ETV Bharat / sukhibhava

పిల్లలు రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి?

author img

By

Published : Apr 1, 2023, 3:44 PM IST

పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల మీద ప్రభావం చూపించే చాలా అంశాల్లో కీలకమైనవి.. వారు తీసుకునే ఆహారం, తగిన నిద్ర. అయితే.. సరిగా నిద్రలేకపోవడం వల్ల చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. మరి పిల్లలు ఎన్ని గంటలు నిద్రపోతే మంచిది.. నిద్రకు ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలో తెలుసుకుందామా మరి.

How Much Sleep Should Kids Get
How Much Sleep Should Kids Get

పిల్లలను మంచి లక్షణాలతో, మానసికంగా, శారీరకంగా.. పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా పెంచడం అనేది నేటి తల్లిదండ్రులకు ఎంతో సవాలుగా మారింది. అయితే, ఎన్నో జాగ్రత్తలు పాటిస్తే తప్ప ఇది సాధ్యం కావడం లేదు. పిల్లల ఎదుగుదలను ప్రభావితం చేసే అంశాల్లో ఆహారం, నిద్ర ఎంతో కీలకం. శిశువు దశ నుంచి టీనేజర్ల వరకు వారు మానసికంగా, శారీరకంగా ఎదుగుతుంటారు. ఇలా శారీరక, మానసిక ఎదుగుదలను ప్రభావితం చేసే అంశాల్లో ఒకటైన నిద్ర గురించి.. ఎంతో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది.

"పిల్లల మానసిక, శారీరక వికాసానికి నిద్ర ఎంతో అవసరం. నిద్ర విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేసినా.. అది వారి మానసిక, శారీరక ఎదుగుదల మీద ప్రభావం చూపుతుంది. నిద్ర తగినంత లేకపోతే తరచుగా ఏడవడం, మొండిగా ప్రవర్తించడం లాంటివి పిల్లలు చేస్తుంటారు. తగినంత నిద్ర లేకపోతే.. పిల్లలు అనేక దుష్ప్రభావాలకు గురవుతుంటారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి మూడు నెలల చిన్నారుల వరకు.. రోజుకు 14 గంటల నుంచి 17 గంటల నిద్ర అవసరం. ఆరు నెలల నుంచి రెండేళ్ల పిల్లలకు.. 12 గంటల నిద్ర, రెండు నుంచి నాలుగు సంవత్సరాల పిల్లల వరకు 11 గంటల నిద్ర, నాలుగు నుంచి ఏడేళ్ల వరకు 10 గంటల నిద్ర, 7 సంవత్సరాలు పైబడిన వారికి 8 నుంచి 10 గంటల నిద్ర అవసరం"

- డా.శ్రీకాంత్, పిడియాట్రిషియన్

పిల్లలకు.. నిద్ర సరిపోనప్పుడు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. చాలా మంది పిల్లలు ఒత్తిడి, ఆందోళనకు గురవుతుంటారు. నిద్ర సరిపోని పిల్లల్లో ఇతరులతో పోలిస్తే చురుకుగా లేకపోవడం, వారి వయసు వారితో కలిసి ఆడుకోకపోవడం, చదువులో వెనకబడటం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు. 'తక్కువ నిద్రపోయే పిల్లల్లో ఆకలి ఎక్కువగా ఉంటుంది. దీని ఫలితంగా ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. పరోక్షంగా డయాబెటిస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే మెదడుకు గ్లూకోస్ తగిన స్థాయిలో అందదు. దీని వల్ల మెదడు చురుకుగా పని చేయదు. చాలామంది పిల్లలకు నిద్ర తక్కువైతే పని మీద ధ్యాస పెట్టలేరు. వారిలో శక్తి, ఉత్తేజం చాలా తక్కువగా ఉంటాయి. వీటితో పాటు జ్ఞాపకశక్తి తగ్గడం, నిర్ణయాత్మక శక్తి లోపించడం లాంటివి జరుగుతాయి. టీవీ, సెల్ ఫోన్లు కూడా.. పిల్లల నిద్ర తగ్గిపోవడానికి కారణం కావచ్చు.' అని నిపుణులు చెబుతున్నారు.

"పిల్లలు తక్కువ సమయం నిద్రపోవడానికి కారణాలు ఏంటని గుర్తించాలి. కొన్ని సార్లు పిల్లలు తీసుకునే ఆహారం వల్ల కూడా ఇలాంటి సమస్య తలెత్తుతుంది. శిశువుల్లో డబ్బా పాలు తాగే అలవాటు ఉంటే, వారికి గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా వారు తగినంత నిద్రపోలేరు. కాబట్టి గ్యాస్ నుంచి ఉపశమనం కలిగించే చర్యలు చేపట్టాలి. దాంతో పాటు పిల్లలు నిద్రపోయేలా జోల పాడటం, మ్యూజిక్ ప్లే చేయడం లాంటివి చేయాలి. అలాగే రాత్రి భోజనానికి, నిద్రకు కనీసం ఒకటి లేదా రెండు గంటల వ్యవధి ఉండేలా చూసుకోవాలి. పిల్లలు నిద్రించే గదిలో మంచి వెంటిలేషన్ ఉండేలా, సౌకర్యవంతమైన బెడ్ ఉండేలా చూసుకోవాలి. పిల్లలు పడుకునే ముందు పాల లాంటి వెచ్చటి ద్రవ పదార్థాలను ఇవ్వడం ఉత్తమం"
- డా.శ్రీకాంత్, పిడియాట్రిషియన్

ఆ బాధ్యత తల్లిదండ్రులదే..
పిల్లలను తగినంత నిద్రపోయేలా చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేనని నిపుణులు అంటున్నారు. అలాగని వారాంతాల్లో, సెలవు రోజుల్లో ఎక్కువ సమయం నిద్రపోయేలా చేయడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. నిద్ర వేళల్లో మార్పులు మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. 'పిల్లల గదుల్లో టీవీలు, కంప్యూటర్లు, వీడియో గేమ్​లు ఉంచకూడదు. నిద్రకు అరగంట ముందు వాటిని చూడనివ్వకూడదు. పడుకునే ముందు రోజులో చేసిన పనులు అన్నింటిని గుర్తు చేసుకోమని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి' అని నిపుణులు చెబుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.