ETV Bharat / sukhibhava

అందం శాశ్వతంగా మీ వశమవ్వాలంటే ఇలా చేయండి! - coonut oil at home

అందరికంటే తానే అందంగా కనిపించాలని తాపత్రయపడని వారు ఎవరు చెప్పండి? అందుకేగా బ్యూటీపార్లర్లకు పరుగులు పెట్టేది. మార్కెట్లో లభించే ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్ని వాడేది. అయితే వాటివల్ల తాత్కాలిక అందమే తప్ప శాశ్వతమైన సౌందర్యం మన సొంతం కాదన్నది కాదనలేని వాస్తవం. మరి శాశ్వత అందం సొంతం చేసుకోవాలంటే ఏం చేయాలో చూసేయండి..

best-natural-remedies-for-permanent-beauty
అందం శాశ్వతంగా మీ వశమవ్వాలంటే ఇలా చేయండి!
author img

By

Published : Aug 1, 2020, 10:35 AM IST

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మన దేశానికి చెందిన మూలికలు, మసాలాల గురించే చర్చించుకుంటున్నారు. అలాంటి అద్భుతమైన పదార్థాలతో అందం సొంతం చేసుకోవచ్చు. కొన్ని సార్లు బయటదొరికే ఉత్పత్తులు, మందులు మనకు ఆరోగ్యపరంగా, సౌందర్య పరంగా ఏర్పడిన సమస్యల్ని తగ్గించలేవు. అలాంటప్పుడు ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలే చక్కటి పరిష్కారం చూపిస్తాయి. ఇందుకు కారణం.. అవన్నీ సహజమైనవి కావడమే. వాటివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తకపోవడమే. అలాంటిదే పసుపు కూడా!

రోగనిరోధక శక్తిని పెంచుతుంది!

యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్‌, యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉన్న పసుపు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొద్దిగా పసుపును వేడి పాలల్లో వేసుకొని తాగడం వల్ల ఆర్థ్రరైటిస్‌ సమస్యను తగ్గించుకోవచ్చు. అలాగే పిల్లల ఆరోగ్యానికీ ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది.

ఇక రోజూ ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో అరచెంచా పసుపు, చెంచా తేనె వేసుకొని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. అలాగే బరువూ తగ్గచ్చు. అయితే మధుమేహం ఉన్న వాళ్లు ఈ పానీయంలో తేనె వేసుకోకపోవడం మంచిది.

best-natural-remedies-for-permanent-beauty
అందం శాశ్వతంగా మీ వశమవ్వాలంటే ఇలా చేయండి!

ముఖానికి పసుపు పాలు!

ఇక ఈ పసుపు అందాన్నీ ఇనుమడింపజేస్తుంది. ముఖంపై మచ్చల్ని తొలగించడంలో చక్కగా పనిచేస్తుంది. చల్లటి పాలలో అరచెంచా పసుపు వేసి బాగా కలుపుకొని.. అందులో కాటన్‌ బాల్‌ని ముంచి ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. కాసేపటి తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. 'ఈ చిట్కాను కొన్ని రోజుల పాటు పాటించడం వల్ల ముఖం ప్రకాశవంతంగా మారుతుంది' అంటూ పసుపులో దాగున్న సుగుణాల గురించి చెబుతున్నారు.

ఈ నూనె వాడితే జుట్టు రాలదు!

జుట్టు రాలడం చాలామంది అమ్మాయిలు ఎదుర్కొనే సమస్య. ఇక ఈ వర్షాకాలంలో ఇది మరింత ఎక్కువవుతుంది. మరి, దీన్నుంచి విముక్తి పొంది ఒత్తైన కురులను సొంతం చేసుకోవాలంటే ఓ సహజసిద్ధమైన హెయిర్‌ ఆయిల్‌ చిట్కాను మన కోసం తీసుకొచ్చింది జుహీ. జుట్టు రాలడాన్ని అరికట్టే ఈ చిట్కాను ఓ యూట్యూబ్‌ వీడియో ద్వారా పంచుకుందీ ముద్దుగుమ్మ.

‘జుట్టు రాలుతోందని చాలామంది పార్లర్స్‌కి, స్పా సెంటర్లకు వెళ్తుంటారు. అక్కడికి వెళ్లి డబ్బు వృథా చేసుకోవడం కంటే ఇంట్లోనే ఈ సింపుల్‌ చిట్కాను పాటించి జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. అలాంటి ఓ హెయిర్‌ ఆయిల్‌ రెసిపీని మీ అందరి కోసం తీసుకొచ్చేశా. దాన్నెలా తయారుచేయాలో ఇప్పుడు చూద్దాం..!

కావాల్సినవి

కొబ్బరి నూనె - కప్పు

మెంతులు - 3 టేబుల్‌స్పూన్లు

ఉల్లి విత్తనాలు - 3 టేబుల్‌స్పూన్లు

తయారీ

ముందుగా ఉల్లి విత్తనాలు, మెంతుల్ని విడివిడిగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద ప్యాన్ పెట్టి అందులో కొన్ని నీళ్లు పోయాలి. ఆ నీళ్ల మధ్యలో ఒక గిన్నె పెట్టి అందులో కొబ్బరి నూనె పోయాలి. ఈ నూనెలో ఇందాక మిక్సీ పట్టుకున్న రెండు పొడులను వేసి బాగా కలుపుకోవాలి. తక్కువ మంటపై ఈ మిశ్రమాన్ని ఉంచి.. మధ్యమధ్యలో కలుపుతూ గంట పాటు మరిగించుకోవాలి. తద్వారా మెంతులు, ఉల్లి విత్తనాల్లోని సుగుణాలు నూనెలోకి బాగా ఇంకుతాయి. ఇలా డబుల్‌ బాయిలర్‌ పద్ధతిలో ఈ నూనెను మరిగించుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారేదాకా పక్కన పెట్టి.. ఆపై వడకట్టుకోవాలి. మూడునాలుగు సార్లు ఇలా వడకట్టడం వల్ల స్వచ్ఛమైన నూనె వేరవుతుంది. ఇలా తయారైన నూనెను గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఇక వడకట్టగా మిగిలిన పిప్పిని బాడీ స్క్రబ్‌గా ఉపయోగించుకోవచ్చు. దాన్ని కూడా గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు.

ఉపయోగం?

ఉల్లి విత్తనాలు జుట్టును ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మార్చుతాయి. ఇందులో ఉండే యాంటీ ఫంగల్‌ గుణాలు కుదుళ్లలో ఏర్పడే ఫంగల్‌ ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. అలాగే ఉల్లి విత్తనాల్లో ఉండే ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ జుట్టుకు పోషణనందించి.. కేశాలు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదం చేస్తాయి.

మెంతుల్లో అధికంగా ఉంటే ప్రొటీన్‌, నికోటినిక్‌ ఆమ్లం చుండ్రును నివారిస్తాయి. అలాగే జుట్టు రాలడాన్ని అరికడతాయి. కుదుళ్లు పొడిబారడాన్నీ ఇవి తగ్గిస్తాయి.

కొబ్బరినూనె జుట్టును దృఢంగా మార్చడంతో పాటు ఒత్తుగా, పొడవుగా పెరిగేలా చేస్తుంది. ఇక ఈ నూనెలో ఉండే ఎసెన్షియల్‌ ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు కేశాల ఆరోగ్యానికి చాలా అవసరం.

వారానికి రెండుసార్లు ఈ నూనెను తలకు రాసుకోవడం వల్ల మూడు నాలుగు వారాల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది.

గమనిక: వీటిలో మనం ఉపయోగించినవన్నీ మన ఇంట్లో దొరికే పదార్థాలే.. పైగా అన్నీ సహజసిద్ధమైనవే.. కాబట్టి దుష్ప్రభావాలు కూడా తక్కువే. అయినప్పటికీ ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది.. కనుక వీటిని వాడే ముందు మీ శరీరతత్వానికి ఏది నప్పుతుంది? ఏది నప్పట్లేదు? అన్న విషయం మీకు మీరే ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకొని నిర్ధారించుకోండి.. తద్వారా లేనిపోని సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడచ్చు..

ఇదీ చదవండి: మసాజ్​ మంత్రంతో నొప్పులన్నీ మాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.