ETV Bharat / sukhibhava

ఎసిడిటీ సమస్యా? ఇంటి చిట్కాలతో తరిమికొట్టండిలా..

చదువులు, ఉద్యోగాలు పేరిట చాలా మంది కెరీర్ మీద దృష్టి సారిస్తున్నారు. ఈ క్రమంలో సరైన సమయానికి భోజనం చేయడం, నిద్రపోవడం కుదరట్లేదు. శారీరక శ్రమ కూడా చేయడం లేదు. దీంతో కొత్త కొత్త రోగాల బారిన పడుతున్నారు. అందులో ఎసిడిటీ ఒకటి. అజీర్తి, పుల్లటి తేన్పులు, ఛాతీలో మంట, గొంతులో ఏదో అడ్డు పడినట్లు అనిపించడం లాంటి లక్షణాలు ఎసిడిటీ బాధితులను బాగా ఇబ్బంది పెడతాయి.

acidity home remedies
acidity home remedies
author img

By

Published : Apr 21, 2023, 9:07 AM IST

మనుషులను ప్రశాంతంగా ఉండనివ్వదు ఎసిడిటీ. భోజనం చేయబుద్ధి కాదు, ఒకవేళ తిన్నా అది అరగదు. ఎసిడిటీ బాధితులు అనుభవించే నరకం అంతా ఇంతా కాదు. అలాంటి ఈ సమస్యను పూర్తిగా తొలగించలేం. కానీ కొన్ని ఆహార నియమాలు పాటిస్తూ, వ్యాయామం వంటివి చేస్తూ ఉండాలి. ఆరోగ్య నిపుణులు చెబుతున్న కొన్ని చిట్కాలు పాటిస్తే ఎసిడిటీ నుంచి మీకు తప్పకుండా ఉపశమనం లభిస్తుంది. అవేంటో తెలుసుకుందాం.

అల్లం
అల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎసిడిటీ వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించే శక్తి అల్లానికి ఉంది. రోజూ ఒక అల్లం ముక్కను నోట్లో వేసుకుని నమలాలి. లేదా దీన్ని టీలో కలుపుకుని అయినా తీసుకోవాలి.

acidity home remedies
అల్లం

కలబంద రసం
ఎసిడిటీ వల్ల కలిగే చికాకు తదితర సమస్యలను తగ్గించే సామర్థ్యం కలబందకు ఉంది. రోజూ భోజనానికి ముందు ఒక కప్పు కలబంద జ్యూస్ తీసుకుంటే ఎసిడిటీని తరిమికొట్టొచ్చు అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

acidity home remedies
కలబంద రసం

అరటి పండ్లు
అరటి పండ్లలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఆమ్లత్వాన్ని తగ్గించే సహజ గుణాలు అరటిలో ఉన్నాయి. కాబట్టి రోజూ ఒకట్రెండు అరటి పండ్లు తినాలి. నేరుగా తినకున్నా జ్యూస్​గా చేసుకుని తాగినా మంచిదే.

సోంపు గింజలు
ఎసిడిటీతో బాధపడేవారు సోంపును తరచూ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. భోజనం చేసిన తర్వాత చెంచాడు సోంపు గింజలను నోట్లో వేసుకుని నమలాలి. వీటితో టీ చేసుకుని తాగినా మంచి ఫలితాలు కనిపిస్తాయి.

కొబ్బరి నీళ్లు
ఎసిడిటీ నుంచి ఉపశమనానికి కొబ్బరి నీళ్లు తీసుకోవడం చాలా మంచిది. కొబ్బరి నీళ్లు సహజంగానే శరీరాన్ని తేలికపరుస్తాయి. మెరుగైన ఫలితాలు కావాలంటే రోజూ రెండు గ్లాసుల కొబ్బరి నీళ్లు తాగాలి.

acidity home remedies
కొబ్బరినీళ్లు

జీలకర్ర
పొట్టను తేలికపరిచి ఎసిడిటీ నుంచి ఉపశమనం కలిగించడంలో జీలకర్ర కూడా తోడ్పడుతుంది. చిటికెడు జీలకర్రను నీళ్లలో వేసుకుని తాగాలి. ఇంట్లో వండుకునే కూరల్లోనూ జీలకర్రను వేసి తయారు చేసుకోవచ్చు. జీలకర్రతో టీ కూడా చేసుకోవచ్చు.

యాపిల్ పండ్లు
సహజంగా ఆమ్లత్వ గుణాలను కలిగిన యాపిల్ పండ్లు పొట్టలో పీహెచ్ స్థాయులను సమతూకం చేయడంలో, ఎసిడిటీని తగ్గించడంలో సాయపడతాయి. గ్లాసు నీళ్లలో యాపిల్ సైడర్ వెనిగర్​ను కలిపి భోజనానికి ముందు తాగితే సత్ఫలితాలు ఉంటాయి.

బాదంపప్పు
బాదంపప్పులో కాల్షియం మెండుగా ఉంటుంది. ఇది పొట్టలోని ఎసిడిటీని తగ్గించడంలో దోహదపడుతుంది. బాదాంలను రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయం తింటే ఎసిడిటీ నుంచి ఉపశమనం లభిస్తుంది.

acidity home remedies
బాదం

పసుపు
రోగ నిరోధక గుణాలు ఎక్కువగా కలిగి ఉన్న పసుపు ఎసిడిటీని కూడా తగ్గిస్తుంది. తినే భోజనంలో చిటికెడు పసుపును కలిపి వండుకోవాలి. పసుపుతో టీ కూడా చేసుకుని తాగొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.