ETV Bharat / sukhibhava

Diabetes Control Tips In Telugu : మధుమేహంతో ఇబ్బందా?.. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఫుల్​ రిలీఫ్! - మధుమేహంతో బాధపడేవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి

Diabetes Control Tips In Telugu : నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. మరి ఈ వ్యాధికి కారణం ఏమిటి? దీనిని ఎలా నియంత్రించాలి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

how-to-reduce-diabetes-control-tips-and-diabetes-treatment-guidelines
మధుమేహాన్ని ఎలా తగ్గించాలి
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2023, 7:35 AM IST

Diabetes Control Tips In Telugu : చక్కెర వ్యాధి ఒకసారి వస్తే.. అది దీర్ఘకాలంలో రకరకాల సమస్యలకు దారితీస్తుంది. ఎంత ఎక్కువ కాలం నుంచి షుగర్ వ్యాధితో బాధపడుతుంటే అంత ఎక్కువగా సమస్యల ముప్పు పెరుగుతుంటుంది. అందుకే షుగర్ వ్యాధి నియంత్రణలో ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

How To Control Diabetes : మధుమేహం ఉన్నవారిలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. మధుమేహం రెండు రకాలు: టైప్-1, టైప్-2. ఎక్కువ మందికి టైప్-2 మధుమేహం వస్తుంది. టైప్-1 వంశపారంపర్యంగా వస్తుంది. టైప్-2 మధుమేహం అనేది అనారోగ్యకరమైన జీవనశైలి వల్ల, వ్యాయామం లేకపోవడం వల్ల, అధిక బరువు సమస్య వల్ల వస్తుంది. మధుమేహాన్ని నియంత్రించాలంటే.. కచ్చితంగా డాక్టర్ సలహాతో ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది.

Diabetes Effects : మధుమేహం అధికంగా ఉండేవారిలో.. తరచూ మూత్రానికి వెళ్లాల్సి రావడం, అధికంగా దాహం వేయడం, బాగా బరువు తగ్గిపోవడం, అరికాళ్లలో మంట ఉండటం, చూపు మందగించడం లాంటి సమస్యలు కనిపిస్తాయి. అందుకే డయాబెటిస్​తో బాధపడేవారు బరువు తగ్గడం అనేది చాలా ముఖ్యం. బరువు తగ్గడం వల్ల డయాబెటిస్​ను అదుపులోకి తీసుకురావచ్చు.

పరీక్షలు చేయించుకోవాలి!
Diabetes Test Name : "షుగర్ వ్యాధిని ముందుగానే గుర్తించడం మంచిది. ఇప్పటికే డయాబెటిస్​తో బాధపడుతున్నట్లయితే దాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఊబకాయం ఉందా? కుటుంబంలో తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల్లో ఎవరికైనా షుగర్ ఉందా? అలాగే రక్తపోటుతో బాధపడుతున్నారా? ధూమపానం లాంటి అలవాట్లు ఉన్నాయా అనేది ఎవరికి వారు చెక్ చేసుకోవాలి. ఒక వేళ ఏవైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఏడాదికి ఒకసారి కచ్చితంగా డయాబెటిస్ టెస్టులు చేయించుకోవాలి. రక్తంలో చక్కెర స్థాయిలు ఉండాల్సినంతగా ఉన్నాయా? లేదా? అనేది టెస్టుల్లో తేలుతుంది" అని ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్, డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి తెలిపారు.

Diabetes In Pregnant Women : "స్త్రీలలో ప్రెగ్నెన్సీ సమయంలో డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది. టెస్టుల్లో షుగర్ వ్యాధి గనుక లేదని తేలితే, మన సాధారణ జీవనశైలిని అవలంభించవచ్చు. ఒకవేళ చక్కెర వ్యాధి ఉన్నట్లయితే.. దానికి సంబంధించిన మందులు వాడుతూ.. జీవనశైలిలో సరైన మార్పులు చేసుకోవాలి. ప్రీ డయాబెటిస్ స్టేజ్​లో ఉంటే దాన్ని డయాబెటిస్ వ్యాధిగా మారకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇందుకోసం డాక్టర్స్ సలహాలతో సరైన మందులు వాడుతూ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి" అని డాక్టర్ రవిశంకర్ సూచించారు.

వ్యాయామం తప్పనిసరి!
Blood Sugar Control Exercise : షుగర్ వ్యాధి నియంత్రణలో వ్యాయామం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. కసరత్తులు చేయడం వల్ల కండరాలు పటిష్టంగా తయారై, కణాలకు ఇన్సులిన్​ను గ్రహించే శక్తి పెరుగుతుంది. ఎండార్ఫిన్​, సెరిటోనిన్ లాంటి రసాయనాల ఉత్పత్తి పెరిగి.. శరీరానికి కొత్త ఉత్తేజం వస్తుంది. ఫలితంగా మధుమేహం అదుపులో ఉంటుంది.

Blood Sugar Levels Workout: రన్నింగ్ చేయడం వల్ల వెంటనే రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి. ఊబకాయం రాకుండా చూసుకోవడం, ఒకవేళ బరువు ఎక్కువగా ఉంటే దాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి. పని ఒత్తిడిని కూడా తగ్గించుకుంటే టైప్-2 డయాబెటిస్ బారిన పడకుండా ఉండొచ్చు.

ఆహార మార్పులతోనే కట్టడి చేయలేం!
Diabetes Control Tips Diet : మధుమేహాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా, నిలువరించే అవకాశం కచ్చితంగా ఉంది. రక్తంలో చక్కెర, కొవ్వు పదార్థాల స్థాయిలను సమతుల్యం చేసుకుంటూ ఆహార నియమాలను సక్రమంగా పాటిస్తే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. అయితే కేవలం ఆహారపు అలవాట్లను మార్చుకోవడం లేదా ఆహారాన్ని కట్టడి చేయడం ద్వారా ఈ వ్యాధి నుంచి తప్పించుకోలేం. వైద్యుల సలహాపై ఔషధాలు వాడాల్సి ఉంటుంది.

Diabetes Prevention Tips : డయాబెటిస్ సాధారణ లక్షణాలు ఏవైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ల సలహాతో టెస్టులు చేయించుకోవాలి. వాళ్లు అసలు మధుమేహం ఉందా? లేదా? అనేది నిర్ధరిస్తారు. వ్యాధి తీవ్రతను అనుసరించి మందులు లేదా జీవనశైలి మార్పులను సూచిస్తారు. డయాబెటిస్ ఇతర తీవ్ర సమస్యలకు కారణం కాకముందే వీలైనంత త్వరగా టెస్టులు చేయించుకొని చికిత్స తీసుకోవడం ఉత్తమం.

మధుమేహంతో ఇబ్బందా?.. ఈ జాగ్రత్తలు పాటిస్తే ఫుల్​ రిలీఫ్!

Semolina Health Benefits : బొంబాయి రవ్వతో.. బీపీ, షుగర్​ సహా​.. గుండె సమస్యలకు చెక్​!

Vertigo Problem Reasons : నిద్ర లేచిన వెంట‌నే త‌ల తిరుగుతోందా?.. కారణాలివే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.