రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో డొల్లతనం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రధానాలయంలోని మాఢవీధుల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల్లో నాణ్యత లోపంతో పాటు వాటి నిర్వహణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ప్రత్యేకమైన డిజైన్లతో తయారు చేయించి.. లోహపు దిమ్మెలతో ఏర్పాటు చేసిన ఈ విద్యుత్ దీపాలను ఆలయం చుట్టూ అమర్చారు. వీటిలో కొన్ని గాలి వేగాన్ని తట్టుకోలేక విరిగిపడ్డాయి. ప్రధానాలయం తూర్పు రాజగోపురం ముందున్న క్యూ లైన్లకు అమర్చిన విద్యుద్దీపాలు, ప్రహరీ గోడకు అమర్చిన పలు దీపాలు సైతం నేలకొరిగాయి.
మరికొన్ని విద్యుత్ దీపాలు వినియోగంలో లేక.. ఎండకు ఎండి, వానకు తడుస్తున్నాయి. భారీ వ్యయంతో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల నిర్వహణను అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ వర్షానికి కొండపై ఉన్న విద్యుత్ దీపాలు విరిగిపడిన ఘటనలు చోటుచేసుకున్నా.. అధికారులు మాత్రం సరైన చర్యలు చేపట్టకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి..
Yadadri temple: 'లక్ష్మీనరసింహస్వామి స్వర్ణ సింహాసనం సిద్ధం'
జీవచ్ఛవంలా చిన్నారి.. దేవుడిపైనే ఆశలు.. ఈటీవీ భారత్ కథనంతో...