ETV Bharat / sukhibhava

స్నాక్స్​లో ఆయిల్ ఫుడ్ వద్దు - ఇవి తింటే అదుర్స్ - రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం!

Best Healthy Indian Snacks : స్నాక్స్​లో.. అయిల్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివే ఎక్కువగా తీసుకుంటారు జనం. కానీ.. ఇవి ఆరోగ్యానికి అంతగా మంచివి కావని చెబుతుంటారు నిపుణులు. అందుకే.. మీకోసం హెల్దీ స్నాక్స్ తీసుకొచ్చాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఓ పట్టు పట్టండి!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 8, 2023, 2:02 PM IST

Best Indian Snacks
Best Indian Snacks

Best Indian Snacks for Good Health : భోజనానికీ.. భోజనానికీ మధ్య ఎక్కువ గ్యాప్ వస్తే.. కడుపులో అల్సర్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే.. స్నాక్స్ తినాలని చెబుతారు వైద్యులు. ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిది. కానీ.. స్నాక్స్​లో ఏం తింటున్నామన్నది అంతకన్నా ముఖ్యం. అనారోగ్యకరమైన ఫుడ్ తినడం ద్వారా.. హెల్త్ మరింతగా పాడవుతుంది. అందుకే.. హెల్దీ స్నాక్స్ మీకోసం తీసుకొచ్చాం. మరి, అవేంటో చూడండి.

చనా చాట్(Chana Chaat) : కొద్ది మొత్తంలో శనగలను తీసుకుని వాటిని ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్​లోకి తీసుకొని స్పైసీ కోసం కొన్ని మసాలా దినుసులను యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికోసం ఉల్లిపాయ, టమాట ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. ఇది క్రంచీ, ప్రోటీన్-ప్యాక్డ్ అల్పాహారందా ఉంటుంది. ఈ హెల్తీ స్నాక్ కొలెస్ట్రాల్‌ను పెంచదు. దీనిని రోజులో ఏ సమయంలోనైనా ప్రిపేర్ చేసుకుని ఆస్వాదించవచ్చు.

మూంగ్ దాల్ చీలా(Moong Dal Cheela) : ఇది కూడా ఒక రుచికరమైన హెల్తీ స్నాక్. దీనిని ఎలా తయారుచేసుకోవాలంటే.. మొదట పెసరపప్పును నానబెట్టాలి. ఆ తర్వాత దానిని మెత్తటి పేస్ట్​లా చేసుకోవాలి. ఆపై దీనికి కొద్ది మొత్తంలో మసాలాలతో పాటు కొత్తమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అంతే అధిక ప్రోటీన్​ గల మూంగ్ దాలా చీలా రెడీ.

స్ప్రౌట్స్ చాట్(Sprouts Chaat) : ఈ చాట్ కోసం ముందురోజే కొన్ని పెసర్లు, శనగలు నానబెట్టి ఆ రోజు రాత్రి ఒక క్లాత్​లో కట్టిపెట్టుకోవాలి. నెక్ట్ డే మొలకెత్తిన వాటిని తీసుకొని వాటికి కొన్ని హెల్తీ కూరగాయలు యాడ్ చేసుకోవాలి. అవసరమైతే వీటికి తాళింపు వేసుకోవచ్చు. ఇక చివరగా నిమ్మకాయ పిండుకొని తింటే టేస్ట్ సూపర్​గా ఉంటది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

భేల్ పూరి(Bhel Puri) : దీని కోసం ముందుగా కొన్ని మరమరాలు/పేలాలు తీసుకోవాలి. ఆ తర్వాత కొన్ని ఉల్లిపాయ, టమాట, పచ్చిమిర్చి తరిగిన ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఆపై తగినంత కారం, సాల్ట్ వేసుకోవాలి. అవసరమైతే రుచికోసం చాట్ మసాలా, జీలకర్ర పొడి కలుపుకోవాలి. ఇంకా పల్లీలు యాడ్ చేసుకోవచ్చు. చివరగా అన్నింటినీ బాగా కలిపి కొద్దిగా కొత్తిమీర వేసి, నిమ్మకాయ పిండుకోవాలి. అంతే రుచికరమైన భేల్ పూరి రెడీ.

నోరూరించే చికెెన్​ చిరుతిళ్లు.. ఆలస్యమెందుకు ఈ సండే ట్రై చేయండిలా..

పోహా కట్లెట్స్(Poha Cutlets) : ఇందుకోసం ముందుగా అటుకులు తీసుకొవాలి. ఆ తర్వాత ఉడికించిన ఆలుగడ్డలను అటుకులలో వేసి ముద్దగా చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే మసాలా దినుసులు వేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని బాగా కలిపి చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని నూనెలో వేయించుకోవాలి. అంతే టేస్టీ పోహా కట్లెట్స్ రెడీ.

రాగి చిప్స్(Ragi Chips) : మరో హెల్తీ స్నాక్ రాగిచిప్స్. బంగాళాదుంప చిప్స్ మాదిరిగా.. ఈ చిప్స్​ను తయారుచేసుకోవచ్చు. ఇవి తినండం ద్వారా మంచి పోషకాలు లభిస్తాయి. గుండె ఆరోగ్యానికి తోడ్పడే మంచి స్నాక్ ఇది.

పెసర పప్పుతో అధిక బరువుకు చెక్.. ఈ డిఫరెంట్ వంటకాలు ట్రై చేస్తారా?

కారం కారంగా.. 'కార్న్‌ రిబ్స్‌'- తయారు చేసుకోండిలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.