Hair Fall Solution: చిన్నాపెద్దా అనే తేడాలేకుండా ఈ రోజుల్లో చాలా మందిని వేధించే సమస్య జుట్టు రాలిపోవడం. ఒత్తిడి, గాఢత ఉన్న షాంపూలు, ఇతర హెయిర్ క్రీంల వాడకం, జీన్స్ వంటి కారణాలేమైనా ఉండొచ్చు. అయితే కొన్ని చిట్కాలతో ఆ సమస్యను తగ్గించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
ఆముదం నూనె మిశ్రమంతో..
కొబ్బరి పాలతో సిల్కీగా!
ఇవి గుర్తుపెట్టుకోండి!
- కొబ్బరి నూనెను కాస్త వేడి చేసి.. పడుకునే ముందు కుదుళ్లు, జుట్టుకు పట్టించాలి. కాసేపు కుదుళ్లను మర్దన చేసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. మరుసటి రోజు ఉదయం గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది.
- జుట్టు వదిలేసుకొని నిద్ర పోతుంటారు కొంతమంది. తద్వారా కేశాలు గడ్డిలా, పిచ్చుక గూడులా మారతాయి. అందుకే జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే జడ వేసుకోవడం, పైకి ముడేసుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. ఫలితంగా జుట్టు రాలే సమస్య కూడా అదుపులోకొస్తుంది.
- వీటితో పాటు తీసుకునే ఆహారంలో 'ఎ', 'బి', 'సి', 'డి', 'ఇ'.. వంటి విటమిన్లు ఉండేలా చూసుకోవడమూ ముఖ్యమే!
గమనిక
ఇక్కడ పేర్కొన్నవన్నీ సహజమైన పదార్ధాలే అయినా కొన్ని పదార్ధాలు కొందరికి పడకపోవచ్చు. అందువల్ల వీటిని వాడే విషయంలో ఏవైనా సందేహాలున్నట్లయితే మీరు వ్యక్తిగతంగా సంప్రదించే సంబంధిత నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు.
ఇవీ చూడండి: జుట్టు కుదుళ్లు బలంగా మారాలా?.. ఇవి తినేయండి!