సుగంధద్రవ్యాల్లో ఒకటైన లవంగాన్ని ‘దేవకుసుమ’ అనికూడా పిలుస్తారు. దీన్ని ఆయుర్వేద ఔషధాల్లో విరివిగా ఉపయోగిస్తారు. దీంట్లోని సుగంధ తైలాలు ఔషధంగా పనిచేస్తాయి. లవంగం నుంచి విటమిన్-సి లభిస్తుంది.
కఫం తగ్గాలంటే:
మిరియాలు, లవంగాల పొడిలో కాస్త తేనె కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది.
దప్పిక తీరాలంటే:
దాహం ఎక్కువగా ఉన్నప్పుడు.. నీళ్లు మరిగించి అందులో నాలుగైదు లవంగాలు వేసి ఆ రసాన్ని తాగితే దప్పిక తగ్గుతుంది.
పొడి దగ్గుకు:
వేయించిన లవంగాలను నోట్లో పెట్టుకుని చప్పరిస్తే పొడి దగ్గు తగ్గుతుంది.
ఆయాసం తగ్గడానికి:
దగ్గు, జలుబు, ఆయాసంతో బాధపడేవాళ్లకు లవంగ తైలం చాలా మంచిది.
దుర్వాసన రాకుండా:
వేడినీళ్లలో లవంగాలను వేసుకుని తాగితే కడుపులో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. గ్రీన్‌టీలో లవంగాలను వేసుకుంటే మరీ మంచిది.
అజీర్తి లేకుండా:
అజీర్తితో బాధపడేవాళ్లు భోజనానికి ముందు లవంగాన్ని నోట్లో పెట్టుకుంటే సరి.
వికారానికి:
లవంగాల పొడిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే కడుపులో తిప్పడం తగ్గుతుంది.
తలనొప్పి వేధిస్తుంటే:
తలనొప్పి, వాంతులతో బాధపడుతున్నప్పుడు.. చిటికెడు లవంగాల పొడిలో అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
పంటినొప్పికి:
పన్నునొప్పి ఉన్నచోట లవంగ తైలంలో ముంచిన దూదిని ఉంచితే ఉపశమనం లభిస్తుంది.
జాగ్రత్తలు:
ప్రయోజనాలు ఎన్ని ఉన్నా లవంగాలను ఎప్పుడూ మితంగా తీసుకోవాలి. ఎక్కువ వాడితే కడుపులో మంట పుడుతుంది.
నెలల నిండాక:
గర్భిణులకు నెలలు నిండాక ఒక్కోసారి పొట్ట బిగించినట్టుగా, ఉంటుంది. అలాంటప్పుడు లవంగాన్ని బుగ్గన పెట్టుకుంటే ఉపశమనంగా ఉంటుంది.
ఇదీ చూడండి: కేరళ విమాన ప్రమాద దృశ్యాలు