యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన జనంతో దేవస్థానం కిటకిటలాడింది. స్వామివారి ధర్మదర్శనానికి రెండు, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.
కుటుంబ సమేతంగా లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు. కల్యాణ, వ్రత మండపాలు, ప్రసాద కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున కొండపైకి వాహనాలు అనుమతించడంలేదు.
ఇదీ చూడండి: శివరాత్రి వేడుకలకు హాజరు కావాలని మంత్రికి ఆహ్వానం!