ETV Bharat / sukhibhava

ఆస్థమా ఉంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

వాతావరణం చల్లగా మారిందంటే చాలు.. ఆస్థమా రోగులకు ఇబ్బందులు వచ్చి పడినట్లే. ఈ కాలంలో వీచే గాలులతో ఆస్థమా ఉన్న వారి ఆరోగ్యం ఒకింత కలవరానికి గురవుతుంది. అందుకే మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.

Asthma
ఆస్థమా
author img

By

Published : Jun 27, 2021, 1:38 PM IST

చలి వాతావరణం ఆస్థమా బాధితులకు మరిన్ని కష్టాలను తెచ్చిపెడుతుంది. బయటకు వెళ్తే చల్లగాలిని పీల్చటం మూలంగా ఆస్థమా ఉద్ధృతం కావొచ్చు. ఇక ఎప్పుడూ ఇంట్లోనే ఉండిపోతే ఆస్థమాను ప్రేరేపించే పెంపుడు జంతువుల బొచ్చు, నూగు, మృత చర్మ కణాలు... తవిటి పురుగులు, వంటింటి పొగ వంటివి శ్వాస ద్వారా లోనికి వెళ్లొచ్చు. కాబట్టి చలికాలంలో కాస్త జగ్రత్తగా ఉండటం ఎంతో అవసరం.

ప్రేరకాలపై కన్నేయండి.

  • దుమ్ముధూళి, చల్లగాలి వంటి ఆస్థమా ప్రేరకాలు శ్వాస ద్వారా లోనికి వెళ్లినపుడు ఊపిరితిత్తుల్లోని శ్వాసమార్గాలు బిగుసుకుపోతాయి. జిగురుద్రవం బయటకు రాకుండా అక్కడే చిక్కుకుపోతుంది. దీంతో దగ్గు, పిల్లిమాతలు, ఆయాసం వంటి లక్షణాలు పొడసూపుతాయి. అందువల్ల ఆస్థమా ఉద్ధృతం కావటానికి దోహదం చేసే కారకాలను గుర్తించి, వాటికి దూరంగా ఉండటం మంచిది.
  • వీలైనంతవరకు కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు దూరంగా ఉండటం, వాటిని పడక గదిలోకి రానీయకుండా చూసుకోవటం మంచిది. అలాగే పడకగదిలో అలర్జీ కారకాలేవీ లేకుండానూ చూసుకోవాలి. తవిటి పురుగులతో ఆస్థమా ఉద్ధృతమవుతుందోని అనిపిస్తే దుప్పట్లు, దిండ్లు, పరుపులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
  • గోడలకు చెమ్మ, బూజు వంటివి లేకుండా చూసుకోవాలి. తేమగా ఉండే ప్రాంతాల్లో నాచు, తవిటి పురుగుల వంటివి త్వరగా వృద్ధి చెందుతాయి. ఇవి అలర్జీని ప్రేరేపిస్తాయి. కాబట్టి ఇంటిని పొడిగా ఉంచుకోవాలి. పైపులు లీకు కాకుండా, కిటికీ తలుపులకు రంధ్రాలు లేకుండా చూసుకోవాలి. వంటింట్లోంచి వెలువడే పొగ ఘాటైన వాసనలతోనూ ఆస్థమా ఉద్ధృతం కావొచ్చు. అందువల్ల వంటింల్లో ఎగ్జాస్ట్​ ఫ్యాన్లు అమర్చుకోవాలి.
  • జలుబు, ఫ్లూ సైతం మరింత ఎక్కువగా దాడి చేస్తుంటాయి. దీంతో ఆస్థమా కూడా ఉద్ధృతం కావొచ్చు కాబట్టి బలుబ్బు, ఫ్లూతో బాధపడేవారికి దూరంగా ఉండటం... తరచుగా చేతులు కడుక్కోవటం, ఫ్లూ టీకా తీసుకోవటం మంచిది.
  • బయటకు వెళ్లినప్పుడు తలకు మఫ్లర్‌ చుట్టుకోవాలి లేదా మంకీ క్యాప్​ పెట్టుకోవాలి. చలి ఎక్కువగా ఉండే సమయాల్లో ఆరుబయట కాకుండా ఇంట్లో లేదా జిమ్‌లో వ్యాయామం చేయాలి.
  • ఆస్థమా బాధితులు తక్షణం ఉపశమనం కలిగించే రిలీవర్‌ మందులతో పాటు ఆస్థమాను నియంత్రించే కంట్రోలర్లనూ వాడుకోవాల్సి ఉంటుంది. చాలామంది లక్షణాలేవీ కనబడటం లేదని కంట్రోలర్లను తీసుకోవటం మానేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. చాలాకాలంగా ఆస్థమా లక్షణాలు కనబడకపోయినా డాక్టర్‌ సూచించిన పద్ధతిలో విధిగా మందులు వాడుకోవాలి. చలికాలంలో ఇది మరింత అవసరం.

ఇదీ చూడండి: శ్వాసతో కరోనాను శాసించండి ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.