తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనాలను నిలిపివేశారు. కొవిడ్ నియంత్రణలో భాగంగా ఈనెల 19 వరకు ఆలయంలోకి భక్తులను అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. దర్శనాలు, ఆర్జిత సేవలు నిలిపివేశారు.
బాలాలయంలో స్వామివారికి ఏకాంతంగా పూజలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో లాక్డౌన్ సడలింపు సమయం ఉదయం 6నుంచి సాయంత్రం 5వరకు ఉండటంతో భక్తులు వైకుంఠద్వారం వద్ద తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు.
ఇదీ చూడండి: CM KCR: 19 నుంచి పల్లె, పట్టణప్రగతి పనుల ఆకస్మిక తనిఖీ