ఇవాళ ఒత్తిడి మనల్ని చిత్తు చేస్తోంది. పొద్దున నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా మన జీవితంలో ఒత్తిడి అనేది అంతర్లీనంగా ఏదో రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. స్త్రీలకైతే పొద్దున్నే లేచి ఇంటిని చక్కదిద్దుకుని, వంటలు, లంచ్ బాక్సులతో పాటు అందరినీ రెడీ చేయడం, ఆఫీసుకెళ్లడం ఇలా ఎన్నో పనులు. పురుషులకైతే ఆఫీసులు, వ్యాపారాలు ఇలా ప్రతీచోటా పరుగులు. ఇక పిల్లలకైతే స్కూలు, కాలేజీలు, పరీక్షలు ఇలా ఎన్నో. మొత్తం అన్ని వయసుల వారికీ ఏదో రూపేణా ఒత్తిడి అనేది సర్వసాధారణమైపోయింది.
శ్రుతిమించితే.. అంతే!
ఆందోళనలనేవి నెత్తి మీద కత్తిలా ఎప్పుడూ వేలాడుతూనే ఉంటాయి. అయితే నిజానికి ఒత్తిడి లేకుండా జీవితం అనేది ఉండదు. ఒత్తిడి ఆరోగ్యకరంగా ఉంటేనే జీవితం సాఫీగానే ముందుకెళుతుంది. అయితే ఆ మోతాదు శ్రుతిమించితే మాత్రం అది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు చాలామందిలో చూస్తున్న జీవనశైలి జబ్బులకు ఓ ఫ్రధాన కారణం ఒత్తిడి కూడా. ఒత్తిడిని నియంత్రించుకోవడానికి మా సుఖీభవ వెల్ నెస్ సెంటర్లో చాలా పద్ధతులున్నాయి అంటున్నారు సుఖీభవ వెల్నెస్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ అర్చన.
" యోగిక్ వ్యాయామాలు, యోగ నిద్ర, ప్రాణాయామ ఇవన్నీ ఒత్తిడిని తగ్గించేవే. కొన్ని థెరపీలు కూడా మా సుఖీభవ వెల్ నెస్ సెంటర్లో ఉన్నాయి. అందులో ఒకటి హైడ్రో థెరపీ. ఇదొక నీటి ప్రక్రియ. ఇది చాలా సాయం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో ఆహారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒత్తిడిని తగ్గించే ఆహారాన్ని మేం డిజైన్ చేస్తాం. ఈ రకంగా హోడ్రో థెరపీ, యోగిక్ వ్యాయామాలు, కొన్ని సంప్రదాయ వ్యాయామాలు కూడా ఉంటాయి, వీటిలో థాయ్ వ్యాయామాలు, టిబెటన్ వ్యాయామాలు, వీటితో పాటు ఆయుర్వేదిక్ మర్దన.. ఇవన్నీ వాడతాం. ఇలా ప్రకృతి సిద్ధంగా లభించే నీటితో హైడ్రో థెరపీ చేస్తాం. ఆహారాన్ని పక్కాగా ప్లాన్ చేస్తాం. ఇంకా శరీరంలో రక్త ప్రసారం పెరగడానికి గాను కొన్ని రకాల వ్యాయామాలు చేయిస్తాం. ఈ రకంగా ఒత్తిడిని తగ్గిస్తాం."
--- డాక్టర్ అర్చన, సుఖీభవ వెల్నెస్ సెంటర్ డైరెక్టర్.
యుక్తవయసులోనే..
జీవనశైలి సమస్యల్లో కనిపించే ప్రధాన కారణం ఒత్తిడి. ఒత్తిడిలో శరీరంలో నెగెటివ్ హార్మోన్లు విడుదలవుతాయి. ఒత్తిడిలో మనిషి ఎక్కువగా తింటాడు. టీ, కాఫీలు, సిగరెట్లు, ఆల్కహాల్ లాంటి వాటిని ఎక్కువగా ఆశ్రయిస్తాడు. ఫలితంగా చాలామందిలో బరువు పెరగడం, మధుమేహం రావడం, రక్తపోటు పెరగడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, థైరాయిడ్ పని తీరు మారడం, గుండెపోటు, పక్షవాతం లాంటివి రావడం చూస్తున్నాం. యుక్తవయసులోనే ఇలాంటి సమస్యలు రావడం కూడా ఈ మధ్య పెరిగింది. అందుకే ఒత్తిడిని జయించడానికి మనం ప్రకృతి వైద్యం, ఆయుర్వేదం, యోగా లాంటి వాటిని ఆశ్రయించవచ్చు.
ప్రణాళికబద్ధమైన జీవనశైలితో..
ప్రకృతికి దగ్గరగా ఉండడం, మంచి ఆహారం తీసుకోవడం, యోగా చేయడం, పనుల్ని క్రమబద్ధంగా చేసుకోవడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. యోగ, ధ్యానం, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్ సైజులను నిత్యం సాధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ప్రణాళికబద్ధమైన జీవనశైలిని అలవర్చుకుంటే అసలు ఒత్తిడి అనేదే దరి చేరకుండా చూసుకోవచ్చు.
ఇదీ చూడండి:సంప్రదాయ చికిత్సతో మధుమేహానికి కళ్లెం