ETV Bharat / sukhibhava

తల్లి పాల వారం సందర్భంగా.. చనుబాల ఉపయోగాలు

మన ఆరోగ్యానికి పునాది తల్లి పాలే! తొలి పోషణ, తొలి రక్షణ ఇచ్చేది ఇవే. పుట్టిన తర్వాత వేగంగా ఎదిగే శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సమకూర్చేవి, ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడేవి చనుబాలు మాత్రమే. ఇవి బిడ్డనే కాదు, తల్లినీ మున్ముందు జబ్బుల బారినకుండా కాపాడతాయి. తల్లి పాల వారం సందర్భంగా మరోసారి చనుబాల ప్రాముఖ్యతను తెలుసుకుందాం.

mother milk importance
తల్లి పాల వారం సందర్భంగా.. చనుబాల ఉపయోగాలు
author img

By

Published : Aug 4, 2020, 4:16 PM IST

చనుబాల బిడ్డతో పాటు తల్లికీ ఎంతో రక్షణనిస్తుంది. ఈ వారం తల్లి పాల వారం. తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతీ ఒక్కరూ తెలుసుకోండి.

బిడ్డకు అనుక్షణ రక్షణ

  • చనుబాలలో సహజ సిద్ధమైన యాంటీబాడీలుంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. వైరస్‌లు, బ్యాక్టీరియాతో పోరాడే శక్తినిస్తాయి. తొలి గంటలో చనుబాలు పట్టటం ద్వారానే ఏటా సుమారు 10 లక్షల మంది శిశువుల ప్రాణాలను కాపాడుకోవచ్చు. అయినా కూడా మనదేశంలో ప్రతి ముగ్గురు తల్లుల్లో ఇద్దరు తొలి గంటలో పాలివ్వటమే లేదు!
  • తల్లిపాలు తాగిన పిల్లల్లో ఆస్థమా, అలర్జీలు తక్కువ. ఆర్నెల్ల పాటు పూర్తిగా చనుబాలే తాగిన పిల్లలకు మొదటి ఏడాదిలో శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్ల ముప్పు 72% తగ్గుతుంది. చెవి ఇన్‌ఫెక్షన్లు, నీళ్ల విరేచనాలూ తక్కువే. చీటికీ మాటికీ ఆసుపత్రుల చుట్టూ తిరిగే బెడదా తగ్గుతుంది. చిన్నప్పుడు తలెత్తే మధుమేహం ముప్పూ 30% వరకు తగ్గుతుండటం గమనార్హం.
  • చనుబాలు తాగిన పిల్లలకు బడికి వెళ్లే వయసులో తెలివి తేటలు ఇంకాస్త ఎక్కువగా ఉంటున్నట్టు కొన్ని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
  • పాలు తాగేటప్పుడు పిల్లలు తల్లి కళ్లలోకి చూడటం, శరీర స్పర్శ మూలంగా ఇద్దరి మధ్య అనుబంధం ఇనుమడిస్తుంది. తల్లి రక్షణలో ఉన్నామన్న భావన శిశువుకు ఎంతో ధైర్యాన్ని కలిగిస్తుంది.
  • తల్లిపాలు తాగే పిల్లలు చక్కని బరువుతో పెరుగుతారు. ఊబకాయం వచ్చే అవకాశం తక్కువ. కొన్నిరకాల క్యాన్సర్ల ముప్పూ తక్కువే.

సంపూర్ణ పోషణ

తల్లిపాలలో శిశువు ఎదగటానికి అవసరమైన విటమిన్లు, ప్రొటీన్‌, కొవ్వుల వంటివన్నీ సమపాళ్లలో ఉంటాయి. దీంతో బిడ్డకు సంపూర్ణమైన పోషణ లభిస్తుంది. తల్లిపాలు తేలికగా జీర్ణమవుతాయి. ఎప్పుడంటే అప్పుడు ఇవ్వచ్చు. పోత పాల మాదిరిగా సీసాను శుభ్రం చేయటం, పాలపీక మార్చటం వంటి ఇబ్బందులేవీ ఉండవు. సమయం, డబ్బు వృథా కావు.

అపోహలొద్దు..

  • బిడ్డకు పాలు సరిపోవేమోననే అనుమానం వద్దు. ఆర్నెల్ల వరకూ బిడ్డ అవసరాలకు తగినన్ని పాలు తప్పకుండా వస్తాయి. నెల నెలా బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉండి, హాయిగా నిద్రపోతూ రోజుకు 6 సార్లు మూత్రం పోస్తుంటే పాలు సరిపోతున్నట్టే.
  • ముర్రుపాలు పిల్లలకు అరగవని, అజీర్ణం చేస్తుందని అనుకోవద్దు. బిడ్డ పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు తప్పకుండా పట్టాలి. ఇది బిడ్డకు తొలి టీకా లాంటిది! కాన్పు తర్వాత వీలైనంత త్వరగా.. తొలిగంటలోనే తల్లిపాలు పట్టటం మొదలెట్టాలి. సిజేరియన్‌ కాన్పు అయినా కూడా మొదటి గంటలోనే పాలివ్వటం ఆరంభించాలి.
  • తొలి ఆర్నెల్ల వరకు తల్లిపాలు తప్ప మరే పానీయం ఇవ్వద్దు. బయటి వాతావరణం ఎలా ఉన్నా కూడా బిడ్డ అవసరాలకు సరిపోయేంత నీరు చనుబాల నుంచే లభిస్తుంది. అందువల్ల బిడ్డకు దాహం వేస్తుందేమోనని ప్రత్యేకంగా నీళ్లు తాగించాలని ప్రయత్నించొద్దు.
  • బజారులో దొరికే పాల పొడులలో ఎక్కువ పోషకాలు ఉంటాయని భ్రమించొద్దు. తల్లిపాలకు సాటి మరోటి లేదు. పోత పాలలో యాంటీబాడీలు, జీవకణాలు, హార్మోన్లు, ఎంజైమ్‌లు వంటివేవీ ఉండవు. పోషకాల మోతాదులూ వేర్వేరుగా ఉంటాయి.
  • ఏడిస్తేనే పాలు పట్టాలని అనుకోవద్దు. అన్నిసార్లూ బిడ్డ పాల కోసం ఏడ్వాలనేమీ లేదు. చప్పరించినట్టు శబ్దాలు చేయటం, పెదాలు నాకటం, గుప్పిళ్లతో నోటిని రుద్దుకోవటం, ఉంగా ఉంగా అనే సున్నితమైన చప్పుళ్లు చేయటం, కళ్లు అటూఇటూ వేగంగా తిప్పటం, చిరాకు పడుతున్నట్టు కదలటం వంటివన్నీ పాలు తాగటానికి చేసే ప్రయత్నాలే. ఇలాంటివి గమనిస్తే ఏడ్వకపోయినా పాలు పట్టాలి. ఉద్యోగాలకు వెళ్లే తల్లులు చనుబాలను పిండి ఇంట్లో పెట్టొచ్చు. ఆఫీసులో ఉన్నప్పుడూ పాలు పిండి భద్రపరచుకోవచ్చు.
  • పాలు రావటం లేదని మధ్యలో ఆపెయ్యటం తగదు. పాలు పడితే వస్తాయి, పట్టకపోతే రావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పాలివ్వటం ఆపేసిన వాళ్లు కూడా తిరిగి మొదలెడితే మళ్లీ పాలు వస్తాయి.

తల్లికీ ఎంతో మేలు...

  • చనుబాలు పట్టే తల్లుల్లో కేలరీలు ఇంకాస్త ఎక్కువగా ఖర్చవుతాయి. దీంతో గర్భం ధరించినప్పుడు పెరిగిన బరువు త్వరగా తగ్గుతుంది. పాలిచ్చేటప్పుడు విడుదలయ్యే ఆక్సిటోసిన్‌ హార్మోన్‌ గర్భసంచి పూర్వస్థితికి రావటానికి, కాన్పు తర్వాత రక్తస్రావం తగ్గటానికి దోహదం చేస్తుంది.
  • పాలిచ్చే తల్లులకు రొమ్ము క్యాన్సర్‌ ముప్పు 28% తక్కువ. అండాశయ క్యాన్సర్‌, ఎముకలు క్షీణించే ప్రమాదమూ తక్కువే. పాలు పట్టే తల్లులకు కీళ్లవాతం ముప్పు 50% వరకు తగ్గుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వీరికి ఆందోళన సైతం తక్కువే.
  • 12-24 నెలల పాటు చనుబాలు ఇచ్చిన వారికి రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరిగే అవకాశం 19% వరకు తగ్గుతుంది.
  • వీరికి అధిక రక్తపోటు ముప్పు 11% వరకు తక్కువగా ఉంటుండగా.. గుండెజబ్బు ముప్పు 10% మేరకు తగ్గుతోంది. మధుమేహం తలెత్తే అవకాశమూ 26% తక్కువ.

కరోనా ఉన్నా...
mother milk importance
తల్లి పాల వారం సందర్భంగా.. చనుబాల ఉపయోగాలు

చనుబాల ద్వారా బిడ్డకు కరోనా వైరస్‌ సోకుతుందా? లేదా? అన్నది కచ్చితంగా తెలియదు. కొన్ని అధ్యయనాలు వైరస్‌ సోకదనే పేర్కొంటున్నాయి. తల్లికి లేదా శిశువుకు కరోనా జబ్బు అనుమానిత లక్షణాలున్నా, నిర్ధారణ అయినా బిడ్డకు పాలివ్వటం ఆపకూడదన్నది ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచన. వైరస్‌ సోకే ముప్పులతో పోలిస్తే పాలు పట్టటంతో ఒనగూరే ప్రయోజనాలే ఎక్కువ. కాకపోతే పాలిచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి.

  • బిడ్డను తాకటానికి ముందు సబ్బుతో చేతులను బాగా రుద్దుకొని శుభ్రంగా కడుక్కోవాలి. సబ్బు, నీరు అందుబాటులో లేకపోతే శానిటైజర్‌ రాసుకోవాలి.
  • పాలు పట్టేటప్పుడు విధిగా మాస్కు ధరించాలి.
  • చేత్తో గానీ పంప్‌తో గానీ పాలను పిండేట్టయితే- పంప్‌, సీసాను తాకటానికి ముందు చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. మాస్కు ధరించాలి.
  • కరోనా తీవ్రంగా ఉండి, బిడ్డకు పాలివ్వలేని స్థితిలో ఉంటే పాలు పిండి ఇతరులతో పట్టించొచ్చు. అదీ సాధ్యం కాకపోతే జబ్బు తగ్గిన తర్వాత పాలు పట్టటం ఆరంభించాలి. ఒకవేళ పాలు రావటం ఆగిపోతే బిడ్డ రొమ్ము పడుతుంటే క్రమంగా వస్తాయి.

ఇవీ చూడండి: గ్రేటర్‌లో కాస్త ఊరట... తాజాగా 273 మందికి వైరస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.