ETV Bharat / sukhibhava

గుండె, ఊపిరితిత్తులపై కరోనా దాడి.. రక్తనాళాలపై దుష్ప్రభావం - కరోనా వైరస్ లక్షణాలు

కరోనా పాజిటివ్‌ వచ్చిన అతికొద్ది మందిలో అకస్మాత్తుగా తీవ్రసమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. స్వల్ప లక్షణాలే ఉన్నాయి కదాని ఏమరుపాటుగా ఉంటుండటంతో.. విషమ పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. ఎక్కువగా వయసు పైబడిన వారిలో ఇటువంటివి కనిపిస్తున్నా.. కొన్నిసార్లు యుక్తవయస్కుల్లోనూ ఈ తరహాలో ఉపద్రవం ఎదురవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. భయపడాల్సిన పని లేదని.. అప్రమత్తతతో అపాయాన్ని అధిగమించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

coronavirus
coronavirus
author img

By

Published : Aug 2, 2020, 6:21 AM IST

  • కరీంనగర్‌కు చెందిన ఒక వ్యక్తి(52) దీర్ఘకాలంగా మధుమేహంతో బాధపడుతున్నారు. వారం రోజులుగా ఒళ్లునొప్పులు, నలతగా ఉండడంతో.. కొవిడ్‌ పరీక్ష చేయించగా, నెగెటివ్‌ వచ్చింది. దీంతో ఇంట్లోనే ఉంటూ పారాసిటమాల్‌ మాత్రలు వేసుకున్నారు. ఉన్నట్టుండి ఛాతీలో నొప్పిగా అనిపించడంతో.. స్థానిక ఆసుపత్రిలో సంప్రదించగా..పరీక్షల్లో గుండెపోటుగా గుర్తించి, హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రికి తరలించారు. యాంజియోగ్రామ్‌ చేసే ముందు.. ఇతర ముందస్తు పరీక్షల్లో భాగంగా ఛాతీ సీటీ స్కాన్‌ చేయించారు. ఇందులో కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఇతర పరీక్షల్లోనూ రక్తం గడ్డకట్టే ప్రక్రియ దెబ్బతిందని గుర్తించారు. ఆ తర్వాత ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలోనూ కరోనాగా నిర్ధారణ అయింది. ఆయన 10 రోజుల చికిత్స అనంతరం కోలుకున్నారు.
  • హైదరాబాద్‌కు చెందిన ఒక యువకుడు(30) వారం రోజులు గొంతునొప్పి, జ్వరంతో బాధపడ్డారు. కొవిడ్‌ పరీక్ష చేయిస్తే పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మందులు వాడితే లక్షణాలు తగ్గిపోయాయి.వారం తర్వాత తీవ్ర ఆయాసంగా అనిపించడంతో.. ఒక ఆసుపత్రిలోని అత్యవసర చికిత్స విభాగంలో చేరారు. ‘2 డి ఎకో’ పరీక్ష చేయించగా.. గుండె కండరంలో వాపు(మయోకార్డైటిస్‌) ఉన్నట్లుగా నిర్ధారించారు. ఇతర పరీక్షల్లోనూ రక్తనాళాల్లో వాపు(ఇన్‌ఫ్లమేషన్‌) ఉన్నట్లు కనుగొన్నారు. చికిత్స పొందుతూ రెండు రోజుల్లోనే కన్నుమూశారు.

ప్రపంచ దేశాలతో పోల్చితే మన దేశంలో అందులోనూ తెలంగాణలో కొవిడ్‌ బారినపడి కోలుకునే వారి శాతం చాలా మెరుగ్గా ఉంది. మృతుల శాతమూ తక్కువగానే ఉంది. అయినా కొంతమందిలో అవగాహన లేకపోవడం వల్ల.. సరైన సమయంలో ముప్పు లక్షణాలను గుర్తించలేకపోతున్నారు. దురదృష్టవశాత్తు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో చేరుతున్నారు.. కొందరు ప్రాణాలూ కోల్పోతున్నారు. అయితే ఇలాంటి కేసులు చాలా స్వల్పసంఖ్యలో ఎదురవుతున్నాయి. వీటిని కూడా తగ్గించాలంటే.. మరింత అవగాహన పెంచుకోవాల్సిన అవసరముంది. కొందరు తమలో ‘స్వల్ప లక్షణాలే ఉన్నాయి కదా’ని ఏమరుపాటుగా ఉంటుండటంతో.. విషమ పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. ఎక్కువగా వయసు పైబడిన వారిలో ఇటువంటివి కనిపిస్తున్నా.. కొన్నిసార్లు యుక్తవయస్కుల్లోనూ ఈ తరహాలో ఉపద్రవం ఎదురవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకిలా జరుగుతోంది? ఎప్పుడు ప్రమాదాన్ని గుర్తించాలి? ముందస్తు జాగ్రత్తలు ఏమిటి?

కరోనా పాజిటివ్‌ వచ్చిన అతికొద్ది మందిలో అకస్మాత్తుగా తీవ్రసమస్యలు ఉత్పన్నమవడం... ఒక్కోసారి మరణానికి దారితీయడం ఆందోళన కలిగిస్తోంది. సరైన అవగాహన, తగు జాగ్రత్తలతో ప్రాణాపాయాన్ని నివారించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కరోనా వైరస్‌ ప్రాథమికంగా శ్వాసవ్యవస్థ ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. గతంలో వచ్చిన సార్స్‌, మెర్స్‌ వైరస్‌ల మాదిరిగానే కరోనా కూడా కేవలం శ్వాసవ్యవస్థనే ఎక్కువగా దెబ్బతీస్తోందని నిపుణులు తొలుత భావించారు. సాధారణంగా వైరస్‌లు మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత అనేక మార్పులకు లోనవుతుంటాయి. అయితే కొవిడ్‌లో ఆ మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కరోనా వచ్చినవారిలో 85 శాతం మందిలో ఎటువంటి ప్రమాదం ఉండదు. వైరస్‌ సోకినా వారిలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. ఆ వ్యక్తికి తెలియకుండానే వైరస్‌ సోకి తగ్గిపోవచ్చు కూడా. కొంత కాలం తర్వాత శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. కేవలం 15 శాతం మందిలోనే వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరిలో కూడా కొద్దిమంది మాత్రమే ఆసుపత్రిలో చికిత్స పొందాల్సివస్తుంది. ఇందులోనూ కేవలం 5 శాతం మందికి మాత్రమే ఐసీయూలో చికిత్స అందించాల్సి వస్తోంది. అత్యంత తక్కువమందిలో ముందు నుంచి ఎటువంటి లక్షణాలు లేకపోయినా వైరస్‌ తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

ఏ పరీక్షలు చేయించుకోవాలి?

  • జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ముందుగా కొవిడ్‌ నిర్ధారణ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి.
  • కొద్దిమందిలో జ్వరం 99 డిగ్రీల వద్దనే ఉన్నా.. వాసన, రుచి కోల్పోవడం, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలతోనూ కరోనా నిర్ధారణ అవుతుంది.
  • ప్రమాద తీవ్రతను పసిగట్టడానికి ప్రాథమికంగా కొన్ని పరీక్షలున్నాయి. వైద్యుల సూచనల మేరకు ముఖ్యంగా.. రక్తం గడ్డకట్టే ప్రక్రియను గురించి తెలుసుకోవడానికి ‘డి డైమర్‌’.. రక్తనాళాల్లో వాపును గుర్తించడానికి ‘ఇంటర్‌ ల్యూకిన్‌ 6’.. ‘సీ రియాక్టివ్‌ ప్రొటీన్‌’.. మొదలైనవి చేయించుకోవాలి.

ఎప్పుడు తీవ్రత?

సాధారణంగా కరోనా వైరస్‌ బారినపడిన తొలివారంలో వైరీమియా ఉన్నప్పుడు జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలుంటాయి. రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు తక్కువ. మొదటి వారం ముగిశాక.. రెండోవారంలో అధికంగా, మూడోవారంలోనూ కొంత మేరకు ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలు ఎక్కువ.

ఎందుకింత ముప్పు?

కొవిడ్‌ వైరస్‌ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత.. లక్షణాలు తగ్గుముఖం పట్టాయి అని భావిస్తున్న క్రమంలో.. శరీరంలో వాపు (ఇన్‌ఫ్లమేషన్‌) మొదలవుతుంది. వైరస్‌ తీవ్రతను గట్టిగా ఎదుర్కొనేందుకు శరీరంలో పెద్దఎత్తున సైటోకైన్స్‌ ఉప్పెనలా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల కావచ్చు.. ఇతర కారణాల వల్ల కావచ్చు.. రక్తనాళాల్లో ఉండే అతి సున్నితమైన, మృదువైన ‘ఎండోథీలియం’ పొరపై దుష్ప్రభావం చూపుతుంది. ఈ ‘ఎండోథీలియం’ పొర రక్తనాళాల్లో రక్త ప్రవాహం సులువుగా జరిగేందుకు దోహదపడుతుంది. రక్తం గడ్డకట్టకుండా పలు రసాయనాలు ఈ ఎండోథీలియం కణాల్లో ఉంటాయి. వైరస్‌ కారణంగా ఎండోథీలియం కణాలు దెబ్బతింటాయి. దీన్ని వైద్య పరిభాషలో ‘వాస్క్యులోపతి’ అంటారు. ఫలితంగా అతి సూక్ష్మ రక్తనాళాల్లో రక్తం గడ్డకడుతుంది. దీన్ని ‘కోయాగులోపతి’ అంటారు. దీంతో శరీరంలోని అవయవాలకు రక్తం ద్వారా అందాల్సిన ఆక్సిజన్‌, రసాయనాలు, పోషకాలు అందకుండా ఆటంకం ఏర్పడుతుంది. శరీరంలోని కణజాలానికి ఆక్సిజన్‌ సరఫరా తగ్గిపోతుంది. ఇతర అవయవాలపైనా దుష్ప్రభావం పడుతుంది. సూక్ష్మ రక్తనాళాల్లోనే కాకుండా.. కొంతమందికి సిరల్లోనూ, ధమనుల్లోనూ రక్తం గడ్డకడుతోంది. ఈ సమస్యను సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే.. రోగులు ప్రాణాపాయ స్థితిలోకి చేరుతున్నారు.

ఉపద్రవానికి కారణాలేమిటి?

  • గుండెకు సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు రావడం
  • ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం.. ఫలితంగా పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం(పీటీఈ) బారినపడడం
  • గుండె కండరం వాపునకు గురికావడం(ఇన్‌ఫ్లమేషన్‌).. దీంతో హఠాత్తుగా గుండె లయ తప్పడం
  • కాళ్ల సిరల్లోనూ రక్తం గడ్డకట్టడం

ఎవరిలో ముప్పు ఎక్కువ?

  • సాధారణంగా 55 ఏళ్లు పైబడిన వారు
  • అధిక రక్తపోటు, మధుమేహం, గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, తదితర దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నవారు
  • స్థూలకాయులు
  • ఎక్కువ కాలం కదలకుండా పడుకునేవారు
  • కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ బారినపడడం వల్ల వీరిలో రక్తం సులువుగా గడ్డకట్టే అవకాశాలుంటాయి.

ఆక్సిజన్‌ తగ్గితే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి

ఎవరికైనా అతి ముఖ్యమైనది పల్స్‌ ఆక్సిమీటర్‌ ద్వారా రక్తంలో ఆక్సిజన్‌ శాతం ఎంత ఉందో చూసుకోవడం.. నాడీ వేగం ఎంతుందనేది పరిశీలించడం చాలా ముఖ్యం. రక్తంలో ఆక్సిజన్‌ శాతం సాధారణంగా 95-100 వరకూ ఉంటుంది. 94శాతం కంటే తగ్గితే ప్రాణవాయువు తగ్గుతోందని అర్థం. వెంటనే ఆస్పత్రికి వెళ్లాలి. నాడీ వేగం 120 కంటే పెరిగినా అనుమానించాలి.

అకస్మాత్తుగా ఛాతీ పట్టేసినట్లుగా అనిపించడం.. ఆయాసం ఎక్కువ కావడం.. దగ్గు ఆగకుండా రావడం, రానురాను పెరగడం.. కాళ్ల వాపు, పిక్కల నొప్పి.. గుండె దడగా అనిపించినా ఆలస్యం చేయవద్దు.

ముప్పు పొంచి ఉందనే సందేహాలున్నప్పుడు.. ముందస్తుగా అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రమాద తీవ్రతను గుర్తించడానికి అవకాశాలుంటాయి. రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు అవసరమైన మందులు, స్టెరాయిడ్స్‌ తదితర ఔషధాలను రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుల పర్యవేక్షణలో 2-6 వారాల పాటు వాడాల్సి ఉంటుంది.

- డాక్టర్‌ ఎంవీ రావు, ప్రముఖ జనరల్‌ ఫిజీషియన్‌, యశోద ఆసుపత్రి

ఇదీ చదవండి: బుధవారం రాష్ట్ర కేబినెట్ భేటీ.. చర్చించే అంశాలివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.