ETV Bharat / state

తెలంగాణా నేలపై ఓ నయనమనోహరం.. యాదాద్రి

ప్రపంచ ప్రజానీకం పరవశించిపోయేంత వైభవం... తెలంగాణా నేలపై ఓ నయనమనోహరం... ఈ యాదాద్రి. నరసింహస్వామి స్వయంభువుడై వెలసిన గుట్ట ఇప్పుడు భక్తజనరంజకమైన శోభను సంతరించుకుంది. వైష్ణవ సంప్రదాయానుసారం పాంచరాత్ర ఆగమశాస్త్రోక్తంగా ఆవిష్కృతమైంది. ద్రవిడ వాస్తుశైలికి జీవం పోసింది. కాకతీయ, చాళుక్య, హోయసాల, పల్లవ శిల్పకళా నైపుణ్యాలను మేళవించింది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచనకు ప్రతిరూపంగా అహో యాదాద్రి అనిపించేలా నిలిచింది. చిన్నజీయర్‌ స్వామి పర్యవేక్షణలో ఏడుగోపురాల వైభవం విభవించింది.

author img

By

Published : Mar 29, 2021, 8:05 AM IST

yadadri temple
తెలంగాణా నేలపై ఓ నయనమనోహరం.. యాదాద్రి
తెలంగాణా నేలపై ఓ నయనమనోహరం.. యాదాద్రి

ఉగ్ర... భేరుండ... జ్వాలా... యోగానంద... లక్ష్మీనరసింహ. ఈ ఐదు రూపాల పంచనారసింహ క్షేత్రం యాదాద్రి మహాక్షేత్రమైంది. విశ్వమంతటి ప్రజలు విస్తుబోయేంత వినూత్న రీతిలో సాకారమైంది. గుహల్లో వెలిసిన స్వామికి గోపురాల వైభోగం. ఆ వైభవం ప్రపంచంలో మరెక్కడా లేనివిధంగా ఆవిర్భవించింది. వాస్తుశిల్పులు, స్థపతులు ఆధ్యాత్మికతను ఎక్కడా విస్మరించని రీతిలో, ధీటుగా నిలబెట్టారు. పూర్తిస్థాయి రాతి దేవాలయ నిర్మాణాన్ని పరిపూర్తి చేశారు. ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దారు. యాదాద్రీశుని ఆలయాన్ని ఆధ్యాత్మిక కళాకాంతుల నిలయంలా నిర్మించారు. భక్తజనావళికి కనువిందుగొలిపేలా శిల్పులు అత్యద్భుత గోపుర వైభవ యాదాద్రిని ఐదేళ్లలో కట్టి చూపారు.

ఐదవ ఉగ్ర నారసింహ స్వామి రూపంగా..

యాదాద్రి ఆలయం ప్రత్యేకత ఏమిటంటే నాలుగు దిక్కులనూ స్వామి చూస్తారు. స్వామి ఎటువైపు చూస్తే అటువైపు తూర్పుదిక్కుగా భావించాలంటారు పండితోత్తములు. ఈ పంచనారసింహ క్షేతంలో జ్వాలా నారసింహస్వామి, యోగనారసింహస్వామి, లక్ష్మీనారసింహ స్వామి, గండభేరుండ నారసింహస్వామి నాలుగుదిక్కులు చూస్తుండగా, ఐదవ ఉగ్ర నారసింహ స్వామి రూపంగా యాదగిరికొండను భక్తజనం కొలుస్తారు.

నలుదిశలా రాజగోపురాలు

అల్లంత దూరం నుంచే కన్పించే విధంగా నలుదిశలా రాజగోపురాలు సాక్షాత్కారమయ్యాయి. వాటిని చూస్తూ ఉండిపోతే మనం యాదాద్రిలో ఉన్నామా లేక తంజావూరులోనో, కంచి మహాక్షేత్రంలో ఉన్నామా, శ్రీరంగం, మధురై వంటి మహాక్షేత్రాలలో ఉన్నామా అని సంభ్రమాశ్చర్యాలకు లోనుచేస్తుంది. ఆలయ వాస్తు నిర్మాణ శాస్త్రంలో 16 రకాల గోపురాలుంటే వాటిలో మూడు రకాల గోపురాలు ఒకేఒక్క యాదాద్రి బృహద్ధాలయంలో ఉన్నాయి. గర్భాలయ నరసింహుడు పశ్చిమంవైపు చూస్తున్నట్లుంటాడు కనుక పశ్చిమ మాడవీధి, పశ్చిమ మహారాజగోపురం, వేంచేపు మంటపాలకు ఎనలేని ప్రాముఖ్యతను నిర్మాణంలోనే చూపారు. 72 అడుగుల ఎత్తైన ఏడంతస్తుల సప్తతల ఆగమ మహారాజగోపురం అంటే ఇదే...

గోపురవైభవ యాదాద్రి ఇదే..

సప్తతల మహారాజగోపురం తర్వాత పశ్చిమ, ఉత్తర, తూర్పు, దక్షిణ రాజగోపురాలు 55 అడుగుల ఎత్తైన పంచతల గోపురాలుగా జనాకర్షకమై చిద్విలాసంగా ఉన్నాయి. అంతరమాడవీధిలోనే ఈశాన్యాన ఉన్న త్రితల మూడంతస్తుల చిరురాజగోపురం అంతరాలయంలోకి తీసుకువెళుతుంది. 33 అడుగుల ఈ త్రితల కూడా బహు శిల్పమయంగా కానవస్తుంది. ఇక ఏడవ గోపురం దీనిని గోపురం అనకూడదు. స్వామివారి గర్భాలయం పైన ఉండే విమానం 45 అడుగులతో నరసింహుని కిరీటమానమై ఉంటుంది. అందుకే ఈ భవ్య విమానం బంగారు పూతతో సింగారమవుతోంది. దాదాపు రెండున్నర లక్షల టన్నుల ఒకే జాతి ఏక క్వారీ నుంచి వెలికితీసిన కృష్ణశిలతో నిర్మితమైన బహు బ్రహ్మమయ గోపురవైభవ యాదాద్రి ఇదే.

ఇదీ చదవండి: జానపదులు సైతం గానం చేస్తున్న యాదాద్రి స్థలపురాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.