వ్యాధి నివారణకోసం యాంటీబయోటిక్స్‌ను వాడటం తెలిసిందే. అయితే వీటిని తట్టుకునే శక్తి రోగకారక బ్యాక్టీరియాకి పెరిగిపోవడంతో ఒక దశలో అవి కూడా పనిచేయడంలేదు. అందుకే యాంటీబయోటిక్స్‌కే విరుగుడుగా పనిచేసే సరికొత్త మందును రూపొందించారు పరిశోధకులు. అంటే- యాంటీబయోటిక్‌తోపాటే దీన్నీ తీసుకుంటే వ్యాధికారక బ్యాక్టీరియాలో యాంటీబయోటిక్‌ను ఎదుర్కొనే శక్తి పెరగదట. ఏళ్ల తరబడి యాంటీబయోటిక్స్‌ను వాడటం వల్ల రోగకారక సూక్ష్మజీవులకి వాటిని తట్టుకునే శక్తి పెరిగి సూపర్‌బగ్స్‌గా మారుతున్నాయి.
ఈ సమస్యను ఎదుర్కొనడానికి సాగిన పరిశోధనలో భాగంగా- రకరకాల ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే ఎంటెరొకాకస్ ఫీసియమ్ అనే బ్యాక్టీరియాని అడ్డుకునేందుకు యాంటీబయోటిక్‌తోపాటు దానికి విరుగుడును కూడా ఇచ్చి చూశారట. రోగకారక సూక్ష్మజీవుల సంఖ్య బాగా తగ్గినట్లు గుర్తించారు. ఈ రెండింటినీ కలిపి ఇవ్వడం వల్ల ఎక్కువ ఫలితం ఉంటుందంటున్నారు పరిశోధకులు.
ఇదీ చదవండి: సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీలో రేణు దేశాయ్,సుమ