YS Sharmila Padayatra: పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి.. బీర్లు, బార్లు, ఆత్మహత్యల తెలంగాణ చేశారని సీఎం కేసీఆర్ను వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల దుయ్యబట్టారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర 28వ రోజు.. భూదాన్ పోచంపల్లి మండలంలోని పలు గ్రామాల మీదుగా సాగింది. మండల కేంద్రంలో నేత కార్మికులతో నిర్వహించిన చేనేత సదస్సులో పాల్గొన్న వైఎస్ షర్మిల.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఆయా గ్రామాల్లో నిర్వహించిన మాటా-ముచ్చట కార్యక్రమంలో స్థానికులతో షర్మిల మాట్లాడారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే అన్ని సమస్యలు పరిష్కరించి రాజన్న రాజ్యం తీసుకోస్తానని స్పష్టం చేశారు. యాత్ర పొడవునా ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. షర్మిలతో కరచాలనం చేయటానికి, సెల్ఫీలు తీసుకోవటానికి పిల్లలు, యువత పోటీపడ్డారు.
ఇదీ చూడండి: