రోజూ తీసుకునే ఆహారంలో పిండిపదార్థాల శాతమే ఎక్కువ. కాబట్టి వాటి నుంచే శరీరానికి అవసరమయ్యే క్యాలరీలు లభిస్తాయి. ఇందుకు భిన్నంగా కాలిఫోర్నియా యూనివర్సిటీ నిపుణులు... కొందరు మధుమేహ రోగుల్ని ఎంపికచేసి వాళ్లకు ఏడాదిపాటు తక్కువ పిండిపదార్థాలు- అంటే, క్యాలరీలు తక్కువ ఉండే పండ్లూ కూరగాయల్ని... మరో వర్గానికి మామూలు ఆహారాన్నే ఇచ్చారట.
ఏడాది తిరిగేసరికల్లా తక్కువ పిండిపదార్థాలున్న ఆహారం తీసుకున్నవాళ్లకి డయాబెటిస్ 32 శాతం తగ్గిందట. సాధారణ ఆహారం తీసుకున్నవాళ్లలో వ్యాధి అలాగే ఉంది. దీన్నిబట్టి ఇదిలానే కొన్నేళ్లపాటు కొనసాగిస్తే డయాబెటిస్ పూర్తిగా తగ్గొచ్చు అంటున్నారు నిపుణులు. పైగా ఈ రకమైన ఆహారం తీసుకున్నవాళ్లకి కొలెస్ట్రాల్ కూడా తగ్గింది.
ఇదీ చూడండి: ఈ 'నల్ల బియ్యం'తో మధుమేహం, ఊబకాయం మాయం!