YS Sharmila Padayatra: వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 27వ రోజు.. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని నెమిలెకాల్వ , జాలుకాల్వ మీదుగా సాగింది. గోకారం గ్రామానికి చేరుకునే సరికి 300 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయ్యింది. ఈ సందర్భంగా గ్రామంలో వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించి కొద్దిసేపు స్థానికులతో మాట్లాడారు. అనంతరం సంగెం గ్రామస్థులతో మాట ముచ్చట కార్యక్రమంలో షర్మిల పాల్గొన్నారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైయస్సార్ తెలంగాణ పార్టీని మీరంతా మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని సంగెంలో నిర్వహించిన మాటాముచ్చట కార్యక్రమచంలో షర్మిల కోరారు. ఆఖరి నిమిషం వరకు ప్రజల సేవ కోసమే వైయస్ రాజశేఖర్ రెడ్డి.. తన జీవితాన్ని అంకితం చేశారని షర్మిల గుర్తు చేశారు.
"తెలంగాణ ప్రజల బాగు కోసమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భవించింది. రాష్ట్ర ప్రజలు బాగుపడాలంటే పాలకపక్షం బాగుండాలి. కేసీఆర్ నియంత పాలన పోవాలి. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమైంది..? వారందరూ కేసీఆర్కు అమ్ముడుపోయారు. ఇది రాజకీయ వ్యభిచారం కాదా.. ? మాటమీద నిలబడే వ్యక్తి రాజశేఖర్రెడ్డి బిడ్డను నేను. సంక్షేమ పాలన తిరిగి తీసుకురావడమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ లక్ష్యం. వ్యవసాయం పండుగ కావాలి. మహిళలు ఆర్థికంగా బలపడాలి. ముఖ్యంగా అందరికీ ఇల్లు ఉండాలి. అది కూడా మహిళల పేరు మీదనే ఉండేలా వైఎస్సార్ తెలంగాణ పార్టీ చేస్తుంది." - వైఎస్ షర్మిల, వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు
సాయంత్రానికి భూదాన్ పోచంపల్లి మండలంలో షర్మిల పాదయాత్ర ప్రవేశించింది. మండలంలోని సల్లోని గూడెం గ్రామానికి చేరుకుని.. రాత్రిపూట అక్కడే షర్మిల బస చేస్తారు.
ఇదీ చూడండి: