ETV Bharat / sukhibhava

షుగర్ ఉన్నవారు చికెన్, మటన్ తినకూడదా? ఏం తింటే బెటర్​? - డయాబెటిస్​ లక్షణాలు

Diabetes Food Chart in Telugu : ఈ కాలంలో చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డుతున్నారు. ఇది వ‌స్తే ఎప్పుడూ అప్ర‌మత్తంగా ఉంటూ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంది. మ‌ధుమేహులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, వైద్యులు ఇచ్చే సూచ‌న‌లు ఏంటి త‌దిత‌ర విష‌యాలు ఈ ఆర్టిక‌ల్​లో తెలుసుకుందాం.

Diabetes Food Chart in Telugu
Diabetes Food Chart in Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 25, 2023, 10:06 AM IST

Diabetes Food Chart in Telugu : షుగ‌ర్ వ‌చ్చిందంటే చాలు.. ఒక భ‌యం మొద‌ల‌వుతుంది. ఏది తినాలన్నా, ఒక‌టికి రెండుసార్లు ఆలోచిస్తాం. డ‌యాబెటిస్ బాధితులు స‌రైన ఆహారం తీసుకోక‌పోతే మ‌రిన్ని స‌మస్య‌లు రావ‌డ‌మే ఇందుకు కార‌ణం. ఆహార నియంత్ర‌ణే ఆ వ్యాధి త‌గ్గుద‌ల‌కు చ‌క్క‌టి మార్గ‌మ‌ని వైద్యుల అభిప్రాయం. మ‌రి డ‌యాబెటిస్ ఉన్న‌వాళ్లు ఎలాంటి డైట్ పాటించాలి, జాగ్ర‌త్త‌లు తీసుకోవాలో తెలుసుకుందాం.

డ‌యాబెటిస్ ల‌క్ష‌ణాలివే..
Diabetes Symptoms in Telugu : చాలా మందికి గుండె సంబంధిత‌, డ‌యాబెటిస్ వ్యాధులు చిన్న‌త‌నంలో వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం ఆహారపు అల‌వాట్లు, ఒత్తిడి అని వైద్యులు చెబుతారు. ముఖ్యంగా షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డే వారి సంఖ్య ఈ కాలంలో ఎక్కువైపోయింది. దీని లక్ష‌ణాలు ఏంటంటే.. త‌ర‌చూ మూత్రం రావ‌డం, దాహం వేయ‌డం, ఆక‌లి ఎక్కువ కావ‌డం, కాళ్లు వాపు రావ‌డం లాంటివి ఉంటాయి. ఈ వ్యాధిగ్ర‌స్థులు హెచ్‌పీఏ1సి ప‌రీక్ష ద్వారా 3 నెల‌ల‌కోసారి చెక్ చేసుకోవాలి. అది 3-5.4 ఉంటే డ‌యాబెటిస్ లేన‌ట్లే. అదే 5.6 కంటే ఎక్కువుంటే ప్రీడ‌యాబెటిక్ అని, 7 కంటే ఎక్కువ ఉంటే షుగ‌ర్ వ్యాధి ఉన్న‌ట్లు నిర్ధ‌రిస్తారు.

కొంద‌రిలో ఉప‌వాసం ఉన్నా కూడా 200 దాకా ఉంటుంది. ఇది 70-100 మ‌ధ్య ఉంటే నియంత్ర‌ణంలో ఉంద‌ని అర్థం. అంత కంటే ఎక్కువుంటే అదుపులో లేద‌ని అర్థం. కొంత‌మందికి లంచ్ చేసిన త‌ర్వాత 300 నుంచి 400 దాకా వ‌స్తుంది. ఇలాంటివి రాకుండా డైట్ ద్వారా కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. డయాబెటిస్ బాధితులు చెక్క‌ర స్థాయుల్ని అదుపులో పెట్టుకోవాలి. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా డైట్ విష‌యంలో అనేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఆహారంలో ప్ర‌ధాన పోష‌కాలైన కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్, ఫ్యాట్, ఫైబ‌ర్​లు రక్తంలో చెక్క‌ర స్థాయిల్లో ప్ర‌భావం చూపిస్తాయి. వీటిలో మాంస‌కృత్తులు, కొవ్వుల క‌న్నా పిండి ప‌దార్థాలు.. ర‌క్తంలో షుగ‌ర్ లెవెల్స్ త్వ‌ర‌గా పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతాయి. ర‌క్తంలో చెక్క‌ర స్థాయుల‌పై ఆహారం ఎలాంటి ప్ర‌భావం చూపిస్తుందో.. దాన్ని తిన్న త‌ర్వాత తీసే షుగ‌ర్ రీడింగ్​లో తెలుస్తుంది.

అధిక ప్రోటీన్ క‌లిగిన జంతు మాంసం, వెన్న వంటి అధిక కొవ్వు క‌లిగిన పాల ఉత్ప‌త్తులు, ఐస్ క్రీమ్‌, కొబ్బ‌రి నూనె, చికెన్ మాంసంలో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి ఘ‌న కొవ్వుగా మారే ద్ర‌వ నూనెలు. ఇవి ఫాస్ట్ ఫుడ్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ప్రాసెస్ చేసిన ఆహారంలో ఉంటాయి. ఈ రెండు ర‌కాల కొవ్వుల వినియోగంలో జాగ్ర‌త్త వ‌హించాలి. మ‌రోవైపు ఉప్పును సైతం త‌క్కువ‌గా తీసుకోవాలి. ఇది అధిక ర‌క్త‌పోటును నివారించ‌డానికి ఉపయోగ‌ప‌డుతుంది.

ఏమేం తినాలంటే..!
Diabetes Food to Avoid : ఫైబ‌ర్ పుష్క‌లంగా పండ్లు, కూర‌గాయ‌లు, గింజ‌లు, బీన్స్ తృణ ధాన్యాల్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్​లో ఉప్మా, బోండా, వ‌డ, పూరి లాంటి వాటికి దూరంగా ఉండాలి. బదులుగా ఓట్స్, క్విన్ వా దలియా ఉప్మాల్లో ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తిన‌టం వ‌ల్ల బ్ల‌డ్ షుగ‌ర్ కంట్రోల్​లో ఉంటుంది. త‌ర్వాత 11 గంట‌ల స‌మ‌యంలో ఏదొక పండు తీసుకోవాలి. ముఖ్యంగా విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉన్న వాటిని తీసుకుంటే మంచి ఫ‌లితాలుంటాయి. ఇక లంచ్​లో రైస్ త‌క్కువ‌గా, క‌ర్రీ ఎక్కువ‌గా తినాలి. దుంప కూర‌లు అప్పుడ‌ప్పుడు తీసుకుంటూ, ఆకు కూర‌లు రెగ్యుల‌ర్​గా తినాలి. వారంలో 3 నుంచి 4 సార్లు ఉండేలా చూసుకోవాలి. ప‌ప్పు ఒక్కసారైనా తీసుకోవాలి.

ఇక సాయంత్రం విష‌యానికి వ‌స్తే.. టీ, కాఫీల‌తో పాటు బిస్కెట్లు తింటుంటారు. కానీ వీటిని తగ్గించడమే బెట‌ర్‌. టీ, కాఫీల్లో షుగ‌ర్ వేయ‌క‌పోవ‌డం, బిస్కెట్లు, బ్రెడ్డు తీసుకోవ‌డం మానేయాలి. రాత్రి భోజ‌నం అయితే.. చాలా మంది 10 త‌ర్వాత తింటారు. కానీ షుగ‌ర్ ఉన్న‌వాళ్లు 8-8.30 మ‌ధ్య‌లో తీసుకోవాలి. దీని వ‌ల్ల షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌కుండా ఉంటాయి. దీంతో పాటు మ‌రో ముఖ్య‌మైన అంశం ఏంటంటే.. మూడు పూట‌లా తిన్న త‌ర్వాత క‌నీసం 20 నిమిషాల పాటు వాకింగ్ చేయడం మర్చిపోకూడ‌దు. సింపుల్ షుగ‌ర్స్​ను తక్కువ తీసుకోవాలి. ఆరోగ్య‌క‌ర‌మైన జీవ‌న విధానాన్ని అల‌వాటు చేసుకోవ‌డం చాలా ముఖ్యం.

స‌మ‌య పాల‌న ముఖ్యం
మ‌ధుమేహం ఉన్న‌వాళ్లు అంద‌రిలా రోజుకి 3 పూట‌లు కాకుండా.. త‌క్కువ మోతాదులో 7, 8 సార్లు తినాలి. పైగా టిఫిన్ నుంచి డిన్న‌ర్ వ‌ర‌కు అన్నింటినీ ఒకే స‌మ‌యానికి తీసుకోవాలి. బ్రేక్ ఫాస్ట్ ఎట్టిప‌రిస్థితుల్లోనూ మాన‌కూడ‌దు. గుడ్లు, బీన్స్, బ్ర‌కోలి, పాల‌కూర‌లు రోజూ తీసుకోవాలి. భోజ‌నంతో పండ్ల‌ను తీసుకోవాలి. రాత్రి భోజ‌నం రాగులు, జొన్న‌లు, స‌జ్జ‌లు వంటి తృణ ధాన్యాలు తినాలి. డ‌యాబెటిస్ ఉన్న‌వాళ్లు ఆహార విష‌యంలో వైద్యుల స‌ల‌హా తీసుకోవ‌డం ఉత్త‌మం.

డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్థులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ?

డయాబెటిస్ వస్తే జీవితాంతం​ ఇన్సులిన్​ తీసుకోవాలా? పెళ్లి చేసుకుంటే ఇబ్బందా?

ఇలా చేస్తే షుగర్ వ్యాధి రాదు! ప్రీడయాబెటిస్​ నుంచి ఎలా తప్పించుకోవాలి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.