Tooth Discoloration: చాలా మందిలో అనే కారణాల వల్ల దంతాల రంగు మారుతాయి. ఇలా జరగడం వల్ల వారి ఆత్మ విశ్వాసం దెబ్బతింటుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలని చాలా మంది అనుకుంటారు. అయితే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవటం మంచిదేనా? దంతాలు తెల్లగా మారేందుకు ఏం చేయాలి? అనే విషయాలపై నిపుణులు కొన్ని సలహాలను ఇచ్చారు. అవేంటంటే?..
- పళ్లు బ్రౌన్‌గా ఎందుకయ్యాయో ఒక సారి చెక్ చేసుకోవాలి. ఫ్లోరోసిస్ వల్ల బ్రౌన్‌గా మారాయా లేకపోతే ఇంట్రన్సిక్స్ స్టెయిన్స్ ఉన్నాయా అనేది చూసుకోవాలి. తర్వాత వైద్యుల సలహా మేరకు చికిత్సను తీసుకోవాలి.
- పళ్లు 30 నిమిషాలలో త్వరగా తెల్లగా అయిపోవాలి అనేటప్పుడు లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అయితే లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకునేటప్పుడు దంత వైద్యుల సలహాను తీసుకోవాలి.
- ఒక వారంలో నిదానంగా పళ్లు తెల్లగా అయినా పర్లేదు అనుకుంటే వాటికి మనమే బ్లీచింగ్ చేసుకుని తెల్లగా మార్చుకోవచ్చు. అందుకు కావలసిన పేస్టులు, జెల్స్ విషయంలో వైద్యుల సలహాలు తీసుకోవాలి.
- వేగంగా దంతాలు తెల్లగా మారాలని ట్రీట్మెంట్ చేయించుకోవటం కంటే నిదానంగా పళ్లు బ్రౌన్ కలర్ నుంచి మార్పు చెందేందుకు బ్లీచింగ్ చేయించుకోవటమే మంచిది.
- దంతాలు తెల్లగా మార్చేందుకు లేజర్, ఇతర లైట్ ట్రీట్మెంట్ ఇలా చాలా రకాల బ్లీచెస్ ఉంటాయి. అయితే కొంతమందికి ఫక్షన్స్లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు అప్పటికప్పుడు వాటిలో ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే విషయంపై డాక్టర్‌ను సంప్రదించటం ఉత్తమం.
- లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నాక పళ్లుకు కొన్ని నెలలు, సంవత్సరాల వరకే బ్లీచ్ ఉంటుంది. అది పోయిన తర్వాత మళ్లీ పళ్లు బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి.
- లేజర్ ట్రీట్మెంట్ ఎప్పటికప్పుడు చేయించుకోవాలి. లేకుంటే పళ్లు మళ్లీ మునుపటిలా మారిపోతాయి.
- లేజర్ ట్రీట్మెంట్ తరచూ చేయించుకోవటం వల్ల చిగుళ్లు, నాలుక గానీ లేజర్‌కు ఎఫెక్టయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పుల్లు, మంట వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
- ఏదైనా మైల్డ్ ట్రీట్మెంట్ తీసుకోవటం మంచిది. లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తే ఒక్కసారి గానీ రెండుసార్లు కానీ చేయించుకోవాలి.
- ఈ సమస్య మరీ ఇబ్బందిగా అనిపిస్తే వెనీర్స్ అనేవి ఉంటాయి వాటిని పళ్లు మీద పెట్టుకోవాలి. అది పర్మినెంట్‌గా ఉంటుంది.
- ఇలా కాకుండా కెమికల్ బ్లీచెస్, లేజర్ ట్రీట్మెంట్స్ అస్తమానం తీసుకోవటం వలన కళ్లు, చర్మ సంబంధిత సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
అయితే ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటిస్తే దంతాలను తెల్లగా మార్చుకోవచ్చని నిపుణులు అంటున్నారు. అవేంటంటే?..
మొదటి చిట్కాకు కావలసిన పదార్థాలు:
- డ్రై ఆరెంజ్ పీల్ పౌడర్ (బత్తాయి తొక్కలను ఎండలో బాగా ఎండబెట్టి.. పౌడర్ చేసుకోవాలి. కావాలంటే ఇది మార్కెట్లో కూడా లభిస్తుంది)
- తులసి ఆకుల పేస్ట్
తులసి ఆకులను చేతితో బాగా నలిపి.. అందులో ఆరెంజ్ పీల్ పౌడర్ వేసుకుని.. రెండింటిని కలిపేయాలి. దీనిని చేతితో చేసుకోవచ్చు. కావలంటే మిక్సీలో కూడా వేసి పేస్టు చేసుకోవచ్చు. ఈ పేస్ట్‌ను పళ్లకు పెట్టుకుని 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత కడుక్కోవాలి. ఇలా వారానికి మూడు నుంచి నాలుగు సార్లు ఉదయం, రాత్రి పూటలో చేస్తే పళ్లు తెల్లగా మెరుస్తాయి.
రెండో చిట్కాకు కావలసిన పదార్థాలు:
- నీరు
- బేకింగ్ సోడా
బేకింగ్ సోడాకు నలుపు రంగును పోగొట్టి దంతాలను తెల్లగా చేసే గుణం ఉంది. బేకింగ్ సోడాను ఒక బౌల్లో తీసుకుని సరిపడా నీళ్లు పోసి బాగా కలపాలి. ఈ పేస్టును పళ్లకు అప్లై చేసి ఐదు నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. అయితే బ్రష్ చేసినట్లుగా ఈ పేస్టుతో తోమకూడదు. ఇలా క్రమం తప్పకుండా ఉదయం లేవగానే, రాత్రి పడుకునే ముందు పదిరోజుల పాటు చేస్తే దంతాలు తెల్లగా మారుతాయి.
మూడో చిట్కాకు కావలసిన పదార్థాలు:
- కాఫీ పౌడర్
- నిమ్మకాయ
- ఉప్పు
కాఫీ పౌడర్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు పళ్లు, చిగుళ్లకు బలాన్నిస్తాయి. అందులో కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి. తర్వాత అందులో కాస్త నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పళ్ల లోపలి వరకు చిగుళ్లను తాకేలా బ్రష్ చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే పళ్లు తెల్లగా మారుతాయి.
బ్రష్ చేసేటప్పుడు కొంతమంది కొన్ని తప్పులు చేస్తుంటారు. బ్రష్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలను నిపుణులు తెలిపారు. అవేంటంటే?..
పళ్లు తోముకునే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- కనీసం రెండు నిమిషాలైనా బ్రష్ చేయాలి
- ఎక్కువ మోతాదులో పేస్టు వాడకూడదు
- తిన్న అరగంట తర్వాత పళ్లు తోముకోకూడదు
- బ్రష్‌ను శుభ్రంగా కడుక్కోవాలి
- నాలుక మీద ఉన్న పాచిని సరిగ్గా క్లీన్ చేసుకోవాలి
- ఎక్కువ కాలం ఒకే బ్రష్‌ను వాడకూడదు
- బ్రష్ చేసేటప్పుడు దంతాల వెనుక భాగాలను బాగా శుభ్రం చేసుకోవాలి