యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో సందడి నెలకొంది. ఆదివారం.. సెలవు రోజు అయినందున భక్తులు కుటుంబసమేతంగా యాదాద్రికి వచ్చి స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. పెద్ద ఎత్తున వచ్చిన భక్తులతో కల్యాణ, వ్రత మండపాలు, లడ్డూ ప్రసాద కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి.
దర్శనానికి మూడు గంటలు
స్వామివారి ధర్మదర్శనానికి మూడు గంటలు సమయం పట్టగా... ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నందున ఆలయ అధికారులు కొండపైకి వాహనాలను అనుమతించట్లేదు.
ఇదీ చదవండిః ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థుల కొట్లాట