యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం రాగి బావి గ్రామంలో యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికి మాస్కులు, డెటాల్ పంపిణీ చేశారు. వృద్ధులకు పండ్లు, బ్రెడ ప్యాకెట్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మోత్కూర్ ఎస్సై ఉదయ్ కిరణ్ హాజరయ్యారు.
ప్రజలు కరోనా పట్ల జాగ్రత్తలు పాటించాలని... భయపడాల్సిన అవసరం లేదన్నారు. భౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాంపాక నాగయ్య, ఉప సర్పంచ్ యెన్నం యాదిరెడ్డి పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Kaloji: సిద్ధమైన కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ భవనం