Yadadri Temple News: మహాదివ్య క్షేత్రంగా పునర్నిర్మితమవుతోన్న యాదాద్రి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మార్చి 28 న మహాకుంభ సంప్రోక్షణ సందర్భంగా.. పనుల్లో వేగం పెరిగింది. ఆలయ గోపురాలు, దివ్య విమానంపై స్వర్ణ కలశాల ఏర్పాట్లకు యాడా చర్యలు చేపట్టింది. ఎత్తైన ఆరు రాజగోపురాల పైన, దివ్య విమానంపై శ్రీ సుదర్శన చక్రం ప్రతిష్ఠించనున్నారు. ప్రస్తుతం గోపురాలపై కలశాల స్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తయిన అనంతరం కలశాల స్థాపన జరగనుంది.
ఆహ్లాదకరంగా ఆలయ దారులు
యాదాద్రి క్షేత్రంలో పచ్చదనం, ఆహ్లాదం కోసం హరితహారాల పోషణ జరుగుతోంది. ఆలయ దారుల మధ్య రంగురంగుల పూల మొక్కలు, వైకుంఠ ద్వారం వద్ద పూల సోయగాలు కనువిందు చేస్తున్నాయి. కొండపైకి వెళ్లే మార్గంలో ఖాళీ స్థలాలు కనిపించకుండా గ్రీనరీ, పూల మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగిస్తున్నాయి.
ఇదీ చదవండి: KTR Rangareddy Tour : 'ప్రజల ప్రగతే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం'