యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ప్రధానాలయం ఎదుట వెనుక భాగంలో రూ. కోట్లు ఖర్చు చేసి 3 నెలలపాటు కృష్ణ శిలలు, సిమెంట్ కాంక్రీట్ తో చేసిన ఫ్లోరింగ్ కుంగిన విషయం తెలిసిందే. నిపుణుల కమిటీ సూచనల మేరకు నెల రోజులుగా అక్కడి ఫ్లోరింగ్ ను తొలగించి సాయిల్ స్టెబిలైజేషన్ లో మరమ్మతులు చేస్తున్నారు.
రూపాయలు లక్షలు ఖర్చు చేసి భారీ యంత్రాలు తీసుకువచ్చి నెల రోజులు ఫ్లోరింగ్ స్లాబ్ ధ్వంసం చేస్తున్నారు. సిమెంట్ ఇతర వ్యర్థాలు గుట్టలుగుట్టలుగా పేరుకుపోయాయి. కృష్ణ శిలను మళ్ళీ ఉపయోగిస్తుండగా... సిమెంట్ కాంక్రీటు స్లాబ్ తీసివేయడం వైటీటీడీ అధికారులకు భారంగా మారింది.