిలో ఏది మంచిదో.. ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Eggs vs Paneer
Eggs vs Paneer
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 14, 2024, 11:13 AM IST

Egg Vs Paneer Which is Better: ఆహారంలో ప్రొటీన్ ఎక్కువ తీసుకోవాలి అనగానే మనకి గుర్తొచ్చే.. మొదటి రెండు ఆహార పదార్ధాలు ఎగ్స్, పనీర్. హై క్వాలిటీ ప్రొటీన్​కి ఇవి రెండూ పెట్టింది పేరు. రెండింటిలోనూ కాల్షియం, ఐరన్, బీ12 వంటి పోషకాలు ఉన్నాయి. వెజిటేరియన్స్​కి ఇక్కడ ఉన్న ఆప్షన్ పనీర్​ ఒకటే.. కానీ, నాన్ వెజిటేరియన్స్ రెండూ(పనీర్​, ఎగ్స్​) ఎంజాయ్ చేయవచ్చు. అయితే ప్రొటీన్​ పరంగా ఈ రెండింటిలో ఏది బెటర్​ అనే దానిపై చాలా మందిలో సందేహాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎగ్స్(Eggs)​: హై క్వాలిటీ ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలలో ఎగ్స్ కూడా ఒకటి. ఇవి అన్ని చోట్లా లభిస్తాయి. పెద్ద ఖరీదు కూడా ఏం కాదు.. అందరికీ తక్కువ ధరకే అన్ని చోట్లా అన్ని వేళలా అందుబాటులో ఉంటాయి. ప్రొటీన్ మాత్రమే కాదు ఎగ్స్​లో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, విటమిన్ ఏ, బీ,ఈ, కే, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. పచ్చ సొనలో క్యాలరీలు ఎక్కువని చాలా మంది దానిని వదిలేసి తెల్ల సొన మాత్రమే తింటారు. నిజానికి పచ్చ సొన లోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయి. రోజుకి ఒక ఎగ్ పూర్తిగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

మీకు నల్ల పసుపు గురించి తెలుసా? - లేదంటే ఈ ఆరోగ్య ప్రయోజనాలు మిస్ అయినట్లే!

దీని పోషకాలు చూసుకుంటే.. 40 గ్రాములు కోడిగుడ్డులో.. ప్రొటీన్ - 5.5 గ్రాములు, ఫ్యాట్ - 4.2 గ్రాములు, కాల్షియం - 24.6 మిల్లీ గ్రాములు, ఐరన్ - 0.8 మిల్లీ గ్రాములు, మెగ్నీషియం - 5.3 మిల్లీ గ్రాములు, ఫాస్ఫరస్ - 86.7 మిల్లీ గ్రాములు, పొటాషియం - 60.3 మిల్లీ గ్రాములు, జింక్ - 0.6 మిల్లీ గ్రాములు, కొలెస్ట్రాల్ - 162 మిల్లీ గ్రాములు, సెలీనియం - 13.4 మైక్రో గ్రాములు ఉన్నాయి..

పనీర్(Paneer)​: ఇండియన్ డైరీ ప్రొడక్ట్స్​లో పనీర్ చాలా పాపులర్. దీనిని పాల నుంచి తయారు చేస్తారు. ఎగ్స్ లాగానే పనీర్​లో కూడా హెల్దీ న్యూట్రియెంట్స్ ఎన్నో ఉంటాయి. ఆ న్యూట్రియెంట్స్​లో ప్రొటీన్ కూడా ఒకటి. ఇంకా పనీర్​లో విటమిన్ డి, సెలీనియం, రైబో ఫ్లావిన్ కూడా ఉంటాయి. నలభై గ్రాముల పనీర్​లో.. ప్రొటీన్ - 7.54 గ్రాములు, ఫ్యాట్ - 5.88 గ్రాములు, కార్బ్స్ - 4.96 గ్రాములు, ఫోలేట్స్ - 37.32 మైక్రో గ్రాములు, కాల్షియం - 190.4 మిల్లీ గ్రాములు, ఫాస్ఫరస్ - 132 మిల్లీ గ్రాములు, పొటాషియం - 50 మిల్లీ గ్రాములు ఉన్నాయి.

అధిక కొలెస్ట్రాల్​ వెన్నలా కరగాలా? మార్నింగ్​ ఈ డ్రింక్స్​ ట్రై చేయండి!

ఈ రెండింటిలో ఏది మంచిది: గుడ్లు, పనీర్ దాదాపు రెండూ ఒకే రకమైన పోషకాలను కలిగి ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇక్కడ ప్రొటీన్​కు ఇదే మంచిది అని ఏది లేదు. ఇందులో ఏది తీసుకోవాలనేది.. వారి ఆహార ప్రాధాన్యత, వ్యక్తిగత రుచి, శరీరం తీరుపై ఆధారపడి ఉంటుంది. శాకాహారులు పనీర్​తో సరిపెట్టుకుంటే.. నాన్​వెజిటేరియన్స్​ రెండింటిని ఎంజాయ్​ చేయవచ్చు. కాబట్టి ఏది తినాలనేది మీ ఛాయిస్​ మాత్రమే అంటున్నారు నిపుణులు.

కడుపు నొప్పి ఉంటే గ్యాస్ట్రిక్​ క్యాన్సర్​ వచ్చినట్లేనా? నిపుణులు ఏమంటున్నారు..?

మొలకలు తింటున్నారా? - ఈ డేంజర్ తెలుసా?

మీరు తింటున్న బెల్లం మంచిదేనా? - కల్తీని ఇలా చెక్​ చేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.