Banana Health Benefits In Telugu : అరటిపండు.. పెద్దగా పరిచయం అవసరం లేని ఫలం. తక్కువ ధరలో అన్ని చోట్లా, అన్ని కాలాల్లోనూ దొరుకుతుంది. చిన్న పిల్లలు మొదలు పండు ముసలి వాళ్లు తినేందుకు అనువుగా ఉంటుంది. ఇది మనకు ఆరోగ్య పరంగా చాలా మేలు చేస్తుంది. అయితే అరటిపళ్లు ఎవరు తీసుకోవచ్చు? రోజుకు ఎన్ని తినొచ్చు? వాటి ఆరోగ్య ప్రయోజనాలేంటి?
గుండెకు మేలు
అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఆరోగ్యకరమైన చక్కెరలతో పాటు సహజసిద్ధమైన పోషకాలు ఉంటాయంటున్నారు. ఆహార అరుగుదలలో సమస్యలు లేకుండా చూస్తాయని చెబుతున్నారు. కొన్నిరకాల అనారోగ్యాల సమస్యలకు మందుల కంటే అరటిపళ్లు తీసుకోవటమే మంచిదని అభిప్రాయపడుతున్నారు. రక్తపోటు, గుండె సంబంధ సమస్యలను దూరం చేసే శక్తి అరటిపండ్లకు ఉంటుందని చెబుతున్నారు.
"అరటిపళ్లలో చాలా పోషక విలువలు ఉన్నాయి. సమాజంలో కొంతమందికి వీటిపై అపోహాలు ఉన్నాయి. ఈ పళ్లు తింటే జలుబు చేస్తుందని కొద్దిమంది చెబుతుంటారు. ఇది అవాస్తవం. అరటిపళ్లులో పొటాషియం ఉంటుంది. అధిక రక్తపోటుకు కారణమయ్యేటువంటి సోడియం స్థాయిలను తగ్గించడానికి అరటిపళ్లలో ఉండే పోటాషియం చాలా ఉపయోగపడుతుంది. వీటిలో పీచు పదార్థాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే మధమేహం పేషెంట్లు మాత్రం అరటిపళ్ల విషయంలో జాగ్రత్త వహించాలి."
- డాక్టర్. గౌరీ ప్రియ , డైటీషియన్
అరటిపళ్లతో ఆరోగ్య ప్రయోజనాలివే!
- సమయాభావం వల్ల చాలా మంది బ్రేక్ఫాస్ట్ చేయరు. అలాంటి వారు అరటిపళ్లు తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
- ఆమ్లతత్వం తక్కువగా ఉండే ఈ అరటిపండును ఉదయం ఆహారంగా చేసుకోవడం వల్ల ఎసీడీటీ, మైగ్రేన్, తిమ్మిర్లు వంటి సమస్యలు దూరమవుతాయని తెలిపారు.
- ఉదయాన్నే వర్కౌట్ చేసేముందు అరటిపండును తీసుకోవచ్చని చెప్పారు.
- ప్రతిరోజు రాత్రి ఒక అరటి పండు తింటే మలబద్ధక సమస్య తగ్గుతుందని వెల్లడించారు.
- మహిళల్లో ఎదురయ్యే ప్రీమెన్స్స్ట్రియల్ సిండ్రోమ్ సమస్య తగ్గేందుకు అరటిపండు సహాయకారిగా ఉందంటున్నారు నిపుణులు.
- అరటిపండులో ఉండే బి విటమిన్.. కడుపు నొప్పి, ఛాతి నొప్పి , మానసిక సమస్యలను నియంత్రించటంలో సహాయం చేస్తాయని చెప్పారు.
- అరటిపండ్లలో ఇమ్యూనిటీ పెంచే శక్తి ఉంటుంది. వీటిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నపుడు కూడా వీటిని తీసుకోవచ్చని తెలిపారు
- బాగా పండిన అరటి పండ్లను మధుమేహ రోగులు తినకపోవటమే మంచిదని చెప్పారు.
Ginger Side Effects In Telugu : అల్లాన్ని ఎక్కువగా వాడుతున్నారా?.. అయితే జాగ్రత్త సుమా!
Peanuts Health Benefits In Telugu : గుప్పెడు వేరుశెనగలు తినేయండి.. గుండె జబ్బులు, ఊబకాయం దూరం!